రఘునాథ్ పాణిగ్రాహి

భారతీయ శాస్త్రీయ గాయకుడు

రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

రఘునాథ్ పాణిగ్రాహి

విశేషాలు మార్చు

 
పద్మశ్రీపురస్కారం

ఇతడు 1935, ఆగస్టు 10న ఒరిస్సాలోని రాయగడ జిల్లా గునుపూర్‌లో జన్మించాడు. ఇతడు తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నాడు. గీతా గోవిందం ఆలాపనా విధానాన్ని కూడా తండ్రి నుండే పుణికిపుచ్చుకున్నాడు. ఫ్రెంచి ప్రభుత్వ సత్కారం పొందిన తొలి ఒడియా గాయకుడు ఇతడే[1]. 2010లో ఇతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడి భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి సంయుక్త పాణిగ్రాహి[1]. ఈమె 1997లో మరణించింది. ఇతడు తన భార్య పేరుతో సంయుక్త పాణిగ్రాహి ట్రస్టును ప్రారంభించి ఒడిస్సి నృత్య కారులకు ఎంతో చేయూతనిచ్చాడు. వారి ద్వారా ఒడిస్సీ నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చాడు.

సినిమా రంగం మార్చు

ఇతడు 1950వ దశకం నుండి తెలుగు, కన్నడ, ఒరియా సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించాడు.

ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల వివరాలు[2]:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 అమర సందేశం మానస లాలస సంగీతం మధుమయ జీవన ఎ.ఎం.రాజా ప్రసాదరావు, కేల్కర్ 1954
2 సంఘం ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ ఆర్.గోవర్ధనం తోలేటి 1954
3 సంతోషం నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని ఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తి సముద్రాల సీనియర్ 1955
4 సంతోషం యువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారా జిక్కి ఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తి సముద్రాల సీనియర్ 1955
5 ఇలవేల్పు ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని సుసర్ల దక్షిణామూర్తి 1956
6 ఇలవేల్పు చల్లని రాజా ఓ చందమామ పి.సుశీల, పి.లీల సుసర్ల దక్షిణామూర్తి శ్రీశ్రీ 1956
7 సంకల్పం తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు పిఠాపురం బృందం సుసర్ల దక్షిణామూర్తి 1957
8 సంకల్పం వెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలో సుసర్ల దక్షిణామూర్తి 1957
9 గంగా గౌరీ సంవాదం భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి ఎస్.జానకి, ఎం.ఎస్.రామారావు బృందం పెండ్యాల పరశురామ్ 1958
10 జయభేరి మది శారదాదేవి మందిరమే ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ పెండ్యాల మల్లాది రామకృష్ణశాస్త్రి 1959
11 మైరావణ మెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగా ఎస్.జానకి ఎస్.రాజేశ్వరరావు ఆరుద్ర 1964

మరణం మార్చు

ఇతడు తన 80వ యేట 2013, ఆగస్టు 13వ తేదిన గుండెపోటుతో భువనేశ్వర్ లోని స్వగృహంలో మరణించాడు[1].

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 విలేఖరి (26 August 2013). "పండిట్‌ రఘునాథ్‌ పాణిగ్రాహి మృతి". విశాలాంధ్ర. Retrieved 12 October 2016.[permanent dead link]
  2. కొల్లూరి, భాస్కరరావు. "రఘునాథ్ పాణిగ్రాహి". ఘంటసాల గళామృతము. Retrieved 12 October 2016.[permanent dead link]