నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)

నిర్మలా కాన్వెంట్ లో పేదింటి అబ్బాయి శామ్యుల్‌ (రోషన్‌), ఎకరం పొలమే వారి కుటుంబానికి జీవనాధారం. ఆ ఊరికే చెందిన పెద్దింటి అమ్మాయి శాంతి ( శ్రియాశర్మ) అదే పాఠశాలలో చదువుతుంది. ఒకే తరగతికి చెందిన శామ్యూల్, శాంతి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి భూపతి రాజు (ఆదిత్య మీనన్) కు తెలిసి తన పాలేర్లతో శామ్యూల్ ని కొట్టిస్తాడు. అయినా సరే తన కొడుకు ప్రేమని గెలిపించటం కోసం శ్యాముల్ తండ్రి వెళ్లి, హీరోయిన్ తండ్రితో నీ కూతురుని ఇచ్చి నా కొడుకుతో పెళ్ళి చేయమంటాడు. తనతో సమానంగా పేరు, డబ్బు గడిస్తే కూతురిని శామ్యూల్‌కు ఇచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెడతాడు. ఆ డబ్బు సంపాదించడం కోసం హీరో నాగార్జునను వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు శామ్యూల్. అందుకు గల కారణమేమిటి? ఆ యువ జంట ప్రేమకు నాగార్జున ఏ విధంగా సహాయపడ్డారు. శామ్యూల్, శాంతిల ప్రేమకథ ఏ విధంగా సుఖాంతమైంది అనేది చిత్రకథ. తెలివైన కుర్రాడు తన లక్ష్యంతో పాటు ప్రేమలో ఎలా గెలుపొందాడనే కథాంశంతో రూపొందిన చిత్రమిది.[1]

నిర్మలా కాన్వెంట్
(2016 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.నాగ కోటీశ్వరరావు
తారాగణం అక్కినేని నాగార్జున ,
రోషన్ ,
శ్రియా శర్మ
సంగీతం రోషన్‌ సాలూరి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్
భాష తెలుగు

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మార్చు

2016 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (రోషన్)

మూలాలు

మార్చు
  1. "Nirmala Convent (2016) - Movie | Reviews, Cast & Release Date in tenali - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2022-01-25.