ఉడిపి
ఉడుపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడుపిలో ఉంది.
Udupi | |
---|---|
City | |
![]() Udupi Sri Krishna Temple | |
నిర్దేశాంకాలు: 13°20′20″N 74°44′42″E / 13.3389°N 74.7451°ECoordinates: 13°20′20″N 74°44′42″E / 13.3389°N 74.7451°E | |
Country | ![]() |
State | Karnataka |
District | Udupi |
Member of the Parliament | Shobha Karandlaje |
Member of Legislative Assembly | K. Raghupati Bhat |
విస్తీర్ణం | |
• City | 68.23 km2 (26.34 sq mi) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 27 మీ (89 అ.) |
జనాభా వివరాలు | |
• City | 2,15,500 |
• సాంద్రత | 3,200/km2 (8,200/sq mi) |
• మెట్రో ప్రాంతం | 4,36,208 |
Languages | |
• Administrative | Kannada |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 576101 – 576108 |
Telephone code | 0820 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | KA-20 |
జాలస్థలి | www |
ఉడుపి జిల్లాను ఆగష్టు 1997లో యేర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడుపి, కుందాపుర, కార్కళ) కలిపి ప్రత్యేక ఉడుపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11, 12, 243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు, కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1, 177, 908, [3] |
ఇది దాదాపు. | తైమూర్ లెస్టే దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | రోలె ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 403 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 304 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 5.9%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1093:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 86.29%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
భౌగోళికసవరించు
ఉడిపి జిల్లా పశ్చిమ తూర్పున పశ్చిమ కనుమలు (వరల్డ్ హెరిటేజ్ సైట్) పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉన్నాయి. సముద్ర సమీపంలో ఉన్న భూమి చిన్న కొండలు, వరి పొలాలు, కొబ్బరి తోటలు, అడవులు, కొండ ప్రాంతాల్లోతో కప్పబడి ఉంటుంది తూర్పు పశ్చిమ కనుమల సరిహద్దు భూమి సాధారణంగా అడవులు కొన్ని భాగాలలో చాలా మందపాటి అరణ్యాలు ఉన్నాయి. హెబ్రి, సోమేశ్వర వద్ద " సోమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం " ఉంది. కొల్లూరు (ఉడిపి) సమీపంలో ఉన్న, " మూకాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ " ఉంది. కర్కలకు 16 కిలోమీటర్ల దూరంలో మాలా సమీపంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉంది. పరిసర ప్రాంతం కొల్లూర్ (ఉడుపి) దట్టమైన అడవులున్న, గ్రామాలు అటవీ ప్రాంతం మధ్య ఉన్నాయి. కుందాపూర్ తాలూకాలో, కర్కాల తాలూకాలోని కొన్ని భాగాలు మాలెనాడు అడవులు ఉన్నాయి. రెండు పచ్చదనం అలాగే సంస్కృతిలో ఒకదానిని ఒకటి పోలిఉన్నాయి. జిల్లాలో అరుదైన వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. పులి, రాజనాగం, జింక, అడవి దున్న మొదలైన అరుదైన జంతువులు ఉన్నాయి. జిల్లాలోని అడవిలో గులాబీ చెక్క, టేకు కలప, అరుదైన మొక్కలు, కొన్ని ఫంగస్ ఉన్నాయి.
విభాగాల వివరణసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
తాలూకాలు | 3 ఉడిపి, కుండపుర, కర్కల |
ప్రతిపాదించబడిన తాలూకాలు | బైందూర్, బ్రహ్మవర్ |
జిల్లా రూపకల్పన | 1997 ఆగస్ట్ |
అసెంబ్లీ నియోజక వర్గం | 5 కౌప్, ఉడిపి, కుండపుర, బైదూర్, కర్కల |
పార్లమెంటు నియోజక వర్గం | షిమోగా |
.
ఎన్నిక కాబడిన ప్రతినిధులుసవరించు
- ఎం.ఎస్. శోభా కరండ్లజె (ఉడిపి-చికమగాలూర్ లోకసభ నియోజకవర్గం) (బిజెపి)
- కర్ణాటక విధానసభ సభ్యులు
- మిస్టర్ ప్రమోద్ మధ్వరాజ్ (ఐ.ఎన్.సి) - ఉడిపి
- మిస్టర్ కలడి శ్రీనివాస్ శెట్టి (ఇండిపెండెంట్) - విహార
- మిస్టర్ గోపాల్ పూజారికి (ఐ.ఎన్.సి ) - బైందూర్
- మిస్టర్ వి సునీల్ కుమార్ (బిజెపి) - కర్కల
- మిస్టర్ వినయ్ కుమార్ Sorake (ఐ.ఎన్.సి) - కౌప్ (కర్ణాటక)
వ్యవసాయంసవరించు
ఉడిపి జిల్లాలో వరి, కొబ్బరి పుష్కలంగా పండించబడుతుంది. తరువాత పోక (వక్క) తోటలు. ముంతమామిడి కూడా పండించబడుతుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వ్యవసాయదారుల నుండి పాలను సేకరించి వినియోగదారులకు అందిస్తుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు జిల్లాలోని మణిపాల్ వద్ద డైరీ ప్రొసెసింగ్ ప్లాంటు ఉంది. సమీపకాలంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా పాలను సేకరించడం, ప్రొసెసింగ్ సస్థలను నిర్వహిస్తుంది.
చేపల పరిశ్రమసవరించు
జిల్లాలో మంచినీటి చేపలు, ఉప్పునీటి చేపలు పరిశ్రమలు ఉన్నాయి. మాల్పె, గంగొల్లి చేపలపరిశ్రమ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. అరేబియన్ సముద్రం చేపలపరిశ్రమకు ప్రధాన వనరుగా ఉంది.
వాణిజ్యం, పరిశ్రమసవరించు
జిల్లాలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ పరిశ్రమలు ఏవీ లేవు. అయినప్పటికీ జిల్లాకు కొన్ని ప్రముఖ పరిశ్రమలు రానున్నాయి. జిల్లాలో ఎర్రమట్టి పెంకులు (మంగుళూరు టైల్స్), ముంతమామిడి (జీడిపప్పు) కొబ్బరి నూనె పరిశ్రమలు ప్రకలకు వందలాది మందికి ఉపాది కలిగిస్తూ ఉన్నాయి. మణిపాల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. పై గ్రూప్‌కు చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ నుండి అత్యున్నత సెక్యూరిటీ సంబంధిత చెక్కులు, షేర్ సర్టిఫికేట్లు, మొబైల్ రీచార్జ్ కూపన్లు, పలు భారతీయ విశ్వవిద్యాల కొరకు ప్రశ్నాపత్రాలు ముద్రించబడుతున్నాయి. అవిభాజిత దక్షిణ కనరా 4 ప్రభుత్వరంగ బ్యాంకులకు పి.ఎస్.బి (., విజయాబ్యాంక్, కనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్) జన్మస్థలం. జిల్లాలో లైఫ్ ఇంసూరెంస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఉడిపి) డివిషనల్ ఆఫీస్ ఉంది. రోబోసాఫ్ట్ టెక్నాలజీస్ SourceHub India Pvt Ltd, డాటా ట్రీ ఐ.టి సర్వీసెస్, యునైటెడ్ స్పెక్ట్రం సొల్యూషంస్- మొబైల్ అప్లికేషంస్, మణిపాల్ వద్ద మణిపాల్ డిజిటల్ సిస్టంస్ వారి కార్పొరేట్ ఆఫీసులు, రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. రోబోసాఫ్ట్ ఉడిపికి అంతర్జాతీయ గురింపును తీసుకు వచ్చింది. నందికూర్ వద్ద నాగార్జునా గ్రూప్ విద్యుద్త్పత్తి కొరకు ఒక థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయబడింది. ఈ స్థాపించేసమయంలో పర్యావణ సంబంధిత వివాదాలు తలెత్తాయి. పదుబిద్రె వద్ద సుజలాన్ పవన విద్యుత్తు తయారీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. పదూర్ వద్ద కేంద్రప్రభుత్వం భూగర్భ పెట్రోలియం వెలికితీత కొరకు పనిచేస్తుంది.[6] పర్యావరణవాదులు ఇటువంటి పరిశ్రమల స్థాపన వలన అరణ్యాల పచ్చదనానికి భగంకలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు.
రవాణాసవరించు
ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి 17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మార్చబడింది), రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా [7] రత్నగిరి, ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ, హోస్పేటలతో అనుసంధానిస్తుంది.
రైల్వేసవరించు
కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు, రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి.
వాయు మార్గంసవరించు
జిల్లాకు అతి సమీపంలోని విమానాశ్రయం జిల్లాకేంద్రం ఉడిపికి 55 కి.మీ దూరంలో బజ్పె వద్ద " మంగుళూరు విమానాశ్రయం " ఉంది.
భాషలుసవరించు
ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ భాష, ఉర్దూ, కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి, దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా శిలాశాసనాలు జిల్లా, పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు, మంగోలోరియన్ కాథలిక్స్ కొంకణి భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష, నవయాథ్ వాడుకలో ఉంది.
చర్చిలుసవరించు
- ఎస్.టి. లారెంస్ - ష్రైన్ - ఉడిపి బస్ నుండి (ఉడిపి-కర్కల ఆర్డి ద్వారా) అత్తుర్, 35.5 కి.మీ
- రోమన్ - కాథలిక్- డియోసెస్ - ఆఫ్- ఉడిపి (మిలాగ్రెస్ కేథడ్రల్ చర్చి) - ఉడిపి బస్ స్టాప్ నుండి (జాతీయరహదారి 17 ద్వారా) కల్లియన్‌పురం 8.3 కి.మీ
- ఫాతిమా చర్చి అవర్ లేడీ - పెరంపల్లి ఉడిపి బస్ స్టాప్ నుండి, 5.5 కి.మీ (వయా గుండిబలి -మణిపాల్ ఆర్డి) .
- క్రీస్తు చర్చి Archived 2014-12-07 at the Wayback Machine - మణిపాల్ (మణిపాల్-కల్లసంక ద్వారా) 6.6 కి.మీ ఉడిపి బస్
- వైలంకని చర్చి కల్మాడి ఆఫ్ అవర్ లేడీ - ఉడిపి బస్ స్టాప్ నుండి 3.5 కి.మీ (ఆది ఉడిపి ద్వారా)
- Church Of Mother Of Sorrows Church - Udupi, ఉడిపి బస్ నుండి 0.75 కి.మీ
ఉడుపి వంటకాలుసవరించు
ఉడుపి వంటకాలు. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయి.. సాధారణము శాకాహార వంటకాలలో ఉడుపి శైలి వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి.[7] కర్ణాటక అంతటా ఉడిపి వంటలకు విశేష ఆధారణ ఉంది. ఉడిపి శైలి హోటల్స్ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. అలాగే తరువాత ప్రంపంచమంతా విస్తరించాయి. ఉడిపి రెస్టేరెంట్లు దక్షిణ భారతీయ శాకాహార వంటకాలను మాత్రమే అందిస్తుంటాయి. ముంబయి, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో రుచికరమైన శాకాహార వంటకాలకు, మర్యాదపూర్వకంమైన సేవలకు ఉడిపి హోటల్స్ ప్రసిద్ధి చెందాయి. నేయి వేసి దోరగా కాల్చిన దోశ మద్యలో ఉర్లగడ్డకూరను చేర్చి మడిచి పెట్టి వివిధ రకాల చట్నీలతో అందించే మసాలా దోశను ఉడిపి హోటళ్ళ రూపకల్పన అన్నది ప్రత్యేకత.[7]
వ్యక్తులుసవరించు
రాజకీయ నాయకులుసవరించు
- ఆస్కార్ ఫెర్నాండేజ్ - మాజీ కేంద్రమంత్రి
సాహిత్యంసవరించు
ఉడిపి జిల్లా పలువురు కన్నడ సాహిత్యకారులను అందించి కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుంది. ఙానపీఠ అవార్డ్ గ్రహీత డాక్టర్ షివరామ కరంథ్ జిల్లాలోని కుగ్రామం కోటలో జన్మించారు. ముఖ్యమైన రచయితలు
- డాక్టర్ కె శిరామ కృష్ణ, ఙానపీఠం అవార్డు విజేత, రచయిత, నవలా రచయిత, పర్యావరణవేత్త, డ్యాన్స్ సంస్కర్త మొదలైనవి
- గోపాలకృష్ణ అడిగ, కవి
- ప్రొఫెసర్ ఏ.వి. నవాడ.
- సంతోష్ కుమార్ గుల్వడి . జర్నలిస్టు, రచయిత
- బి.జనార్ధన్ భట్, సాహిత్య విమర్శకుడు
- జయరామ కారంత్, కవి
- ఉల్లూర్ మూకాజి, కవి
వ్యాపారవేత్తలసవరించు
- టి.ఎం.ఎ. పాయ్
- టి.ఎ. పాయ్
- బి.ఆర్. శెట్టి
- ఖాన్ బహదూర్ హాజీ అబ్దుల్లా సాహెబ్ స్థాపకుడు కార్పొరేషన్ బ్యాంకు
- హిదయతుల్లా అబ్బాస్ ఉచియ
- రాజ్ శెట్టి
- టి.ఎస్. భూదాన్ భాషా చైర్మన్ వక్ఫ్ బోర్డు కమిటీ, అధ్యక్షుడు, జమియ మసీదు ఉడిపి
కళ, సంస్కృతిసవరించు
యక్షగాన ప్రఖ్యాత నృత్య, నాటక సమ్మిశ్రిత జానపద సంప్రదాయ నృత్యరూపం. జిల్లాలో పలు యక్షగాన కళారూపాలు ఉన్నాయి. జిల్లాలో యక్షగాన శిక్షణాలయాలు ఉన్నాయి. నాగారాధనె జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించబడుతుంది. జిల్లాలో నాగరాధన సమయంలో నృత్యం, పూజ, రంగోలి మొదలైన కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భుటకోల, ఆటి కలెంజ, కద్యనాట మొదలైన రూపస్లలో జిల్లాలోని ప్రజలు ప్రకృతి ఆరాధన చేస్తుంటారు. గ్రామాలలో ప్రజలు కంబల, కోడిపందాలు, లగోరి, గిల్లి దండ మొదలైన క్రీడలను వీక్షిస్తుంటారు.
నాటకంసవరించు
సంప్రదాయ నాటకరూపాలు జిల్లాలో సజీవంగా ఉన్నాయి. జిల్లాలో స్కూల్ డే, కాలేజీ డే వంటి సందర్భాలలో ప్రాంతీయవాసులు నాటకప్రదర్శన ఇవ్వడం నాటకపోటీలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి.
ఉడిపి జిల్లా నుండి యక్షగాన కళాకారులుసవరించు
- దివంగత కళింగ నవద
- దివంగత నరనప్ప ఉప్పూర్
- వీరభద్ర నాయక్
- వందరు బసవ
- రాఘవేంద్ర మైయ్య
- లేట్ రామ నైరి బ్రహ్మవర
- లావణ్య కల్వ వ్రంద బైందూర్
- లేట్ హరది రామ గానిగా
- కొలలి కృష్ణ శెట్టి
- సందేశ్ శెట్టి గొర్రెలు
- ఊల్లూర్ శంకర్ డెవదిగ
- దినేష్ శెట్టి బెప్దె భగవథ్
- కొలలి కృష్ణ శెట్టి
పర్యాటక ప్రదేశాలుసవరించు
తీరాలుసవరించు
- మాల్పె :- ఉడిపి నుండి 6 కి.మీ దూరంలో ఉన్న మాల్పె చేపలపరిశ్రమకు, నౌకావ్యాపారానికి కేంద్రం.
- సెయింట్ ఐలాండ్ (కర్నాటక) :- మాల్పె వద్ద అరేబియన్ సముద్రంలో ఉంది.
- కౌప్ (కర్నాటక) :- ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బీచ్, లైట్ హౌస్ ఉన్నాయి.
- మరవంతె :-ఉడిపి నుండి 42 కి.మీ దూరంలో ఉంది. అరేబియన్ సముద్రం, సౌపర్ణిక నదుల మద్య జాతీయరహదారి 65 లో ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుంది
అయినప్పటికీ నిరంతరం సముద్రం చొచ్చుకుని వస్తున్న కారణంగా మూసివేయబడిన జాతీయ రహదారి 17 రహదారి ఇప్పటికీ ఉనికిలో ఉంది. మరవంతె దగ్గర నుండి నది యు టర్న్ తిరిగి తూర్పు దిశగా ప్రవహించి 10 కి.మీ ప్రవహించిన తరువాత కుందపురాను చేరుతుంది.
- ఒథినానె :- ఇది ఎత్తైన పర్వతాల పక్కన ఉన్న పరిశుభ్రమైన సముద్రతీరం.
ఆలయాలుసవరించు
- ఉడిపిలో ప్రముఖ ఉడిపి కృష్ణాలయం ఉంది.[7]
- ప్రముఖ వైష్ణవ గురువు శ్రీ మధ్వాచార్యులు ఉడిపి నుండి తన ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించాడు.
- కుట్టపల్లి సుభహ్మణాలయాలకు ప్రసిద్ధి. సుభహ్మణ్య షష్టి (నవంబరు- డిసెంబరు) నాడు ఈ ఆలయాలకు వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలయం (కనంగి ఆలయం) ఉంది. ఇక్కడ సత్యయుగ యోగాశ్రమ, రామకృష్ణ భజన మందిరం ఉన్నాయి.
కృష్ణాలయంసవరించు
ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు), వామభాగాన గరుడ విగ్రహం ఉంది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచార్యులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
అష్ట మఠాలుసవరించు
ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.
దగ్గరలోని కొన్ని ముఖ్య ప్రదేశాలుసవరించు
- కోల్లూరు ముకాంబికా దేవాలయం
- మరవంతె బీచ్
- మల్పే రేవు
- కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు)
- కార్కళ లోని గోమటేశ్వరుడు
- వేణూరు లోని గోమటేశ్వరుడు
- కార్కళ సెయింట్ లారెన్స్ ఇగర్జి
- సెయింట్ మేరీస్ ద్వీపం
- మూడబిదరెలో సావిరకంబద బసది
- మణిపాల్
- బైందూరు కోసళ్ళి జలపాతము
జామియా మసీదుసవరించు
- 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18, 000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలు నిర్మించబడ్డాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.
- పాజక :- ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేసిన ప్రదేశం ఉంది.
- కొల్లూరు (ఉడిపి) :- ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రదేశం మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తులు విశ్వసిస్తున్నారు. తమిళనాడు, కేరళా నుండి ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు.
- కర్కల :- ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ఉన్నాయి. ఇక్కడ ఇంకా పుదుతిరుపతి శ్రీ వెంకటరమణ ఆలయం, అత్తూర్ సెయింట్ లారెన్స్ చర్చి, శ్రీ హోసమారిగుడి ఆలయం, శ్రీ ఉచ్చంగి మరియమ్మ ఆలయం, శ్రీ అనంతపద్మనాభ ఆలయం, శ్రీ పద్మావతి టెంపుల్, శ్రీ మహాలింగేశ్వర దేవాలయం, శ్రీ సిద్ధివినాయక ఆలయం, శ్రీ ఉమామహేశ్వర ఆలయం, సల్మార్ జామా ఉంటాయి మసీదు మొదలైన ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి.
- అనెగుడ్డె :- ఉడిపి నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
- ఆత్తుర్ చర్చి :- ఉడిపి నుండి 25 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వార్షికంగా నిర్వహించబడే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తుంటారు.
- బర్కూర్ :- ఉడిపి నుండి 15కి.మీ దూరంలో ఉంది. పలు ఆలయాలు జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధానిగా ఉండేది.
- సాలిగ్రామ :- ఉడిపి నుండి 27కి.మీ దూరంలో ఉంది. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
- పరంపల్లి :- ఇక్కడ 800 వందల పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
- పెర్నకిల :- ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
- పెర్దోర్ :- ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది. అగుంబే - షిమోగా రాష్ట్రీయ రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. మాస సంక్రాంతి రోజున ఈ ఆలయంలో విశేషపూజలు నిర్వహించబడుతున్నాయి. ఈ పూజలు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
- హరియాద్క :- ఉడిపి నుండి 16 కి.మీ దూరంలో ఉంది. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
- శంకరనారాయణ :- ఉడిపి నుండి 40 కి.మీ దూరంలో ఉంది. శకరనారాయణాలయం ఒక సరోవరం మద్యన ఉండడం విశేష ఆకర్షణ. ఆలయ ప్రధాన దైవాలు శంకరుడు - నారాయణుడు.
- మారనకట్టె :-ఉడిపి నుండి 45 కి.మీ దూరంలో ఉంది. పశిమకనుమలలోని దట్టమైన అరణ్యాలమద్య ఉన్న ఈప్రాంతం ప్రకృతి ఆరాధకుల స్వర్గభూమిగా ఉంటుంది.
- మందర్హి :- ఉడిపి నుండి 20 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇవ్వబడే " దోశ" సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక్కడకు దేశవిదేశాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు.
- ముదుహోలె కర్కడ :- ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశం అంతటి నుండి భక్తులు వస్తుంటారు. ఆలయంలో నవరాత్రికి విశేషపూజ నిర్వహించబడుతుంది.
ఇక్కడ ధనుర్మాసం 4వ రోజు నిర్వహించే పూజకు భక్తులు విశేషంగా వస్తుంటారు.
వన్యప్రాణుల అభయారణ్యాలుసవరించు
ఉడిపి జిల్లాలో దట్టమైన సతతహరితారణ్యాలు ఉన్నాయి. ఇవి పశ్చిమకనుమలు, సహ్యాద్రి పర్వతారణ్యాలలో భాగమై ఉన్నాయి. అరణ్యాలలో ఉత్తనతమైన వృక్షజాల మైరియు జంతుజాల సంపద ఉంది.
- సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం :-ఇది ఉడిపి నుండి 40 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
- మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం :- ఇది ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. కుందపూర్- కొల్లూర్ రోడ్డు పక్కన విస్తరించి ఉంది. పర్యాటక చిత్రపటంలో ఇది చేర్చబడలేదు.
జలపాతాలుసవరించు
- కుర్ధు తీర్ధ జలపాతాలు :- ఉడిపి నుండి 42 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమల లోని దట్టమైన అరణ్యాల మధ్య ఉంది. ఇది ఒక అందమైన జలపాతం. ఇది ఫిబ్రవరి- మే మాసాల మధ్య బలహీనంగా ప్రవహిస్తుంది. జలపాతం ఎత్తు 300 అడుగులు. ఇది నేరుగా ఒక మడుగులోకి చేరుతుంది. ప్రాంతీయ ప్రజలు దీనిని పవిత్రంగా భావిస్తుంటారు. వేలాది సంవత్సరాలముందు ఋషులు ఇక్కడ తపసు చేసారు కనుక ఇది అతి పవిత్రమైనదిగా భావిస్తున్నారు.
- మంగ తీర్ధ :- కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మద్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
- బర్కన జలపాతం:- ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది. ఉడిపి - శివమొగ్గ రహదారి మార్గం నుండి 45 నిముషాల నడకద్వారా జలపాతం చేరుకోవచ్చు.
- బెల్కల్ తీర్థ జలపాతం :- ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమలలో ఉంది. ఇది 400 అడుగుల ఎత్తులో ఉంది. ఫిబ్రవరి - మేమాసాలలో ఇది ఎండి పోతుంది.
- అరసిన గుండి :- ఇది డాలి గ్రామం వద్ద అరణ్యాల మద్య ఉన్న అందమైన జలపాతం.
- జొమ్లు తీర్థ :- ఉడిపి నుండి 35 కి.మీ దూరంలో బెల్వె ఉంది., [8] ఇది సీతనదీ జజాలతో ఏర్పడిన 20 అడుగుల ఎత్తైన చిన్న జలపాతం. ఈ నది మీద ఇది రెండవ జలపాతం. మొదటి జలపాతం కుద్లు తీర్థ.
- కొసల్లి జలపాతం :- ఇది కుందపూర్ తాలూకాలోని బైందూర్ వద్ద ఉంది. ఇది జిల్లా ఉత్తర సరిహద్దులో ఉన్న అందమైన జలపాతం.
నది ద్వీపాలుసవరించు
నదులు సౌపర్నిక, స్వర్న, చక్రానది, సీతా, వర్హి నది, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి. త్రాగునీరు, విద్యుత్తు, ప్రయాణ వసతులు మొదలైన మౌలిక సదుపాయాలు లేవు. ఉదాహరణగా నదీద్వీపాలలో సుల్ కుర్దు, కన్నడ కుర్దు, బబ్బు కుర్దు, కట్టె కుర్దు, బెన్నె కుర్దు, కుక్కుడె కుర్దు, తిమ్మన్న కుర్దు, పాడు కుర్దు, హట్టి కుర్దు, బాల్ కుర్దు, బవలి కుర్దు, షెట్టి కుర్దు, ఉప్పిన కుర్దు, కురు, జరు కుర్దు ఉన్నాయి.
ప్రత్యేక తులునాడు రాష్ట్రానికి డిమాండ్సవరించు
స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ, ఉడిపి, కేరళ రాషంలోని కాసరగాడ్ జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు, ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. .[9][10][11][12]
ఇది కూడ చూడుసవరించు
- ఉడుపి
- ఉడిపి వంటకాలు
- దక్షిణా కన్నడ
- మంగుళూరు
- పాజక
- శ్రీ కృష్ణ మఠం
- మధ్వాచార్యులు
- కనసదాసు
- పురందరదాసు
మూలాలుసవరించు
- ↑ "Udupi District Population Census 2011, Karnataka literacy sex ratio and density". census2011.co.in. Retrieved 24 September 2018.
- ↑ "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). Retrieved 24 September 2018.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Timor-Leste 1,177,834 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567
- ↑ "Work begins on strategic petroleum reserve in Mangalore". The Hindu. Chennai, India. 2009-05-28. Archived from the original on 2009-05-31. Retrieved 2015-02-05.
- ↑ 7.0 7.1 7.2 7.3 Abram, David; Edwards, Nick (2003). The Rough Guide to South India. London: Rough Guides. p. 51. ISBN 978-1-84353-103-6.
- ↑ [1]
- ↑ [dead link]
- ↑ "News headlines". Archived from the original on 2012-03-04. Retrieved 2015-02-05.
- ↑ "Tulu organisations to meet soon". The Hindu. Chennai, India. 6 March 2008. Archived from the original on 4 మార్చి 2012. Retrieved 5 ఫిబ్రవరి 2015.
- ↑ "Beltangady Litterateur Kudyady Vishwanath Rai Voices Need for Tulunadu State". Archived from the original on 2020-01-11. Retrieved 2015-02-05.
బయటి లింకులుసవరించు
- Official Website of Udupi district
- Udupi District Tourism Information
- Comprehensive information on Udupi Archived 2007-02-07 at the Wayback Machine
- Know about Udupi
- South Canara Gazetteer 1973
- News from Udupi, Manipal, Kundapura, Brahmavara, Karkala, Padubidri
- News from entire Udupi district and surrounding areas