షబ్బీర్ అహ్మద్
షబ్బీర్ అహ్మద్ ఖాన్ (జననం 1976, ఏప్రిల్ 21) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 2003 - 2007 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చట్టవిరుద్ధమైన బౌలింగ్ చేయడం వల్ల ఒక సంవత్సరంపాటు క్రికెట్ నుండి నిషేధించబడ్డాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షబ్బీర్ అహ్మద్ ఖాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఖానేవాల్, పంజాబ్, పాకిస్తాన్ | 1976 ఏప్రిల్ 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.96 మీ. (6 అ. 5 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 174) | 2003 ఆగస్టు 20 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 నవంబరు 12 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 127) | 1999 సెప్టెంబరు 19 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2005 మే 22 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 14) | 2007 ఫిబ్రవరి 2 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2013 డిసెంబరు 10 |
క్రికెట్ రంగం
మార్చులైన్-అండ్-లెంగ్త్ పేస్ బౌలర్ గా రాణించాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ అరంగేట్రంలో 2003-04 మూడు-టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 109 పరుగులకు ఎనిమిది వికెట్లు తీశాడు. ఇందులో రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూడా ఉన్నాయి.[2] టొరంటోలో వెస్టిండీస్‌తో జరిగిన తన తొలి వన్డేలోని తొలి ఓవర్‌లో రెండు వికెట్లతో మొత్తం మూడు వికెట్లు తీసి తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు.[3][4]
ఒక సంవత్సరం నిషేధం
మార్చుషబ్బీర్ 10 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. 2005లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడిన తర్వాత ఇతను అక్రమ బౌలింగ్ యాక్షన్‌కు పాల్పడ్డాడని ఐసీసీకి ఫిర్యాదు వచ్చింది. ఇతని చర్యపై విచారణ తరువాత, 2005 డిసెంబరులో అహ్మద్ ఒక సంవత్సరంపాటు క్రికెట్ నుండి నిషేధించబడ్డాడు.[5][6][7]
నిషేధం తరువాత
మార్చు2006 డిసెంబరు 21 నాటికి, తన ఒక-సంవత్సరం పదవీకాలాన్ని పూర్తి చేయడంతో, షబ్బీర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హత పొందాడు. అయితే మళ్ళీ ఎవరైన రిపోర్టు చేస్తే, తన బైలింగ్ ను మళ్ళ అంచనా వేసే వరకు అంతర్జాతీయ స్థాయిలో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేయబడుతుందనే నిబంధన పెట్టబడింది.[8][9]
మూలాలు
మార్చు- ↑ Shabir Ahmad Crickter Unfold Story (sic) యూట్యూబ్లో
- ↑ "1st Test: Pakistan v Bangladesh at Karachi, Aug 20–24, 2003". espncricinfo. Retrieved 2023-09-07.
- ↑ "Pace like fire | Report | Cricket News | ESPN Cricinfo". Content-pak.cricinfo.com. Retrieved 2023-09-07.
- ↑ "3rd ODI: Pakistan v West Indies at Toronto, Sep 19, 1999 | Cricket Scorecard | ESPN Cricinfo". Content-pak.cricinfo.com. Retrieved 2023-09-07.
- ↑ "Shabbir has action cleared | Pakistan Cricket News". ESPN Cricinfo. Retrieved 2023-09-07.
- ↑ "Elliott to reassess Shabbir's action | Pakistan Cricket News". ESPN Cricinfo. Retrieved 2023-09-07.
- ↑ "Shabbir eager to iron out the kinks | Pakistan Cricket News". ESPN Cricinfo. Retrieved 2023-09-07.
- ↑ "Shabbir relieved as ICC lifts action ban | Pakistan Cricket News | ESPN Cricinfo". Content-pak.cricinfo.com. Retrieved 2023-09-07.
- ↑ "ICC receives report on Shabbir's action | Pakistan Cricket News | ESPN Cricinfo". Content-pak.cricinfo.com. Retrieved 2023-09-07.