సుమ కనకాల

వ్యాఖ్యాత

సుమ (జననం: మార్చి 22, 1974) ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో (యాంకర్లలో) ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.[1]

సుమ కనకాల
Suma Kanakala.jpg
జననం
సుమ

(1974-03-22) 1974 మార్చి 22 (వయస్సు 47) మార్చి 27, 1974
కేరళ, భారతదేశం
వృత్తివ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలుప్రస్తుతం
జీవిత భాగస్వామిరాజీవ్ కనకాల
పిల్లలుఇద్దరు

కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, వ్యాఖ్యానం (యాంకరింగ్‌) చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం (యాంకరింగు) చేసి మంచి గుర్తింపును పొందింది.టివీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ (ఆడియో రిలీజు) కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

జీవిత విశేషాలుసవరించు

ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది. 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమ తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు.సుమ తల్లిదండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటంతో సహజంగా తెలుగు భాషమీద పట్టు సాధించింది.చదువులో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో, తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటుంది. ఆమె 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.[2]

టి.వీ.కార్యక్రమాలుసవరించు

 • క్యాష్
 • స్టార్ మహిళ
 • పంచావతారం
 • సూపర్ సింగర్
 • అవాక్కయ్యారా?
 • జీన్స్
 • భలే చాన్సులే
 • పట్టుకొంటే పట్టుచీర
 • లక్కు కిక్కు

ధారావాహికలుసవరించు

 1. వేయి పడగలు
 2. మేఘమాల
 3. జీవన రంగం
 4. అన్వేషిత
 5. సుమ
 6. మందాకిని
 7. సమత
 8. ఆరాధన

సినిమాలుసవరించు

 1. కళ్యాణ ప్రాప్తిరస్తు
 2. పవిత్ర ప్రేమ (1998)
 3. వర్షం
 4. ఢీ
 5. బాదుషా
 6. స్వయంవరం
 7. గీతాంజలి
 8. రావోయి చందమామ
 9. స్వరాభిషేకం

పురస్కారాలుసవరించు

 • 2009లో ఈటీవీ, కోకొకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టివి యాంకర్ల కోసం నిర్వహించిన "లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్" కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (పంచావతారం) నంది పురస్కారాన్ని అందుకున్నారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) లోకల్ టీవి మీడియా పురస్కారాన్ని అందుకున్నారు.
 • 2010 సంవత్సరానికి గాను ఉత్తమ టివి వ్యాఖ్యాత (స్టార్ మహిళ) సినీగోర్ పురస్కారాన్ని అందుకున్నారు.

మూలాలుసవరించు

 1. కంటిపూడి, రామకృష్ణ (1 October 2016). తెలుగు వెలుగు: ఈ జీవితం దీనికి తోడూ రెండూ తెలుగు పుణ్యమే. హైదరాబాదు: రామోజీ ఫౌండేషన్. p. 54. Retrieved 11 November 2016.
 2. "Andhra Pradesh / Hyderabad News : A date with TV stars". The Hindu. 2008-12-11. Archived from the original on 2008-12-19. Retrieved 2012-08-24.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సుమ_కనకాల&oldid=3318141" నుండి వెలికితీశారు