శంకర నారాయణ (గ్రామం)

శంకరనారాయణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో అరేబియా సముద్రానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడి శంకరనారాయణ దేవస్థానం పరశురామ క్షేత్రాలలొ ఒకటి. శివకేశవులు ఇద్దరు కలసి వెలసిన అరుదైన ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వతశ్రేణులలో ఉంది. ఇక్కడి ఈ ఉద్భవలింగాలను స్వయంభూగా చెబుతారు. గర్భగుడి లో రెండు లింగాలు ( శివ, కేశవ) భూమికి ఒక అడుగు క్రింద నీటిలో ఉంటాయి. శంకర లింగం కుడి వైపు కేశవ లింగం ఎడమ వైపు ఉంటాయి. పూజారి ఆయన దర్శనం(అద్దం) చూపించినప్పుడు భక్తులకు శంకర లింగం ఎడమ వైపు కేశవ లింగం కుడి వైపు కనిపిస్తాయి. శివలింగంపై కామధేనువు పాలు కురుపిస్తున్నందుకు సూచనగా విష్ణు లింగం కాలి గిట్టల గుర్తులు ఉన్నాయి. దేవాలయానికి ఆవల కోటి తీర్థం అనే తటాకం కలదు. అక్కడి పూజారులు భక్తులకు ఈ తీర్థం లో ప్రోక్షణ చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అక్కడ గుడి అంతా నీటి పై ఉంది అని చెబుతారు.

స్థల పురాణం మార్చు

పద్మపురాణం పుష్కర కాండలోని 24 వ అధ్యాయం ప్రకారం శివకేశవులు క్రోడ మహర్షి తపస్సు వేడుక పై ఖారాసురుడూ రత్తాసురుడూ అనే రాక్షసులను సంహరిస్తారు. అక్కడికి కొద్ది దూరంలో కొండపై క్రోడె మహర్షి గుహ ఉంది.

పండుగలు మార్చు

సంక్రాంతి మూడు రోజులు ఇక్కడ విశేషం.

బాహ్య లంకెలు మార్చు

  • శంకరనారాయణ దేవస్థానం సైటు[1]