వై.శివరామి రెడ్డి
ఎల్లారెడ్డి గారి శివరామి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుండి 2004 వరకు ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
వై.శివరామి రెడ్డి | |||
మాజీ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1999 - 2004 (ఎమ్మెల్యే) | |||
నియోజకవర్గం | ఉరవకొండ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 రాంపురం గ్రామం, మంత్రాలయం మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి, లలితమ్మ [1] | ||
బంధువులు | ఎల్లారెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి (తమ్ముడు), వై. బాలనాగిరెడ్డి (తమ్ముడు) , వై.వెంకటరామి రెడ్డి (తమ్ముడు)[2] | ||
సంతానం | వై.భీమిరెడ్డి | ||
నివాసం | ఉరవకొండ |
జననం, విద్యాభాస్యం
మార్చువై.శివరామి రెడ్డి 1963 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం, రాంపురం గ్రామంలో ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్) దంపతులకు జన్మించాడు. ఆయన బెంగుళూరు యూనివర్సిటీ నుండి బి.ఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చువై.శివరామి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో గుంతకల్లు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పై 8501 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రభుత్వ విప్‌గా పనిచేశాడు.[3]
వై.శివరామిరెడ్డి 2014 ఏప్రిల్ 15న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[4] 2014 ఏప్రిల్ 26న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాడు.[5] ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (6 November 2019). "ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ V6 Velugu (27 May 2019). "అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ iDreamPost (13 June 2020). "శాసనసభ చరిత్రలో ఈ అన్నదమ్ములు గెలుపు ఓ రికార్డు" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (15 April 2014). "కాంగ్రెస్‌కు శివరామిరెడ్డి రాజీనామా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (26 April 2014). "వైఎస్సార్‌సీపీలో చేరిన శివరామిరెడ్డి". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.