శుక్రవారము (Friday) అనేది వారములో ఆరవ రోజు. ఇది గురువారమునకు, శనివారమునకు మధ్యలో ఉంటుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు. ఈ రోజునే కొత్తపనులు ప్రారంభిస్తారు. తెలుగు చలన చిత్రసీమలో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలుగానీ, విడుదలలుగానీ శుక్రవారం రోజునే జరుగుతాయి.

తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన శ్రావణ శుక్రవారం వచ్చేది ఈరోజునే. శ్రావణమాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.

భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారము అని పిలువబడుతుంది.

ముస్లిం లకు శుభదినం, ప్రత్యేక ప్రార్థనా రోజు.