శెట్టిపల్లె రఘురామిరెడ్డి

శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఎస్‌.రఘురామిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019- ప్రస్తుతం
నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 20 జూన్ 1946
నక్కలదిన్నె గ్రామం , చాపాడు మండలం , వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి , సుబ్బమ్మ
జీవిత భాగస్వామి ప్రభావతమ్మ
సంతానం నాగిరెడ్డి, అశోక్‌రెడ్డి, దుశ్యంత్‌రెడ్డి, సుధా

జననం, విద్యాభాస్యం మార్చు

ఎస్‌.రఘురామిరెడ్డి 20 జూన్ 1946లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైఎస్ఆర్ జిల్లా , చాపాడు మండలం , నక్కలదిన్నె గ్రామం లో శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి , సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన విజవాడలో పదవ తరగతి పూర్తి చేసాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

ఎస్‌.రఘురామిరెడ్డి 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ప్రొద్దుటూరు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. ఎల్. రవీంద్రా రెడ్డి పై ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.

ఆయన 1989లో ఓటమి పాలై తిరిగి 1994లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎస్‌.రఘురామిరెడ్డి 2004, 2009లో ఓటమి పాలయ్యాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

పోటీ చేసిన స్థానం మార్చు

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2019 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం
2014 శెట్టిపల్లె రఘురామిరెడ్డి వై.యెస్.ఆర్. కాంగ్రెస్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం
2009 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
2004 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1999 శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్
1994 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1989 డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం
1985 శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డి కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Sakshi (24 May 2019). "కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  3. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.