అపర్ణా సేన్

భారతీయ నిర్మాత, లేఖకుడు మరియు నటి

అపర్ణా సేన్ (జననం 1945 అక్టోబరు 25) ఒక భారతీయ సినిమా దర్శకురాలు, సినీ రచయిత్రి, నటీమణి. ఈమె బెంగాలీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె 1960-80 దశకాలలో కథానాయికగా అనేక సినిమాలలో నటించింది. ఈమె ఖాతాలో 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు చేరాయి. భారత ప్రభుత్వం 1987లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

అపర్ణా సేన్
অপর্ণা সেন
38వ అంతర్జాతీయ కలకత్తా బుక్ ఫెయిర్‌లో అపర్ణ (2014)
జననం
అపర్ణా దాస్‌గుప్తా

(1945-10-25) 1945 అక్టోబరు 25 (వయసు 78)
వృత్తినటి, దర్శకురాలు, స్క్రిప్ట్ రచయిత

జీవితవిశేషాలు

మార్చు

ఈమె ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న జెస్సూర్ జిల్లాలో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి చిదానంద దాస్‌గుప్తా ఒక అనుభవజ్ఞుడైన సినీ విమర్శకుడు, చలనచిత్ర దర్శకుడు. తల్లి సుప్రియా దాస్‌గుప్తా ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్. ఆమె 1995లో తన 73వ యేట ఆమోదిని అనే చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయచలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. అపర్ణ బాల్యం హజరీబాగ్‌లోను, కోల్‌కాతాలోను జరిగింది. ఈమె కోల్‌కాతాలోని బాలికల మోడల్ హైస్కూలులో ప్రాథమిక విద్య చదివింది. ఈమె ప్రెసిడెన్సీ కాలేజీ నుండి ఇంగ్లీషులో బి.ఎ. పట్టాపుచ్చుకుంది.

నటనా జీవితం

మార్చు

ఈమె ప్రెసిడెన్సీ కాలేజీలో చదివే రోజులలో తన 15వ యేట సినిమా రంగ ప్రవేశం చేసింది. తన తండ్రికి స్నేహితుడైన సత్యజిత్ రే దర్శకత్వంలో 1961లో వెలువడిన "తీన్ కన్య" అనే చిత్రంలో మృణ్మయి పాత్రను ధరించింది. తరువాతి కాలంలో సత్యజిత్‌రే దర్శకత్వంలో అనేక సినిమాలు చేసింది.

1965లో మృణాల్ సేన్ చిత్రం "ఆకాశ్ కుసుమ్‌"లో నటించింది. అప్పటి నుండి 1970వ దశకం చివరిదాకా నిలకడగా అనేక బెంగాలీ చిత్రాలలో నటించింది. ఈ సమయంలో "ఇమాన్ ధరమ్" వంటి కొన్ని హిందీ చిత్రాలలో కూడా నటించింది. 1969లో "ది గురు" అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించింది. ఈమె అమితాబ్ బచ్చన్, శశికపూర్, సంజీవ్ కుమార్ వంటి హిందీ నటుల సరసన, సౌమిత్ర చటర్జీ, ఉత్తం కుమార్, రాహుల్ బోస్ వంటి బెంగాలీ హీరోల సరసన నటించింది.

2009లో ఈమె నటించిన అంతహీన్ అనే బెంగాలీ చిత్రానికి నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కాయి.[1]

దర్శకత్వం

మార్చు

ఈమె 1981లో "36 చౌరంగీ లేన్" చిత్రం ద్వారా దర్శకురాలిగా మారింది. ఆ చిత్రానికి ఈమే స్క్రీన్ ప్లే సమకూర్చింది. కలకత్తాలో నివసించే ఒక ముసలి ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయుడి కథ అది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఈమె అందుకుంది. అంతే కాక మనీలాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రం "గోల్డన్ ఈగల్" అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం తరువాత ఈమె "పరోమా" (1984), "సతి" (1989), "పరోమితర్ ఏక్ దిన్" (2000), "మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్" (2002), "15, పార్క్ అవెన్యూ", "ది జపనీస్ వైఫ్" (2010), "ఇతి మృణాళిని" (2011), "గొయ్నర్ బక్షొ" (2013), "ఆర్షి నగర్" (2015) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె మూడు పర్యాయాలు వివాహం చేసుకుంది. ఈమె చిన్నవయసులోనే సంజయ్ సేన్‌తో వివాహం జరిగింది. రచయిత, జర్నలిస్టు ముకుల్ శర్మ ఈమె రెండవ భర్త. అతనితో విడాకులు తీసుకున్న తరువాత అమెరికాలోని ప్రొఫెసర్ కళ్యాణ్ రేని వివాహం చేసుకుంది. ఈమెకు కమలిని, కొంకణా సేన్ అనే ఇద్దరు కుమార్తెలు. "*కొంకణా సేన్ శర్మ" సినిమా నటిగా పేరుగడించింది.

ఇతర విజయాలు

మార్చు
 • 2008లో ఈమె ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డులకు ఇంటర్నేషనల్ జూరీగా ఎంపికయ్యింది.
 • ఈమె 1986 - 2005 మధ్యలో ఆనంద బజార్ పత్రిక గ్రూపుకు చెందిన "సనంద" అనే మహిళా పక్షపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది.
 • 2005-2006లలో "కోల్‌కతా టివి"కి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసింది.
 • 2011 -2013ల మధ్య "పరోమా" పక్షపత్రికకు ఎడిటర్‌గా ఉంది.[2] ఈ పత్రిక మూత పడ్డ తరువాత ఈమె "ప్రథమ ఏకో" అనే పత్రికను కొంతకాలం నడిపింది.[3]

చిత్రాలు

మార్చు

నటిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరలు
1955 మెజొ బవు
1961 తీన్ కన్య] మృణ్మయి సంపాతి విభాగం
1965 ఆకాశ్ కుసుమ్ మోనికా
బక్సా బాదల్ మిను
1968 హంగ్స - మిథున్
1969 విశ్వాస్
ది గురు గజాలా
అపరాజితొ సునీత
1970 పద్మగోలప్
అరణ్యేర్ దిన్ రాత్రి హరి మాజీ ప్రియురాలు
కళంకిత నాయక్
బాంబే టాకీ మాలా
1971 ఖుంజె బెరాయ్
ఏఖోని
ఏఖ్‌నే పింజర్
జయ్ జయంతి జయంతి
1972 నాయికర్ భూమికై
జీబన్ సైకతె
మేమ్‌ సాహెబ్
1973 ఆలీబాబా మార్జినా
శేష్ ప్రిస్తే దేఖున్
ఈపార్ ఓపార్
బిలెట్ ఫెరట్
నకల్ సోనా
సోనార్ ఖాంచా
క్యా హినెర్ కహిని
బసంత్ బిలాప్ అనూరాధ
రతెర్ రజినీగంధా
1974 సుజాత
జాదు బాద్షా
అసతి
అలోర్ ఠికానా
సగినా సెక్రెటరీ విశాఖాదేవి
1975 కాజల్లత
ఛుట్టిర్ పండె
రాగ్ అనురాగ్
నిశిర్ మృగయ
1976 జన అరణ్య సోమనాథ్ మాజీ ప్రియురాలు
అసమయ్
జానేమన్
నిధిరామ్‌ సర్దార్
1977 ఇమ్మాన్ ధరం శ్యామ్లీ
అజస్ర ధన్యబాద్
కొత్వాల్ సాబ్
Proxy
1978

హల్లాబలూ ఓవర్ జార్జీ అండ్ బోనీ'స్ పిక్చర్స్

బోనీ
1979 నౌకాడుబి కమల
1981 థీ అనిత
"బందీ బాలక"
1982 బిజోయిని
అమృత కుంభెర్ సంధనె
1983 Bishabriksha Suryamukhi
Abhinoy Noy
Arpita
Indira Indira
1984 Paroma Sheela
"Pikoo"
"Mohanar Dike"
1985 Neelkantha
1986 Shyam Saheb
1987 Debika
"Ekanta Apan"
"Jar Jey Priyo"
1989 Kari Diye Kinlam
1990 ఏక్‌ దిన్ అచానక్ Professor's student
"సంక్రాంతి"
1991 "మహాపృథివి" కోడలు
1992 శ్వేత్ పథరర్ తాళ బందన
అనన్య
1995 "ఆమోదిని"
1996 ఉనీషే ఏప్రిల్ సరోజిని
అభిషప్త ప్రేమ్
2000 పరొమితర్ ఏక్ దిన్ సనక
ఘాత్ సుమన్ పాండే
2002 టిటిలి ఊర్మిళ
2009 అంతహీన్ పరొమిత
2011 ఇతి మృణాళిని మృణాళినీ మిత్రా
2014 చొతుష్కోణ తృణా సేన్

రచయిత్రి, దర్శకురాలిగా

మార్చు
సంవత్సరం సినిమా భాష (లు) వివరాలు
1981 36, చౌరంగీ లేన్ బెంగాలీ, ఇంగ్లీషు ఉత్తమ దర్శకురాలిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
ఉత్తమ ఆంగ్లభాషా చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
1984 పరోమా బెంగాలీ ఉత్తమ దర్శకురాలిగా BFJA అవార్డ్.
1989 సతి బెంగాలీ
1995 యుగాంత్ బెంగాలీ ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ పురస్కారం
2000 పరోమితర్ కీ ఏక్ దిన్ బెంగాలీ ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ పురస్కారం,
ఉత్తమ దర్శకురాలిగా కళాకార్ అవార్డ్
2001 మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ఇంగ్లీషు ఉత్తమ దర్శకురాలిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా నర్గీస్ దత్ పురస్కారం
ఉత్తమ స్క్రీన్ ప్లేకి జాతీయ పురస్కారం
2005 15 పార్క్ ఎవెన్యు ఇంగ్లీష్ ఉత్తమ ఆంగ్లభాషా చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
2010 ది జపనీస్ వైఫ్ ఇంగ్లీషు, బెంగాలీ, జపనీస్
2011 ఇతి మృణాళిని బెంగాలీ ఉత్తమ దర్శకురాలిగా కళాకార్ అవార్డు
2013 గొయ్నార్ బక్షొ బెంగాలీ
2015 ఆర్షి నగర్ బెంగాలీ Released: 25 December 2015
2017 సొనాటా ఇంగ్లీషు, హిందీ విడుదల కావలసి ఉంది

అవార్డులు

మార్చు
 • "పద్మశ్రీ"-భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం - 1987
 • బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) అవార్డ్-అపరాజితొ చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1970.
 • BFJA అవార్డ్-సుజాత చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1975.
 • BFJA అవార్డ్-ఏకంతొ అపన్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1988.
 • BFJA అవార్డ్-శ్వేత్ పథరెర్ తాళ చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1993.
 • BFJA అవార్డ్-పరమితర్ ఏక్ దిన్చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 2001.
 • BFJA అవార్డ్-మహా ప్రిథిబి చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1992.
 • BFJA అవార్డ్-అభిశప్త ప్రేం చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 1997.
 • BFJA అవార్డ్-జీవన సాఫల్య పురస్కారం 2013.
 • ఆనందలోక్ అవార్డ్- ఉత్తమ నటి 2001.
 • ఆనందలోక్ అవార్డ్-టిట్లీ చిత్రానికి ఉత్తమ నటి అవార్డ్ 2002.
 • కళాకార్ అవార్డ్-భలో కరబ్ మేయే నాటకంలో ఉత్తమ రంగస్థల నటి పురస్కారం 1993.
 • ఆనందలోక్ అవార్డ్-ఇతి మృణాళిని చిత్రానికి ఉత్తమ దర్శకురాలు 2012.
 • దక్షిణాసియా చలనచిత్రోత్సవం, వాషింగ్‌టన్ డిసి - జీవన సాఫల్య పురస్కారం 2015.

మూలాలు

మార్చు
 1. "Bollywood wins big at National Film Awards". Reuters India. 23 January 2010. Archived from the original on 26 January 2010. Retrieved 2 February 2010.
 2. "Paroma, the fortnightly magazine of Saradha launched by CM". Events at Saradha Realty. Archived from the original on 4 ఏప్రిల్ 2016. Retrieved 1 May 2017.
 3. Sengupta, Reshmi (21 August 2014). "Why I did not quit". The Telegraph. Retrieved 3 May 2017.

బయటి లింకులు

మార్చు