షబ్-ఎ-బరాత్ లేదా షబే బరాత్ ఇస్లామీయ కేలండర్ ప్రకారము షాబాన్ నెలలోని 15వ దినము.


వ్యాసాల క్రమం
ఇస్లామీయ సంస్కృతి

నిర్మాణాలు

అరబ్ · అజేరి
ఇండో-ఇస్లామిక్ · ఇవాన్
మూరిష్ · మొరాక్కన్ · మొఘల్
ఉస్మానియా · పర్షియన్
సూడానో-సహేలియన్ · తాతార్

కళలు

ఇస్లామీయ లిపీ కళాకృతులు · మీనియేచర్లు · రగ్గులు

నాట్యము

సెమా · విర్లింగ్

దుస్తులు

అబాయ · అగల్ · బౌబౌ
బురఖా · చాదర్ · జెల్లాబియా
నిఖాబ్ · సల్వార్ కమీజ్ · తఖియా
తాబ్ · జిల్‌బాబ్ · హిజాబ్

శెలవు దినాలు

ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్
చాంద్ రాత్ · ఈదుల్ ఫిత్ర్ · బక్రీద్
ఇమామత్ దినం · అల్ కాదిమ్
సంవత్సరాది · ఇస్రా, మేరాజ్
లైలతుల్ ఖద్ర్ · మీలాదె నబి · రంజాన్
ముగామ్ · షాబాన్

సాహిత్యము

అరబ్బీ · అజేరి · బెంగాలి
ఇండోనేషియన్ · జావనీస్ · కాశ్మీరీ
కుర్దిష్ · పర్షియన్ · సింధి · సోమాలి
దక్షిణాసియా · టర్కిష్ · ఉర్దూ

సంగీతము
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి

మఖామ్ · ముగామ్ · నషీద్
ఖవ్వాలి

థియేటర్

కారాగోజ్, హాకివత్ · తాజియా

ఇస్లాం పోర్టల్

వాస్తవికత

మార్చు

షబె బరాత్‌కి అనేక పేర్లున్నాయి. లైలతుల్‌ బరఅతున్‌ అంటే నరకం నుంచి విముక్తి పొందే రేయి, లైలతుల్‌ ముబారక అంటే శుభాల రేయి. లైలతుస్సక్‌ అంటే దస్తా వేజుల రేయి. అనగా ఒక సంవత్సర కాలంలో ప్రతి మనిషికి సంబంధించిన అనేక విషయాలు స్పష్టంగా లిఖించబడ తాయి. కాని ఈ రేయి షబె బరాత్‌ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఇది అరబీ, ఫార్సీ భాషా పదాల సంగ్రహం. షబ్‌ అంటే ఫార్సీ భాషలో రాత్రి అని, బరాత్‌ అంటే అరబీలో విముక్తి పొందటం, మోక్షం పొందటం అని అర్థాలు వస్తాయి. షబే బరాత్‌ గురించి హజ్రత్‌ ఆయిషా (రజి) గారి నుండి ప్రసిద్ధి చెందిన ఉల్లేఖనం ఉంది. దీనిని ఇమామ్‌ తిర్మిజీ (రహ) తన గ్రంథంలో పొందుపరిచారు. అల్లాహ్ షాబాన్ మాసంలోని 15వ రాత్రి ఆకాశం నుండి భువిపైకి అవతరిస్తాడు. బనూ కల్బ్‌ మేకల వెంట్రుకల మందం ప్రజల పాపాలను క్షమిస్తాడు. (మిష్కాత్‌ 115) హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రజి) ఉల్లేఖించారు మహాప్రవక్త (స) ఇలా సెల విచ్చారు. షాబాన్‌ నెల 15వ రాత్రి అల్లాహ్ తన సృష్టి భూతములపై ప్రత్యేక అనుగ్ర హాలను ప్రసాదిస్తాడు, అందరి పాపాలను క్షమిస్తాడు. బహు దైవారాధ కుని, ద్వేషాన్ని కలిగివున్న వ్యక్తి తప్ప అని వివరించారు.

బయటి లంకెలు

మార్చు