తూనీగ తూనీగ
తూనీగ తూనీగ 2012, జూలై 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి జంటగా నటించగా, కార్తీక్ రాజా సంగీతం అందించారు.[3]
తూనీగ తూనీగ | |
---|---|
దర్శకత్వం | ఎం. ఎస్. రాజు |
రచన | పరుచూరి బ్రదర్స్ (మాటలు) |
నిర్మాత | మాగంటి రాంచంద్రన్, దిల్ రాజు (సమర్పణ) |
తారాగణం | సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | కె.వి. కృష్ణారెడ్డి |
సంగీతం | కార్తిక్ రాజా |
నిర్మాణ సంస్థలు | పద్మిని ఆర్ట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (సమర్పణ) |
పంపిణీదార్లు | శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ (విదేశాలు)[1] |
విడుదల తేదీ | 20 జూలై 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటల జాబితా
మార్చుమైక్ టెస్టింగ్, రచన: కృష్ణచైతన్య, గానం. రంజిత్, సునిది చౌహాన్
తూనీగా తూనీగా, రచన: కృష్ణచైతన్య, గానం.ఎం.కె.బాలాజీ , కె ఎస్ చిత్ర
దిగు దిగు జాబిలి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కార్తీక్ , రీటా
హాట్స్ ఆఫ్ ఓయీ బ్రహ్మ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.టిప్పు, అనూరాధ పౌడ్వాల్
పెద వంచులల్లో ప్రేమ , రచన: కృష్ణచైతన్య, గానం.రాహూల్ నంబియార్, సుజాత మోహన్
అహిస్ట అహిస్తా, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కార్తీక్, రీటా
దూది పింజ లాంటి పిల్ల , రచన: కృష్ణచైతన్య, గానం.రాహూల్ నంబియార్ , వసుంధరా దాస్
మెరిసే నింగే , రచన: భువన చంద్ర, గానం.శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ .
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎం. ఎస్. రాజు
- నిర్మాత: మాగంటి రాంచంద్రన్, దిల్ రాజు (సమర్పణ)
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- సంగీతం: కార్తిక్ రాజా
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: పద్మిని ఆర్ట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (సమర్పణ)
- పంపిణీదారు: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ (విదేశాలు)
కథ
మార్చుకార్తీక్ రామస్వామి, నిధి బాల్య స్నేహితులు... కాదు కాదు శత్రువులు! ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. కార్తీక్ తండ్రి రామస్వామి ఓ తమిళ వంటవాడు. నిధి తండ్రి కోటీశ్వరుడు. కార్తీక్ కారణంగా తన కూతురు పరీక్షలలో తప్పిందన్న కారణంగా, ఆమెకు మంచి విద్యను అందించాలనే కోరికతో చిన్నతనంలోనే విదేశాలకు పంపిస్తాడు. ఆ రకంగా వీరిద్దరూ విడిపోతారు. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగా మనసులో ఉండిపోతాయి. దాదాపు పదమూడేళ్ళ తర్వాత నిధి తాతగారి 'సహస్ర పూర్ణచంద్రదర్శన వేడుక' సందర్భంలో వీరిద్దరూ తిరిగి కలుస్తారు. మూడు రోజుల పాటు నగరానికి దూరంగా ఓ క్యాంప్‌ను ఏర్పాటు చేసి, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిధి తండ్రి ఆర్గనైజ్ చేస్తాడు. దానికి తన మిత్రుడైన రామస్వామిని హెడ్ కుక్‌గా పెట్టుకుంటాడు. తలవని తలంపుగా అక్కడ కలుసుకున్న కార్తీక్, నిధి మధ్య చిన్ననాటి వైరం చెరిగిపోయి, ప్రేమ ఎలా చిగురించింది? దానిని సఫలీకృతం చేసుకోవడానికి వీరిద్దరూ ఎలా కష్టపడ్డారన్నది మిగతా కథ[4].
స్పందనలు
మార్చు- ఈ సాదాసీదా ప్రేమకథను రెండున్నర గంటలపాటు తెరమీద నడిపించడానికి దర్శకుడు ఎమ్మెస్ రాజు చేసిన ఫీట్స్ ఏమాత్రం ఆకట్టుకోవు. పైగా పరమ బోర్ కొడతాయి. ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కథను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. హిల్ స్టేషన్లో ఫ్యామిలీ క్యాంప్ అనే అంశం తప్పితే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ప్రతి సన్నివేశమూ ఏదో ఒక పాత సినిమానే జ్ఞప్తికి తెస్తుంది. నటీనటుల నటన కూడా రొటీన్‌గా ఉంది.[4] అని జాగృతి వారపత్రిక వ్యాఖ్యానించింది.
మూలాలు
మార్చు- ↑ "USA 1st Week Schedule : Tuniga Tuniga Overseas by 14 Reels through FICUS". 123telugu.com. 1 జనవరి 1998. Archived from the original on 31 ఆగస్టు 2012. Retrieved 29 డిసెంబరు 2018.
- ↑ "Tuneega Tuneega releases on July 20". Supergoodmovies.com. 10 జూలై 2012. Archived from the original on 10 అక్టోబరు 2012. Retrieved 29 డిసెంబరు 2018.
- ↑ The Hindu (21 July 2012). "Tuneega Tuneega: Sincerity gone amiss" (in Indian English). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ 4.0 4.1 వడ్డి ఓంప్రకాశ్ (24 July 2012). "తూనీగ తూనీగ ఎందుకమ్మా ఎగరలేవు?". జాగృతి వారపత్రిక. Retrieved 20 February 2024.