శుభ్ర అయ్యప్ప
శుభ్ర అయ్యప్ప భారతీయ సినిమా నటి. 2014లో తెలుగులో వచ్చిన ప్రతినిధి సినిమాలో తొలిసారిగా నటించిన శుభ్ర అయ్యప్ప కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.[1][2]
శుభ్ర అయ్యప్ప | |
---|---|
జననం | జనవరి 1, 1991 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జననం
మార్చుశుభ్ర 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది. ఈవిడ తల్లిపేరు చిత్ర. బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.
సినీరంగం
మార్చుచిన్నప్పటినుండి మోడలింగ్, సినిమా రంగాలపై ఉన్న ఆసక్తితో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన శుభ్ర, వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాలో తొలిసారిగా కనిపించింది. అటుతరువాత నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించింది.[3] 2015లో విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ నటించిన సగప్తం సినిమాతో తమిళ సినిరంగంలోకి ప్రవేశించింది.[4] 2015లోనే వచ్చిన వజ్రకాయ కన్నడ సినిమాతో కన్నడ సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో వెనిస్ నగరంలో చిత్రీకరించిన పాటలో నటించింది.[5] ఈ సినిమాలోని శుభ్ర నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.[6][7] యవ్వనం ఒక ఫాంటసీ అనే సినిమాలో కూడా నటించింది.[8]
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
2014 | ప్రతినిధి | సునైన | తెలుగు | మొదటి చిత్రం |
2015 | సగప్తం | ప్రియ | తమిళం | మొదటి చిత్రం |
వజ్రకాయ | గీత | కన్నడం | మొదటి చిత్రం | |
యవ్వనం ఒక ఫాంటసీ [9] | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "Shubra Aiyappa is addicted to belly dancing". The Times of India.
- ↑ "Shubra Aiyappa is on cloud nine". The Times of India.
- ↑ "I'm an actor by chance: Shubra Aiyappa". The Times of India.
- ↑ "Sagaptham Movie Review". The Times of India.
- ↑ "Shubra Aiyappa to make her Kannada debut". The Times of India.
- ↑ "Shivarajkumar gets candid with Shubra Aiyappa". The Times of India.
- ↑ "Fresh Talent Shines in Vajrakaya". The New Indian Express. Archived from the original on 2015-10-30. Retrieved 2019-06-17.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (16 April 2015). "వినోదాత్మకంగా 'యవ్వనం ఒక ఫాంటసీ'". Archived from the original on 17 June 2019. Retrieved 17 June 2019.
- ↑ ఆంధ్రభూమి, రివ్యూ (11 December 2015). "వెంటాడే పీడకల". Archived from the original on 14 December 2015. Retrieved 17 June 2019.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శుభ్ర అయ్యప్ప పేజీ