శేఖర్ సూరి

సినీ దర్శకుడు

శేఖర్ సూరి ఒక సినీ దర్శకుడు.[1] తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.[2] తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా.[3] ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.

శేఖర్ సూరి
జననం
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
వృత్తిసినీ దర్శకుడు
శేఖర్ సూరి

వ్యక్తిగత వివరాలు

మార్చు

శేఖర్ సూరి పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన గాడ్ ఫాదర్ ధారావాహిక అంటే ఇష్టంగా చూసేవాడు. అప్పుడు ప్రారంభమైన ఆ ఆసక్తి అతను గ్రాడ్యుయేషన్ లో చేరే దాకా కొనసాగింది. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేరాడు. చాలా రోజులు హైదరాబాదులో ఉన్నాడు. సినిమా రంగంమీద ఆసక్తితో చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి అవకాశాల కోసం ముంబైకి ప్రయాణమయ్యాడు.[4]

శేఖర్ సూరి అసలు పేరు ఎస్. ఎస్. చంద్రశేఖర్, అయితే సినిమా పరిశ్రమలో చంద్రశేఖర్ పేరుతో చాలామంది కళాకారులు ఉండటంతో కొత్తగా ఉండటం కోసం శేఖర్ సూరిగా మార్చుకున్నాడు. తెలుగులో మరో ప్రముఖ దర్శకుడైన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇతనికి బంధువు.

కెరీర్

మార్చు

సినిమా దర్శకుడు కావాలనే కోరికతో ముంబై చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెన్సు తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు, సినిమాలకు ఘోస్ట్ రచయితగా పనిచేశాడు. సంజయ్ దత్ తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ హైదరాబాదు చేరుకున్నాడు. తరువాత హైదరాబాదులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ స్నేహితుడి సాయంతో హీరో తరుణ్ తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో అదృష్టం అనే సినిమా తీశాడు. రోమన్ హాలిడే అనే ఓ హాలీవుడ్ చిత్రం తరహాలో చిత్రాన్ని తీశాడు. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత కొద్దిగా సమయం తీసుకుని తనకిష్టమైన థ్రిల్లర్ బాణీలో సొంతంగా తనే ఓ కథ తయారు చేసుకున్నాడు. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, మోనా చోప్రా ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన ఎ ఫిల్మ్ బై అరవింద్ మంచి విజయం సాధించింది. బాలనటుడిగా పరిచమై అప్పటి దాకా పెద్దగా అవకాశాలు లేని రిషికి ఈ సినిమా తర్వాత ఏడు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. దీని తర్వాత అదే బాణీలో త్రీ, అరవింద్ 2 సినిమాలు కూడా తీశాడు.

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఐడిల్ బ్రెయిన్ లో శేఖర్ సూరితో ముఖాముఖి". idlebrain.com. జీవి. Retrieved 9 November 2016.
  2. "బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 9 November 2016.
  3. "ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష". idlebrain.com. జీవి. Retrieved 9 November 2016.
  4. "శేఖర్ సూరి". tollywoodtimes.com. Retrieved 9 November 2016.[permanent dead link]

బయటి లింకులు

మార్చు