శ్వేత చంగప్ప భారతీయ టెలీవజన్, సినిమా నటి. ఆమె ప్రధానంగా కన్నడ టెలివిజన్ ధారావాహికలు, చిత్రాలలో నటించింది. ఆమె మజా టాకీస్‌లో రాణి పాత్రకు ప్రసిద్ధి చెందింది.

శ్వేతా చంగప్ప
జననం
గర్వలే, సోమవారపేట, కొడగు, కర్ణాటక, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
టెలివిజన్కాదంబరి,
అరుందతి,
జోడి నం.1,
సూపర్ క్వీన్,
చోటా ఛాంపియన్

కెరీర్ మార్చు

2003–2005 మధ్యకాలంలో ఉదయ టీవీలో ప్రసారమైన ఎస్. నారాయణ్ దర్శకత్వం వహించిన సుమతి అనే సీరియల్ ద్వారా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2006లో ఉదయ టీవీలో ప్రసారమైన బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మించిన కన్నడ సోప్ కాదంబరి పాత్ర ద్వారా కర్ణాటకలోని టెలివిజన్ ప్రేక్షకులలో ఆమె కీర్తి ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆమె ఈటీవీ కన్నడ, కలర్స్ కన్నడలలో కూడా ప్రసారమైన పలు ధారాశాహికలలోనూ ఆమె ప్రధాన పాత్రలలో నటించింది.

ఆమె జీ కన్నడలో యారిగుంటు యారిగిల్ల అనే టీవీ షోను హోస్ట్ చేసింది. అలాగే, ఆమె జీ కన్నడలోనే కునియోను బారాను హోస్ట్ చేసింది. ఆమె స్టార్ సువర్ణలో డ్యాన్స్ డ్యాన్స్ జూనియర్స్‌ని కూడా హోస్ట్ చేసింది.

శ్వేత కన్నడ సినిమాలలో కూడా నటించింది, దర్శన్ తూగుదీప్‌తో తంగిగాగి (2006), విష్ణువర్ధన్‌తో వర్ష (2005) చిత్రాలు చేసింది.[1]

కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న ఆమె నాల్గవ స్థానం నిలిచింది. ఆమె గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో గణేష్ హోస్ట్ చేసిన ఈటీవీ కన్నడలో ప్రసారమైన సూపర్ మినిట్‌లో నికితా తుక్రాల్, దీపికా కామయ్య, నీతూ శెట్టి, అనుశ్రీ, కైవా, అనుమప, నరేంద్ర బాబు శర్మలతో కలిసి పాల్గొంది.[2] ప్రస్తుతం ఆమె సృజన్ లోకేష్‌తో కలిసి కన్నడ స్కెచ్ కామెడీ షో మజా టాకీస్‌లో రాణిగా నటిస్తోంది.

అవార్డులు మార్చు

శ్వేత రెండుసార్లు కుటుంబ అవార్డులలో జీ కన్నడ ద్వారా ఉత్తమ యాంకర్ అవార్డును గెలుచుకుంది. అరుంధతిలో తన పాత్రకు కర్ణాటక ప్రభుత్వం 2013లో మధ్యంసన్మాన్‌లో ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది.

మూలాలు మార్చు

  1. "Swetha Changappa makes a comeback in Shivarajkumar's milestone film". Times of India. 2022-02-03.
  2. "Super Minute ends with a grand finale - The Times of India". Times of India. 2015-01-20.