షేర్ మణెమ్మ
షేర్ మణెమ్మ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారిణి. ఈవిడ 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]
షేర్ మణెమ్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | తెలంగాణ ఉద్యమకారిణి |
జీవిత విశేషాలు
మార్చుషేర్ మణెమ్మ కాప్రాలోని బీజేఆర్‌నగర్‌లో ఉంటూ పలు సామాజిక సేవల్లో పాల్గొంటూ పలువురిచే ప్రశంసలు, అవార్డులు అందుకుంది. శ్రీజ్యోతి మహిళామండలి అధ్యక్షురాలిగా మహిళలకు అండగా ఉంటూ, పేదప్రజల వివాహాలకు, అనాథలకోసం తనవంతు చేయూత అందించింది.[3]
తెలంగాణ ఉద్యమంలో
మార్చుతెలంగాణ ఉద్యమం తొలి రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువరకు ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు రోకో, రాస్తారోకో, తెలంగాణ గర్జన, సకల జనుల సమ్మె, తెలంగాణ ధూం ధాంలలో పాల్గొన్నది. వీటికి సంబంధించి మణెమ్మపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఉద్యమం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా మణెమ్మ చర్లపల్లి జైలుముందు ఐదురోజులపాటు నిరాహారదీక్ష చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నది.[3]
బహుమతులు - పురస్కారాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
- ప్రొఫెసర్ జయశంకర్ స్మారక పురస్కారం - సేవారంగం[3]
మూలాలు
మార్చు- ↑ www.siasat.com. "INTERNATIONAL WOMEN'S DAY ON MARCH 8—TS GOVT TO HONOUR EMINENT WOMEN". www.siasat.com. Retrieved 8 March 2017.
- ↑ సాక్షి. "తెలంగాణ మహిళా మణులు వీరే." Retrieved 8 March 2017.
- ↑ 3.0 3.1 3.2 నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 7 April 2017.