శ్రీదేవి సోడా సెంట‌ర్

శ్రీదేవి సోడా సెంట‌ర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమా 2021 ఆగస్టు 27న విడుదల కాగా, జీ 5 ఓటీటీలో 2021 న‌వంబ‌రు 4 నుండి స్ట్రీమింగ్ అయింది.[2]

శ్రీదేవి సోడా సెంటర్
దర్శకత్వంకరుణ కుమార్
రచనకరుణ కుమార్
నిర్మాతవిజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
తారాగణంసుధీర్ బాబు, ఆనంది
ఛాయాగ్రహణంశాందత్ సాయినుద్దీన్
కూర్పుశ్రీకర ప్రసాద్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
27 ఆగష్టు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • సుధీర్ బాబు[3]
  • ఆనంది[4]
  • పావెల్ నవగీతన్
  • నరేష్
  • రఘుబాబు
  • అజయ్ ,
  • సత్యం రాజేష్
  • హర్ష వర్ధన్
  • సప్తగిరి
  • కళ్యాణి రాజు
  • రోహిణి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్‌: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
  • దర్శకత్వం: కరుణ కుమార్‌ [5]
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌
  • ఎడిటర్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్

మార్చు

ఈ సినిమా నిర్మాణం 2022, అక్టోబరులో ప్రారంభమైంది. రెగ్యుల‌ర్ షూటింగ్ 2020, న‌వంబ‌రులో మొద‌లు పెట్టారు. రెండవ షెడ్యూల్ 2021, జనవరిలో జరిగింది.[6]ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ చిత్రంలో డబ్బింగ్ పనులు ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది.

ప్రచారం

మార్చు

ఈ సినిమా కు సంబంధించి ‘లైటింగ్ ఆఫ్ సూరిబాబు’ పేరుతో 2021, మే 11న గ్లింప్స్ ను విడుదల చేశారు.[7][8] ఈ సినిమాలోని ‘మందులోడా ఓరి మాయలోడా’ అనే పాటను నటుడు చిరంజీవి 2021 జులై 9న విడుదల చేశాడు.[9] ఈ సినిమా ట్రైలర్‌ను 2021 ఆగస్టు 19న నటుడు మహేష్ బాబు విడుదల చేశాడు.[10]

ఇతర విషయాలు

మార్చు
  • ఈ సినిమాని 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తే మొదటి రోజే ఈ సినిమా 2 కోట్ల రూపాయల వసూళ్ళను సాధించింది.[11]

పాటల జాబితా

మార్చు

1: నాలోనే ఉన్నా, గానం.అనురాగ్ కులకర్ణి

2: అన్ టైటిల్ గానం.సాహితి చాగంటి , ధనుంజయ్

3:నాలో ఇన్నాళ్లుగా , గానం.రమ్య బెహరా, దినకర్ కల్వల

4: చుక్కల మేళం , గానం.అనురాగ్ కులకర్ణి

5: లవ్ థీమ్

మూలాలు

మార్చు
  1. India Today (30 October 2020). "Sudheer Babu and Karuna Kumar together in new film Sridevi Soda Centre. See first-look poster". Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  2. Namasthe Telangana (21 October 2021). "ఓటీటీలోకి వ‌స్తున్న శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  3. Disha daily (దిశ) (30 October 2020). "సుధీర్‌బాబు శ్రీదేవి సోడా సెంటర్ | dishadaily latesttelugu news". Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  4. The Times of India (2 December 2020). "Anandhi roped in for Sudheer Babu's Sri Devi Soda Centre - Times of India". The Times of India. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  5. Namasthe Telangana (18 July 2021). "8 సినిమా క‌థ‌ల‌తో సిద్ధంగా ఉన్న ప‌లాస డైరెక్ట‌ర్". Namasthe Telangana. Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  6. "Sudheer Babu starts second schedule for 'Sridevi Soda Center'". Telangana Today. 28 January 2021. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  7. Eenadu (11 May 2021). "LightingSooriBabu: హై ఓల్టేజ్‌ సుధీర్‌బాబు - sridevi soda center motion poster". www.eenadu.net. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  8. Sakshi (11 May 2021). "శ్రీదేవి సోడా సెంటర్‌: ఇరగదీసిన సుధీర్‌ బాబు". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  9. Sakshi (10 July 2021). "మాస్‌ మాయలోడా..." Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  10. Andrajyothy. "మహేష్ వదిలిన 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్". chitrajyothy. Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  11. "Sridevi Soda Center Box Office Collection Worldwide Gross+ Share". Tollywood Ace. Retrieved 2021-08-29.{{cite web}}: CS1 maint: url-status (link)