కడలి విజయ సారథి (1942 జూన్ 26 - 2022 ఆగస్టు 1) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. ఆయన 350 పైగా సినిమాల్లో నటించి నిర్మాతగా మారి ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు, విధాత సినిమాలను నిర్మించాడు.

కె.జె.సారథి
జననం
కడలి విజయ సారథి

1942 జూన్ 26
మరణం2022 ఆగస్టు 1(2022-08-01) (వయసు 80)
వృత్తి
  • నటుడు
  • నిర్మాత

సినీ జీవితం

మార్చు

కె.జె. సారథి 1960లో ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో నటుడిగా అడుగుపెట్టి ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. ఆయన ఆ తరువాత అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కె.జె. సారథి తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించే ప్రక్రియలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా పని చేశాడు.

కె.జె. సారథి ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభంతో కలిసి నాటకాలలో నటించాడు. ఆయన నవతా కృష్ణంరాజు నిర్మించిన ‘జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగోతం’ సినిమాలకు మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొని, గోపికృష్ణ బ్యానర్‌లో పలు సినిమాలను నిర్మించాడు.

నటించిన సినిమాల పాక్షిక జాబితా

మార్చు

నిర్మాతగా

మార్చు

కె.జె. సారథి కిడ్నీ, లంగ్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2022 ఆగస్టు 1న మరణించాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (1 August 2022). "సీనియర్ హాస్య నటుడు కె.జె. సారథి కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  2. TV9 Telugu (1 August 2022). "చిత్రసీమలో మరో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ హాస్య నటుడు కన్నుమూత". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)