శివునిపల్లి

తెలంగాణ, జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూrర్ మండలం లోని జనగణన పట్టణం

శివునిపల్లి, జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలానికి చెందిన గ్రామం, జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

శివునిపల్లి
—  జనగణన పట్టణం  —
శివునిపల్లి is located in తెలంగాణ
శివునిపల్లి
శివునిపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°49′47″N 79°24′10″E / 17.8298402°N 79.4028639°E / 17.8298402; 79.4028639
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ
మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,242
 - పురుషుల సంఖ్య 2,960
 - స్త్రీల సంఖ్య 3,282
 - గృహాల సంఖ్య 1,351
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయితీ మార్చు

ఈ గ్రామ పంచాయతీ 1959 జూన్ 13న ఏర్పడింది. ఈ వూరికి సర్పంచిగా మొదట కౌకోటి రంగనాధ్ ఎన్నికైనాడు. అనంతరం వార్డు సభ్యులూ, సర్పంచి అందరూ కలసి గ్రామాభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్ళి, దేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిసారు. అపుడు వరంగల్ ఎం.పిగా మధుసూదనరావు ఉన్నారు.

విశేషాలు మార్చు

ఇక్కడ పండించే ధాన్యానికి మంచి పేరుండేది. ఆ రోజులలోనే ఉడికించిన బియ్యాన్ని చెన్నైకి పంపేవారు.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఏర్పడి చాలా కాలమైంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం కె. విజయ ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు.

గ్రామ జనాభా మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 6,242 - పురుషుల సంఖ్య 2,960 - స్త్రీల సంఖ్య 3,282 - గృహాల సంఖ్య 1,351

మూలాలు మార్చు

  1. "Villages & Towns in Ghanpur (Station) Mandal of Warangal, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-30.
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)

వెలుపలి లింకులు మార్చు