షికారు (2022 సినిమా)

షికారు ఇది 2022 జూన్ 24వ తేదీన విడుదల కానున్న తెలుగు చిత్రం.[1] యాన్‌ అన్‌లిమిటెడ్‌ ఫన్‌ రైడ్‌ అనేది దీని ట్యాగ్‌లైన్‌. ఇందులొ సాయిధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, కె.వి. ధీరజ్‌, నవకాంత్‌, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణమ్మ, సురేఖా వాణి, చమ్మక్‌ చంద్ర ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రం నాగేశ్వరి సమర్పణలో పి.ఎస్‌.ఆర్‌. కుమార్‌( బాబ్జీ) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్‌ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. శేఖర్‌ చంద్ర సంగీతం సమకూర్చారు.

షికారు
దర్శకత్వంహరి కొలగాని
నిర్మాతపి.ఎస్‌.ఆర్‌. కుమార్‌
తారాగణంసాయిధన్సిక,
తేజ్‌ కూరపాటి,
పోసాని కృష్ణ మురళి,
అన్నపూర్ణమ్మ,
సురేఖా వాణి,
చమ్మక్‌ చంద్ర
సంగీతంశేఖర్‌ చంద్ర
విడుదల తేదీ
2022 జూన్ 24 (2022-06-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

‘దేవదాసు వల్ల పారు బ్యాడు’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం 2022 జూన్ 11న విడుదల చేసింది.

కథ మార్చు

షికారు పూర్తి రొమాంటిక్ కామెడీ డ్రామా. తమిళ చలన చిత్ర నటి సాయి ధన్సికకు ఈ చిత్రం తెలుగులో మొదటిది. ఆమె వివాహిత పాత్రలో నటిస్తుంది. ఇది ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ పాత్ర. ఈ ప్రధాన పాత్రతో పాటు అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్, నవకాంత్ సహాయక పాత్రలు పోషించారు. వీరంతా యంగ్ ఎనర్జిక్ ఫెలోస్‌గా కనిపిస్తారు. కథ ఈ ఐదుగురి చుట్టూ ఫన్నీ, రొమాంటిక్ గా తిరుగుతుంది.

మూలాలు మార్చు

  1. "'షికారు'లో చమక్‌ చంద్రపై సాంగ్‌ - జూన్‌ 24న సినిమా రిలీజ్‌ | Prajasakti". web.archive.org. 2022-06-15. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)