శ్రియా శర్మ

సినీ నటి

శ్రియా శర్మ ఒక భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాల్లో నటించింది. ఈమె తన మూడేళ్ళ వయసులో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

శ్రియా శర్మ(shriya sharma)
జననం (1992-04-09) 1992 ఏప్రిల్ 9 (వయసు 32)[1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
పురస్కారాలుజాతీయ ఉత్తమ బాలనటి పురస్కారం
వెబ్‌సైటుhttp://www.shriyasharma.in

వ్యక్తిగతం

మార్చు

శ్రియా శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వికాస్ శర్మ ఇంజనీరు. తల్లి రితు పోషకాహార నిపుణురాలు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. ఆమె ఐ.సి.ఎస్.ఈ పదో తరగతి లో 91%, సీ.బీ.ఎస్.ఈ పన్నెండో తరగతిలో 95% మార్కులు సాధించింది. ప్రస్తుతం ముంబై విశ్వవిద్యాలయంలో చదువుతోంది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతుర వివరాలు
2005 జై చిరంజీవ లావణ్య తెలుగు భాల్య నటిగా
2006 బీనామ్ అజయ్ దేవగణ్ కూతురు హిందీ
2006 సిల్లును ఒరు కాదల్ ఐశ్వర్య గౌతమ్ తమిళం
2007 సౌందర్య సంజన కన్నడం
2007 లాగ చునారీ మే దాగ్ హిందీ
2008 తోడా ప్యార్ తోడా మ్యాజిక్ అదితి వాలియా హిందీ
2010 ప్రేమ్ కా గేమ్ పింకీ హిందీ
2010 రోబో జిజ్ఞాసగల విద్యార్థి తెలుగు
2010 నాక్ అవుట్ స్వీటీ హిందీ
2011 చిల్లర్ పార్టీ టూత్ పేస్ట్ హిందీ
2011 దూకుడు సుశాంతి తెలుగు
2012 రచ్చ చైత్ర సోదరి తెలుగు
2013 తూనీగ తూనీగ చిన్నప్పటి నిధి తెలుగు
2012 నీదానె ఎన్ పొన్వసంతం కావ్య తమిళం
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు కావ్య తెలుగు
2014 గాయకుడు అక్షర తెలుగు కథానాయికగా తొలి చిత్రం
2015 బిల్లు గేమర్ హిందీ యానిమేషన్ చిత్రం
2016 నిర్మలా కాన్వెంట్ శాంతి తెలుగు

పురస్కారాలు

మార్చు
  • స్టార్ పరివార్ పురస్కారాలు, 2004 - కసౌతీ జిందగీ కే
  • ఇండియన్ టెలివిజన్ అకాడమీ పురస్కారాలు, 2004 - ఉత్తమ బాలనటిగా కసౌతీ జిందగీ కే
  • ఇండియన్ టెల్లీ పురస్కారాలు
  • జాతీయ ఉత్తమ బాలనటి పురస్కారం - 2011, చిల్లర్ పార్టీ సినిమాకి గాను

మూలాలు

మార్చు
  1. "Shriya Sharma age". StarsFact.com. Archived from the original on 2016-08-22. Retrieved 2016-08-01.