శృతి చౌదరి
శృతి చౌదరి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఒకసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై, 2024 శాసనసభ ఎన్నికలలో భివానీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో 17 అక్టోబర్ 2024న మహిళ & శిశు అభివృద్ధి, నీటిపారుదల & నీటి వనరుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.
శృతి చౌదరి | |||
మహిళలు & శిశు అభివృద్ధి, నీటిపారుదల & నీటి వనరుల శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | కిరణ్ చౌదరి | ||
నియోజకవర్గం | తోషం | ||
17 అక్టోబర్ 2024
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | కుల్దీప్ బిష్ణోయ్ | ||
తరువాత | ధరంబీర్ | ||
నియోజకవర్గం | భివానీ మహేంద్రగఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూఢిల్లీ , భారతదేశం | 1975 అక్టోబరు 3||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం)[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2005–2024)[2] | ||
తల్లిదండ్రులు | సురేందర్ సింగ్, కిరణ్ చౌదరి | ||
జీవిత భాగస్వామి | అరుణాభ్ చౌదరి | ||
నివాసం | భివానీ |
జననం, విద్యాభాస్యం
మార్చుశృతి చౌదరి 3 అక్టోబర్ 1975న కిరణ్ చౌదరి, సురీందర్ చౌదరి దంపతులకు జన్మించింది. ఆమె ఢిల్లీలో పాఠశాల విద్యను కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్.కె పురంలో పూర్తి చేసి ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో కొంతకాలం చదివి భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బిఎ, ఆగ్రాలోని బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకుంది. శృతి చౌదరి హర్యానా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ చిన్న కుమారుడు దివంగత సురేందర్ సింగ్ కుమార్తె.[4]
రాజకీయ జీవితం
మార్చుశృతి చౌదరి 2005లో తన తండ్రి మరణంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి 2009 భారత సార్వత్రిక ఎన్నికల్లో భివానీ-మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి అజయ్ సింగ్ చౌతాలాపై 55,097 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై పార్లమెంటులో వ్యవసాయం, మహిళల సాధికారత కోసం లోక్‌సభ కమిటీలలో పని చేసింది. ఆమె 2014, 2019లో లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయింది.
శృతి చౌదరి 2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆమె 2024 శాసనసభ ఎన్నికలలో భివానీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5][6] నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో 17 అక్టోబర్ 2024న మహిళ & శిశు అభివృద్ధి, నీటిపారుదల & నీటి వనరుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[7][8]
మూలాలు
మార్చు- ↑ "Ahead Of Poll, BJP Now Has Members From Haryana's 3 Big Political Families". NDTV.
- ↑ The Hindu (18 June 2024). "Kiran Choudhry and daughter quit Congress, set to join BJP" (in Indian English). Retrieved 4 November 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The New Indian Express (29 August 2024). "Haryana: Former CM Bansi Lal's grandchildren to contest against each other in Tosham" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Tosham Assembly Result: BJP's Shruti Choudhry Wins" (in ఇంగ్లీష్). Retrieved 4 November 2024.
- ↑ "Shruti Choudhry wins Tosham in Haryana polls, defeats cousin Anirudh". 8 October 2024. Retrieved 4 November 2024.
- ↑ India Today (21 October 2024). "Haryana government allocates portfolios; Nayab Saini keeps home, finance" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Retrieved 26 October 2024.