శ్రీ గణేశ్ నారాయణ్

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు

శ్రీ గణేశ్‌ నారాయణ్ తెలంగాణ రాష్ట్రాంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంకు చెందిన రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అభ్యర్ఠి. ఆయన 2018, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓట‌మి పాలయ్యారు.[1]

శ్రీ గణేశ్‌ నారాయణ్

ఎమ్మెల్యే అభ్యర్థి
నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 8 ఆగ‌స్టు 1978
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ
నివాసం తుకారం గేట్, హైదరాబాద్, తెలంగాణ
పూర్వ విద్యార్థి ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, S.P. రోడ్, సికింద్రాబాద్
మతం హిందూ

రాజకీయ జీవితం మార్చు

శ్రీ గణేశ్‌ నారాయణ్, 2014 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌లో డైరెక్టర్‌గా పని చేసారు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎన్నికల విజేత జి. సాయన్న, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణల చేతుల్లో ఓడిపోయి మూడవ స్థానం దక్కించుకున్నారు. అనంతరం 2019లో బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి చేరారు. నాలుగేళ్ళ తరువాత 2023లో ఆయన నాటీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, కొన్ని రోజులకే మరల బిజెపిలో చేరారు. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆయన బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 17169 ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓడిపోయారు.[2] 2024 మార్చి 19న ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

మూలాలు మార్చు

  1. telugu, NT News (19 March 2024). "BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీజేపీకి బిగ్ షాక్‌." www.ntnews.com.
  2. "Secunderabad Cantt. Assembly Election Results 2023 Highlights: BRS's Lasya Nanditha Sayanna defeats BJP's Sriganesh. N with 17169 votes". India Today (in ఇంగ్లీష్).