షాజిత్ కొయేరి
షాజిత్ కొయేరి కేరళకు చెందిన సౌండ్ డిజైనర్. ఓంకార సినిమాకి ఫిల్మ్‌కి ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు ఐఫా అవార్డులను కూడా గెలుచుకున్నాడు.[1] కమీనే సినిమాకి స్టార్ స్క్రీన్ అవార్డును కూడా అందుకున్నాడు.[2] [3] ఫాలీ ఎడిటింగ్, ప్రీ-మిక్సింగ్ లకు ప్రసిద్ది చెందాడు.[4]
షాజిత్ కొయేరి | |
---|---|
జననం | |
వృత్తి | సౌండ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999 - ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చుషాజిత్ కొయేరి, సోమ సుందరన్ - రతీబాయి దంపతులకు కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లాలోని పున్నోల్‌లో జన్మించాడు.[5] తలస్సేరిలోని బ్రెన్నాన్ కళాశాలలో చదువుకున్నాడు. 1999లో ముంబై నగరానికి వెళ్ళాడు.
సినిమారంగం
మార్చు2003లో వచ్చిన పర్ఫెక్ట్ హజ్బెండ్ అనే సినిమాకు తొలిసారిగా పనిచేశాడు. తరువాత సంజయ్ లీలా భన్సాలీ తీసిన బ్లాక్ అండ్ సావరియా, షిమిత్ అమీన్ తీసిన అబ్ తక్ చప్పన్, కేతన్ మెహతా తీసిన మంగళ్ పాండే: ది రైజింగ్, రోహన్ సిప్పీ తీసిన బ్లఫ్ మాస్టర్! వంటి సినిమాలకు పనిచేశాడు. శశాంత్ షా దాస్విదానియా తీసిన ఛలో ఢిల్లీ, అపర్ణా సేన్ తీసిన 15 పార్క్ అవెన్యూ, అభిషేక్ చౌబే తీసిన ఇష్కియా, విశాల్ భరద్వాజ్ తీసిన మక్బూల్, ది బ్లూ అంబ్రెల్లా, ఓంకార, కమీనే, 7 ఖూన్ మాఫ్ లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన అనేక డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లకు కూడా పనిచేశాడు.[6] మలయాళ మనోరమలో వచ్చిన ది ఎకో (గ్రాఫిక్ నవల) లో షాజిత్ జీవిత కథ వివరించబడింది.[7]
అవార్డులు, నామినేషన్లు
మార్చు- 2006 విజేత: ఓంకార సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2006 విజేత: ఓంకార సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 2006 నామినేట్: ఓంకార సినిమాకు స్టార్ స్క్రీన్ అవార్డు
- 2006 నామినేట్: ఓంకార సినిమాకు జీ సినీ అవార్డులు
- 2006 నామినేట్: ఓంకార సినిమాకు బాలీవుడ్ మూవీ అవార్డులు
- 2010 విజేత: కమీనే సినిమాకు స్టార్ స్క్రీన్ అవార్డు
- 2010 నామినేట్: కమీనీ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 2010 నామినేట్: కామినీ సినిమాకు జీ సినీ అవార్డులు
- 2011 నామినేట్: ఇష్కియా సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 2011 నామినేట్: ఇష్కియా సినిమాకు స్టార్ స్క్రీన్ అవార్డు
- 2012 నామినేట్: 7 ఖూన్ మాఫ్ సినిమాకు అప్సర ఫిల్మ్ &టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు[8]
- 2012 నామినేట్: డామ్999 సినిమాకు గోల్డెన్ రూస్టర్ అవార్డు[9]
- 2013 గెలిచింది: బర్ఫీ సినిమాకు ఐఫా అవార్డులు![10]
- 2013 నామినేట్: బర్ఫీ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు!
- 2013 నామినేట్: బర్ఫీ సినిమాకు స్టార్ స్క్రీన్ అవార్డు![11]
- 2015 విజేత: హైదర్ సినిమాకు స్టార్ గిల్డ్ అవార్డులు[12]
- 2015 విజేత: హైదర్ సినిమాకు ఐఫా అవార్డులు[13]
- 2015 నామినేట్: హైదర్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు[14]
- 2016 విజేత: తల్వార్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు[15]
- 2016: నామినేట్: తల్వార్, దమ్ లగా కే హైషాకు స్టార్ స్క్రీన్ అవార్డు[16]
- 2017: విజేత: రంగూన్, దంగల్ సినిమాకు స్టార్ స్క్రీన్ అవార్డు[17]
మూలాలు
మార్చు- ↑ "The colours of sound". The Hindu. 2008-07-04. Archived from the original on 2008-08-04.
- ↑ "Aural artistry". The Hindu. 2010-02-27. Archived from the original on 2012-11-07.
- ↑ "Shajith Koyeri". The Times of India. Archived from the original on 2012-07-01.
- ↑ "Aural artistry". The Hindu. 2010-02-27. Archived from the original on 2012-11-07.
- ↑ "'The power of silence is underestimated'". The Times of India.
- ↑ "Newsmakers- Shajith Koyeri". www.thalassery.info.
- ↑ "The Echo Graphic Novel-Life story of Shajith Koyeri". www.onmanorama.com. Archived from the original on 27 January 2021. Retrieved 28 September 2020.
- ↑ "7th Apsara Awards Nominations". www.apsaraawards.org.
- ↑ "After Oscars, DAM999 gets nominated in Golden Rooster Awards". www.glamsham.com.
- ↑ "IIFA 2013: Ranbir's 'Barfi' bags maximum technical awards (Know the winners)". India TV.
- ↑ "Nominations". The Indian Express. Archived from the original on 2013-02-08.
- ↑ "Winners of 10th Renault Star Guild Awards". The Indian Express.
- ↑ "IIFA 2015: Haider tops technical winners' list with six awards". India Today.
- ↑ "As it happened: 60th Britannia Filmfare Awards 2014". The Times of India.
- ↑ "Filmfare Awards 2016: Complete List of Winners". NDTV.
- ↑ "22nd Star Screen Awards 2016 Nominations and Winners List". Filmfare.
- ↑ "Star Screen Awards 2018 Complete Winners List: Dangal, Newton Among Big Winners". www.india.com.