వైశాఖం, 2017 జూలై 21న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] విజె సినిమాస్ బ్యానరులో బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రానికి బి. జయ దర్శకత్వం వహించింది.[2] ఇందులో హరీష్, అవంతిక మిశ్రా,[3] సాయికుమార్ నటించగా, డిజే వసంత్ సంగీతం అందించాడు.[4]

వైశాఖం
సినిమా పోస్టర్
దర్శకత్వంబి. జయ
నిర్మాతబి.ఎ. రాజు
తారాగణంహరీష్
అవంతిక మిశ్రా
సాయికుమార్
ఛాయాగ్రహణంవాలిశెట్టి వెంకట సుబ్బారావు
కూర్పుబి. జయ
సంగీతండిజె వసంత్
నిర్మాణ
సంస్థ
విజే సినిమాస్
విడుదల తేదీ
2017, జూలై 21
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వేణు (హరీశ్‌) తన అవసరాల కోసం అందులో ఉన్న వారందరినీ ఏదో ఒక పనికోసం వాడుకొంటుంటాడు. కొన్నిరోజుల తరువాత ఆ అపార్ట్‌మెంట్‌లోకి భాను (అవంతిక) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. వేణు ప్రేమికురాలిని అంటూ అబద్ధం చెప్పి బ్యూటీపార్లర్ నడుపుతుంటుంది. వేణు ఎదురవడంతో అసలు సమస్య మొదలవుతుంది. దాంలో ఇద్దరూ ఒప్పందం కుదురుచుకుంటారు. తరువాత, వారి స్నేహం ప్రేమగా మారుతుంది. ఇద్దరికీ ఎప్పుడూ మనస్పర్ధాలు రావడం, గొడవపడటం జరుగుతుంది. అసలు భాను ఎవరు? ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది? వీరి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యింది అనేది మిగతా కథ.[5][6]

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు డిజె వసంత్ సంగీతం అందించాడు.[7][8]

  1. ప్రార్థిస్తానే - సాయి చరణ్
  2. కమాన్ కంట్రీ చిలకా- రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి
  3. వైశాఖం - అనురాగ్ కులకర్ణి, సత్య యామిని
  4. భానుమతి భానుమతి - సాయి చరణ్, రమ్య బెహారా
  5. దగ్గరగా రావోద్దిలాగ - సింహా, రమ్య బెహారా
  6. వైశాఖం (థీమ్ 1) - డిజే వసంత్
  7. వైశాఖం (థీమ్ 2) - డిజే వసంత్

మూలాలు మార్చు

  1. "Vaishakam (2017)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  2. "New faces make 'Vaishakam' refreshing". archive.telanganatoday.com. Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.
  3. "Working in Vaishakam made me understand basics of commercial cinema: Avantika". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-07-20. Retrieved 2021-06-05.
  4. "Vaishakam: An uneven love story". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.
  5. "వైశాఖం మూవీ రివ్యూ". Andhravilas. Archived from the original on 2017-08-01. Retrieved 2021-06-05.
  6. Telangaana, Great (2017-07-21). "Vaishakam Movie Review". Great Telangaana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-05.
  7. "Vaisakham Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-03-16. Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.
  8. admin. "Vaisakham (2017) Telugu Songs Download | Naa Songs" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-05. Retrieved 2021-06-05.

ఇతర లంకెలు మార్చు