ప్రధాన మెనూను తెరువు

శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా నటనలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి, అనేక ధారావాహికల్లో నటించింది.[1]

శ్రీలక్ష్మి కనకాల
Srilakshmi Kanakala.jpg
జననంశ్రీలక్ష్మి కనకాల
జూన్ 20
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
చదువుఎం.ఏ. (ఆంగ్లం)
వృత్తిటెలివిజన్ నటి
జీవిత భాగస్వామిడా. పెద్ది రామారావు
పిల్లలుప్రేరణ, రాగలీన
తల్లిదండ్రులుదేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల
బంధువులురాజీవ్ కనకాల (అన్నయ్య), సుమ కనకాల (వదిన)

జననం - కుటుంబ నేపథ్యంసవరించు

శ్రీలక్ష్మి జూన్ 20న దేవదాస్ కనకాల (రంగస్థల, చలనచిత్ర నటులు, దర్శకులు మరియు నట శిక్షకులు), లక్ష్మీదేవి కనకాల (రంగస్థల, చలనచిత్ర నటి మరియు నట శిక్షకురాలు) దంపతులకు హైదరాబాద్లో జన్మించింది. నటుడు రాజీవ్ కనకాల, టెలివిజన్ వ్యాఖ్యాత సుమ కనకాలలు శ్రీలక్ష్మికి అన్నావదినలు.

విద్యాభ్యాసం - ఉద్యోగంసవరించు

చదువులో చురుగ్గా ఉండే శ్రీలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. విద్యోదయ హైస్కూల్ లో తన పాఠశాల విద్యను చదివిన శ్రీలక్ష్మి, మద్రాస్ విశ్వవిద్యాలయంలోలో ఎం.ఏ. (ఆంగ్లం) పూర్తిచేసింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.

వివాహం - పిల్లలుసవరించు

2002, మార్చి 31న తెలుగు నాటకరంగ ప్రముఖులు, కవి, తెలుగు కథా రచయిత మరియు రంగస్థల అధ్యాపకులైన డా. పెద్ది రామారావుతో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు (ప్రేరణ, రాగలీన).

నటజీవితంసవరించు

దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత తన తండ్రి దర్శకత్వం వహించిన ధారావాహికలతోపాటు, ఇతర ధారావాహికలలో నటించింది. అంటేకాకుండా ఒక కన్నడ టెలీఫిలిం, ఒక హిందీ చిత్రంలో నటించింది.

నటించిన ధారావాహికలుసవరించు

  1. దూరదర్శన్ - రాజశేఖర చరిత్రము, స్వయంవరం
  2. జెమినీ టీవీ - చిన్నారి, కొత్త బంగారం, కలియుగ రామాయణం, అరుందతి, స్వాతి, ఆకాశగంగ, అగ్నిపూలు, నేను ఆయన నలుగురు అత్తలు
  3. ఈటీవి - ప్రియాంక, ఋతుధార

మూలాలుసవరించు

  1. నెట్ టీవి 4 యూ. "Srilakshmi Kanakala". www.nettv4u.com. Retrieved 4 July 2017.