సంఘం (సినిమా)
సంఘం (1954 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎమ్.వి.రామన్ |
నిర్మాణం | ఎ.వి.మెయ్యప్పన్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, వైజయంతిమాల, అంజలీదేవి |
సంగీతం | ఆర్.గోవర్ధనం |
నిర్మాణ సంస్థ | ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూలై 10,1954 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
1954, జూలై 10న విడుదలైన తెలుగు చలనచిత్రం - సంఘం. వర్ణభేధాలు రూపుమాసిపోవాలనీ, అవి పోతేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందనీ, ఆ విభేధాలు పోవడానికి వర్ణాంతర వివాహాలు జరపడం మంచి మార్గమని ఉద్భోదించే చిత్రం - సంఘం.[1] ఎ.వి.యం. ప్రొడక్షన్స్ పతాకంలో ఎన్.టి.ఆర్. నటించిన మొదటిచిత్రం ఇది.
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం : ఎం.వి.రామన్
- మాటలు : తోలేటి వెంకటరెడ్డి
- పాటలు : తోలేటి వెంకటరెడ్డి
నటీనటులు సవరించు
- ఎన్.టి.రామారావు
- వైజయంతిమాల
- అంజలీదేవి
- ఎస్.వి.రంగారావు
- బాలచందర్
- చిత్తూరు నాగయ్య
- సహస్రనామం
- ఋష్యేంద్రమణి
- రమణారెడ్డి
చిత్రకథ సవరించు
వర్ణాంతర వివాహం చేసుకున్న ఒక సంఘసంస్కర్త (నాగయ్య)కు కామిని (అంజలీదేవి) అని ఒక కుమార్తె ఉంటుంది. కామిని కులం లేని పిల్ల కాబట్టి ఆమెను ఎవరూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకురారు. కామినికి రాణి (వైజయంతిమాల) అని ఒక స్నేహితురాలు ఉంటుంది. రాణి మంచి ధైర్యవంతురాలు. పైగా బాగా నాట్యం కూడా చేస్తుంది. రాజా (ఎన్.టి.రామారావు) తండ్రిగారు సీతారామాంజనేయదాస్ (ఎస్.వి.రంగారావు) స్త్రీద్వేషి. కాబట్టి కొడుకుకు పెళ్ళిచేయకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ భార్య రత్నం (ఋష్యేంద్రమణి) పోరు భరించలేక పెళ్ళి చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే తనకు నచ్చిన పిల్లనే పెళ్ళిచేస్తానంటాడు. ఒక రోజు రాజా అతని స్నేహితుడు చంద్రం (బాలచందర్) కారులో పోతుండగా కామిని - రాణి మరొక కారులో పోతూ తటస్థపడతారు. రాజా కామినిని ప్రేమిస్తాడు. ఆమె కులం లేని పిల్ల అని తెలిసికూడా ఆమెనే పెళ్ళి చేసుకుంటానంటాడు. చంద్రం సహాయంతో రాజా కామినిల వివాహం రాజా తండ్రికి తెలియకుండా జరిగిపోతుంది. రాజా ఒక కులంలేని పిల్లను పెళ్ళి చేసుకున్నట్లు తెలిసి అతని తండ్రి కోపంతో కొడుకుని వెనక్కి పిలిపిస్తాడు. కులంలేని పిల్లకు గుణం కూడా ఉండదని కొడుక్కి నూరిపోస్తాడు. ఒకరోజు రాజా భార్య కోసం వెళ్లితే అక్కడ కెప్టెన్ సుందరం (సహస్రనామం) కామినిని బలాత్కరించబోతుంటాడు. రాజా అక్కడ ఆ గదిలో వారిద్దరూ ఉండడం చూసి కామిని మంచిది కాదని అపోహపడి తండ్రివద్దకు పోయి "మీ యిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్ళి చేయ"మని అంటాడు. రాజాతో కామినికి పెళ్ళి అయిన విషయం తెలియక రాణి రాజాతో పెళ్ళికి అంగీకరిస్తుంది. చివరకు కామిని నిర్దోషిగ నిరూపణ అయి కులంలేని పిల్ల అయినా గుణం కలిగిన పిల్ల అయినందున ఆమెతో కాపురం చేయడానికి రాజా అంగీకరిస్తాడు. అంతా సుఖంగా ఉంటారు[2].
పాటలు సవరించు
ఈ సినిమాలోని పాటల వివరాలు[3]
- ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ - రఘునాథ్ పాణిగ్రాహి
- ఆశలే అడియాసలా సంద్రాన రేగే ఘోషలా -
- ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం కనులకు సుందరం - పి.సుశీల
- కరవాలమా నీ శూరత యిల చూపు బిరాన - పి.సుశీల, టి.ఎస్.భగవతి బృందం
- గుభీ గభీమని జాతులగోడలు కూలిచి రావోయి మామయ్య - పి.సుశీల
- జాతిబేధం సమసిపోదా జనులు సుఖమంద నీతిలేని - నాగయ్య
- నమ్మరాదురా ఆడదాని నమ్మరాదురా - మాధవపెద్ది బృందం
- నలుగురిలో నను నడుబాటు చేయుట న్యాయముగా తోచేనా - టి.ఎస్.భగవతి
- నిదురించెడి భగవానుని ఉయ్యాలాల జోల నిరుపేదల - మాధవపెద్ది
- పెళ్ళి పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైన దానితో జోడిగా హాయిగా - పిఠాపురం
- భారత వీరకుమారిని నేనే నారి రతనము నేనే - పి.సుశీల
- సుందరాంగ మరువగలేనోయ్ రావేలా నా అందచందములు - పి.సుశీల, టి.ఎస్.భగవతి
మూలాలు సవరించు
- ↑ pressacademyarchives. "1954లో విడుదలైన ఎ.వి.యం. ప్రొడక్షన్స్ సంఘం". www.pressacademyarchives.ap.nic.in. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 11 July 2017.
- ↑ భీశెట్టి (18 January 1991). "అలనాట్ మేటి చిత్రాలు - సంఘం". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 83 (21): 41. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 12 October 2016.
- ↑ కొల్లూరి, భాస్కరరావు. "స౦ఘ౦ - 1954". ఘంటసాల గళామృతము. Retrieved 12 October 2016.[permanent dead link]