లక్ష్మీదేవి కనకాల

లక్ష్మీదేవి కనకాల (మ. ఫిబ్రవరి 3, 2018) నాటకరంగ ప్రముఖులు, నట శిక్షకులు. థియేటర్ ఆర్ట్స్ లో రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ మొదలగు అనేకమందిని సినిమా రంగ నటులుగా తీర్చిదిద్దారు.[1]

లక్ష్మీదేవి కనకాల
మరణంఫిబ్రవరి 3, 2018
హైదరాబాద్
వృత్తినాటకరంగ ప్రముఖులు, నట శిక్షకులు.
జీవిత భాగస్వామిదేవదాస్ కనకాల
పిల్లలుకుమారుడు:రాజీవ్ కనకాల, కోడలు:సుమ, కుమార్తె: శ్రీలక్ష్మి కనకాల, అల్లుడు: పెద్ది రామారావు

జీవిత విశేషాలు మార్చు

ఆమె తన 11 సంవత్సరాల వయస్సులో ఈ నాటక రంగంలోనికి వచ్చారు. ఆమె నాట్యకారిణిగా మొదట్లో ఉండేవారు. ఆమె 1957లో నాట్యం పై హైదరాబాదులో జరిగిన సెమినార్ కు వచ్చారు. అప్పుడు హైదబాదులో స్థిరపడ్డారు. ఆమె ఎ.ఆర్.కృష్ణ గారి నాట్య విద్యాలయంలో శిక్షణ పొందారు. ఆమెను ఎ.ఆర్.కృష్ణ గారు కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ పాత్రలో నటించడానికి ఆహ్వానించారు. ఆమె ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆమె ఆ పాత్రలో నటించారు.

ఆమె సాంగ్ అండ్ డ్రామా డివిజన్ లో పనిచేసారు. అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో హాజరైన దేవదాస్ కనకాల ఆమెకు పరిచయమయ్యారు. 1971 నవంబరు 21న దేవదాస్ కనకాలను వివాహం చేసుకున్నారు. మద్రాసులో ఫిలిం ఇండస్త్రీ వారు ఒక ఇనిస్టిట్యుట్ స్థాపించిన తరువాత దానికి రాజా రామదాస్ గారు ప్రిన్సిపాల్ గా పనిచేసారు. దానిలో కళాకారులకు శిక్షణ నివ్వడానికి ఉపాద్యాయులుగా దేవదాస్ కనకాల అందులో ఉద్యోగంలో చేరారు. తరువాత ఆ సంస్థ వారు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించారు. అప్పటికి సెంట్రల్ గవర్నమెంటు సంస్థలో పనిచేస్తున్నందున నాటకాలనూ వేసేవారు. ఆ సమయంలో ఆమెకు ఒక కుమారుడు (రాజీవ్ కనకాల) జన్మించారు. తరువాత ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ సంస్థలో 1974లో లెక్చరర్ గా చేరారు. అప్పటికి సినీనటుడు రాజేంద్రప్రసాద్ మొదటి సంవత్సరం శిక్షణ పొందుతున్నాడు. అప్పటికి రజనీకాంత్ వారు రెండవ సంవత్సరం బ్యాచ్ లో శిక్షణ పొందుతున్నారు. 1975లో దేవదాస్ కనకాల ఫిలిం ఛాంబర్ కు రిజైన్ చేసారు. అప్పటికి ఆమెకు ఒక అమ్మాయి (శ్రీలక్ష్మి కనకాల) జన్మించింది. సినిమానటుడు చిరంజీవి ఆమెకు ఐదవ బ్యాచ్ (1977-78) విద్యార్థి. 1978 లో ఆ ఛాంబర్ మూసివేసారు. అప్పుడు ఎం.జి.రాంచంద్రన్ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు అడయార్ ఇనిస్టిట్యూట్ లో తమిళంలో మాత్రమే శిక్షణ నిచ్చేవారు. ఇతరభాషలకు శిక్షణనిచ్చేవారు కాదు. అక్కడ ఎవరూ చేరడం లేదు. అందువల్ల ఈ ఛాంబర్ నూ మూసివేసి ఇక్కడ ఉన్న సిబ్బందిని ఆ ఇనిస్టీట్యూట్ కు తరలించారు. ఆమె అడయార్ ఇనిస్టిట్యూట్ లో శిక్షకురాలిగా చేరారు. అక్కడ ఆమె వద్ద శిక్షణ పొందినవారే శుభలేఖ సుధాకర్, సుహానిసి మొదలైన వారు. 1981, 1982 బ్యాచ్ లు పూర్తిచేసిన తదుపరి ఆమె మరలా హైదబాదులో ప్రారంభమైన థియేటర్ ఆర్ట్స్ లో శిక్షకురాలిగా ఆమె భర్తతో పాటు చేరారు. అనేక మంది సినిమా నటీనటులకు ఆమె శిక్షణ నిచ్చారు.[2]

సినిమాలలో మార్చు

ఆమె సినిమాలలో చాలా తక్కువగా చేసారు. ఆమె ప్రేమ బంధంలో జయప్రదకు తల్లిగా నటించారు. ఒకఊరికథ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్నపాత్రలో నటించారు. మాష్టారి కాపురం లో ఒక పాత్రలో నటించారు. పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతికి అత్తగారి పాత్రలో నటించారు. కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్ కు తల్లిగా నటించారు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె కుమారుడు రాజీవ్ కనకాల ప్రముఖ సినిమా, టెలివిజన్ నటుడు. కోడలు కనకాల సుమ కూడా ప్రసిద్ధ యాంకర్, నటీమణి. లక్ష్మీదేవి కుమార్తె శ్రీలక్ష్మి కనకాల టెలివిజన్ నటీమణి. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటకరంగ ప్రముఖులు.[3]

పురస్కారాలు మార్చు

  • మా టెలివిజన్ ఎంటార్‌టైన్ మెంట్ అవార్డు [4]

మరణం మార్చు

లక్ష్మీదేవి 2018, ఫిబ్రవరి 3న హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు.[5][6][7]

మూలాలు మార్చు

  1. [ http://www.teluguodu.com/kanakala-kept-chiranjeevi-away-from-his-house/ Archived 2017-07-09 at the Wayback Machine Kanakala Kept Chiranjeevi Away From His House!]
  2. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల లతో ఆర్కే ఓపెన్ హార్ట్ ఫుల్ ఎపిసోడ్ ఎ.బి.ఎన్ లో -యూ ట్యూబ్ వీడియో
  3. ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Archived from the original on 18 మే 2017. Retrieved 24 May 2017.
  4. "MAA TEA Awards [Maa Television Entertainment Awards]". Archived from the original on 2018-02-06. Retrieved 2016-05-10.
  5. నమస్తే తెలంగాణ (3 February 2018). "రాజీవ్ క‌న‌కాల త‌ల్లి మృతి". Retrieved 3 February 2018.[permanent dead link]
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (3 February 2018). "ప్రముఖ నటి మృతి.. 'కనకాల' ఇంట విషాదం". Retrieved 3 February 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  7. సాక్షి (3 February 2018). "రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం". Archived from the original on 3 February 2018. Retrieved 3 February 2018.

ఇతర లింకులు మార్చు