శిశ్ రామ్ ఓలా ( 1927 జూలై 30- 2013 డిసెంబరు 15) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. శిశ్ రామ్ ఓలా 4 దశాబ్దాలకు పైగా రాజస్థాన్ రాజకీయాలను శాసించాడు. శిశ్ రామ్ ఓలా ఏడు పర్యాయాలు రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు ఐదు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1][2] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[3]

శిశ్ రామ్ ఓలా
భారత కార్మిక శాఖ మంత్రి
In office
2013 జూన్ 17 – 2013 డిసెంబర్ 15
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుమల్లికార్జున్ ఖర్గే
నియోజకవర్గంజుంఝును లోక్‌సభ నియోజకవర్గం
పార్లమెంట్ సభ్యుడు
In office
1996–2014
అంతకు ముందు వారుఆయుబ్ ఖాన్
తరువాత వారుసంతోష్ అహ్లావత్
భారత గనుల శాఖ మంత్రి
In office
2004 నవంబర్ 27 – 2009 మే 22
వ్యక్తిగత వివరాలు
జననం(1927-07-30)1927 జూలై 30
జుంఝును రాజస్థాన్ [భారతదేశం]]
మరణం2013 డిసెంబరు 15(2013-12-15) (వయసు 86)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిషీబాయి
సంతానం3
పురస్కారాలుపద్మశ్రీ (1968)
As of జూన్ 30, 2013
Source: [1]

రాజకీయ జీవితం

మార్చు

శిష్ రామ్ ఓలా 1957 నుండి 1990 వరకు రాజస్థాన్ శాసనసభ సభ్యునిగా అత్యధిక కాలం పనిచేశారు . ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శిశ్ రామ్ ఓలా, 1980 నుండి 1990 వరకు, ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రి గా కూడా పనిచేశాడు. 1993 నుంచి 1996 వరకు ఆయన రాజస్థాన్ శాసన సభ్యుడిగా పనిచేశారు. 1996లో, శిశ్ రామ్ ఓలా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. పార్లమెంట్ కి ఎన్నికైన తర్వాత ఆయన 1996 నుండి 97 వరకు భారత రసాయనాల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత 1997 నుంచి 1998 వరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

మంత్రిగా పనిచేసిన తరువాత, శిశ్ రామ్ ఓలా 1998, 1999, 2004 2009 వరుసగా నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 మే 23 నుండి 2004 నవంబరు 27 వరకు శిశ్ రామ్ ఓలా, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భారత గనుల శాఖ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. శిశ్ రామ్ ఓలా కుమారుడు, బిర్జేంద్ర ఓలా, రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు .[4]

శిశ్ రామ్ ఓలా 1968లో భారతదేశ నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు.[5]

అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీని కూడా స్థాపించాడు. 2002లో కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.

2013 డిసెంబరు 15న గుండెపోటు కారణంగా గుర్గావ్‌లోని ఆసుపత్రిలో శిష్ రామ్ ఓలా చికిత్స పొందుతూ మరణించారు. గుండెపోటు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.[6]

మూలాలు

మార్చు
  1. "SHISH RAM OLA(Indian National Congress(INC)):Constituency- Jhunjhunu(RAJASTHAN) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2024-03-14.
  2. "Jhunjhunu news: पूर्व केंद्रीय मंत्री स्व. शीशराम ओला को किया याद, 5 बार रहे सांसद ओला". Zee News (in హిందీ). Retrieved 2024-03-14.
  3. "Sis Ram Ola, an unmatched leader from Shekhawati region". The Times of India. 2013-12-16. ISSN 0971-8257. Retrieved 2024-03-14.
  4. "Ola, Shri Sis Ram". Archived from the original on 16 February 2008. Retrieved 2008-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). Fourteenth Lok Sabha Members Bioprofile
  5. "Padma Shri Awardees". Archived from the original on 3 March 2009. Retrieved 2012-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) india.gov.in
  6. Cabinet minister Sis Ram Ola passes away – Times Of India