సంతాలు, లేదా సంతాల్,[5] దక్షిణ ఆసియాలో భారతదేశం, బంగ్లాదేశుకు చెందిన ఒక జాతి సమూహం. జనాభా పరంగా జార్ఖండు రాష్ట్రంలో సంతాలు అతిపెద్ద తెగ. అస్సాం, బీహారు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు రాష్ట్రాలలో కూడా వీరు కనిపిస్తారు. వారు ఉత్తర బంగ్లాదేశు రాజ్షాహి డివిజను, రంగపూరు డివిజన్లలో అతిపెద్ద జాతి మైనారిటీ. నేపాలు, భూటాన్లలో వీరి గణనీయమైన జనాభా ఉంది. సంతాలు ప్రజలు ఎక్కువగా ఆస్ట్రో ఏసియాటిక్ భాష అయిన సంతాలీ భాషను మాట్లాడతారు. వీరు ముండా భాషలలో ఎక్కువగా మాట్లాడతారు.

సంతాలు
సంతాలి సంప్రదాయ నృత్యం
Total population
7.4 million
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 భారతదేశం Bangladesh Nepal
 భారతదేశంజార్ఖండ్ 2,752,723[1]

పశ్చిమ బెంగాల్ 2,512,331[1]
ఒడిశా 894,764[1]
బీహార్ 406,076[1]

అస్సాం 213,139[2]
 Bangladesh300,061 (2001)[3]
 Nepal42,698[4]
భాషలు
సంతాలి భాష, ఒడియా భాష
మతం
సార్న మతం  • హిందూమతం  • క్రైస్తవ మతం  • ఇస్లాం  • సిక్కు మతం  • బౌద్ధమతం  • జైనమతం
సంబంధిత జాతి సమూహాలు

చరిత్ర మార్చు

భాషా శాస్త్రవేత్త పాల్ సిడ్వెల్ (2018) అభిప్రాయం ఆధారంగా ఆస్ట్రో-ఆసియా భాష మాట్లాడే ప్రజలు 4000–3500 సంవత్సరాల క్రితం ఇండోచైనా నుండి ఒరిస్సా తీరానికి వచ్చారు.[6] ఆస్ట్రోయాసియాటికు మాట్లాడే ప్రజలు ఆగ్నేయాసియా నుండి వ్యాపించింది. వీరు స్థానిక భారతీయ జనాభాతో విస్తృతంగా కలిసారు.[7]

బ్రిటిషు అధికారులు వ్యవసాయం విస్తరించడం ద్వారా వీరి ఆదాయాన్ని పెంచాలని అనుకున్నారు.[8] వారు రాజమహలు కొండల పహరియా ప్రజలను స్థిర వ్యవసాయం చేయమని ప్రోత్సహించారు. కాని వారు చెట్లను నరికివేయడానికి నిరాకరించారు. అప్పుడు బ్రిటీషు అధికారులు స్థిరపడిన వ్యవసాయం కోసం అడవిని నిర్మూలన చేయడానికి సిద్ధంగా ఉన్న శాంతల వైపు దృష్టి సారించారు. 1832 లో పెద్ద సంఖ్యలో ప్రాంతాలను డామిన్-ఇ-కోహ్ లేదా సంతాల్ పరగణాగా గుర్తించారు. కటక్, ధల్భం, బిర్భుం, మంభం, హజారిబాగ్ నుండి సంతాలు ప్రజలు వలస వచ్చి ఈ భూములను రైతులుగా సాగు చేయడం ప్రారంభించారు. బ్రిటిషు వారు ఈ సంతాల నుండి ఆదాయంగా పన్నులు వసూలు చేశారు. పన్నులు విధించడం, జమీందార్లు, రుణదాతలు దోపిడీ చేయడం శాతలు తిరుగుబాటుకు నాంది పలికింది. సిద్దూ, కన్హు ముర్ము, ఇద్దరు సోదరులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంతాలు ప్రజలకు నాయకత్వం వహించారు కాని వారు ఓడిపోయారు.[8][9][10]

మతం మార్చు

చాలా అధ్యయనం చేయబడిన వాటిలో ఒకటైన సంతాలు మతం మరాంగు బురు (బొంగాను) సుప్రీం దేవతగా ఆరాధిస్తుంది. ఏది ఏమయినప్పటికీ ప్రపంచంలోని వివిధ కోణాలలో నిర్వహించే, చెడు ప్రభావాలను నివారించడానికి ప్రార్థనలు, నైవేద్యాలతో ప్రశాంతంగా ఉన్న ఆత్మల (బోంగా)సభలో ఎక్కువ మందికి భక్తి ఉంటుంది. ఈ ఆత్మలు గ్రామం, గృహ, పూర్వీకులు, ఉప-వంశ స్థాయిలో పనిచేస్తాయి. ఇవి వ్యాధికి కారణమయ్యే దుష్టశక్తులతో పాటు గ్రామ సరిహద్దులు, పర్వతాలు, నీరు, పులులు, అడవిలో నివసించగలవు. సంతాలు గ్రామం లక్షణం చాలా మంది ఆత్మలకు వరుస వార్షిక ఉత్సవాలు నిర్వహించడం ఒకటి. గ్రామం అంచున ఉన్న పవిత్రమైన శ్మశానం (జహెరు [11] లేదా "సంతాలు స్థావరం" అని పిలుస్తారు) లో వరుసగా పలు వార్షిక ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.[12]

వ్యవసాయ చక్రంతో అనుసంధానించబడిన సంవత్సరపు ఆచారాలు, పుట్టుక, వివాహం, మరణం వద్ద ఖననం కోసం జీవిత-చక్ర ఆచారాలతో పాటు, జంతువులకు, సాధారణంగా పక్షులను బలినిస్తామని ఆత్మలు సమర్పణలను కోరుకుంటారు. పురుషులు మతపరమైన నాయకులు, వైద్య చికిత్సలలో నిపుణులు, వారు భవిష్యవాణి, మంత్రవిద్యలను అభ్యసిస్తారు (ఈ పదం సామాజిక-చారిత్రక అర్ధం, ఇక్కడ ఉపయోగించబడింది, ఇది మాయాజాలం ఆచార పద్ధతిని సూచిస్తుంది. పెజోరేటివు కాదు). ఈశాన్య, మధ్య భారతదేశంలోని ఖరియా, ముండా, ఒరాను వంటి ఇతర తెగలలో ఇలాంటి నమ్మకాలు సాధారణంగా కనిపిస్తుంది.[12]

చిన్న, ఎక్కువ విభక్త తెగలు తరచుగా ఆధ్యాత్మిక సోపానక్రమం ఉచ్చారణ వర్గీకరణ వ్యవస్థలను ప్రదర్శిస్తాయి. అవి అనిమిజం కార్యకలాపాలు సామాజిక సమూహాలతో అనుసంధానించబడిన ఆధ్యాత్మిక శక్తుల సాధారణ ఆరాధనగా వర్ణించబడ్డాయి. మతపరమైన భావనలు ప్రకృతి గురించి ఆలోచనలు, స్థానిక పర్యావరణ వ్యవస్థలతో పరస్పర చర్యలతో చిక్కుకున్నాయి. సంతాలు మతపరమైన నిపుణులు గ్రామం లేదా కుటుంబం నుండి తీసుకోబడతారు. వీరు విస్తృతమైన ఆధ్యాత్మిక విధులను అందిస్తారు. ఇవి ప్రమాదకరమైన ఆత్మలను శాంతింపజేయడం, ఆచారాలను సమన్వయం చేయడంపై దృష్టి పెడతాయి.[12]

2011 భారతీయ జనాభా లెక్కల ప్రకారం జార్ఖండు నుండి వచ్చిన సంతాలుల్లో ఎక్కువ మంది హిందూ మతాన్ని 54% అనుసరిస్తున్నారు. 37% మంది "ఇతర మతాలు, ఒప్పందాలను" అనుసరిస్తున్నారు. క్రైస్తవ మతం జనాభాలో 8.3% మంది ఉన్నారు. ఇస్లాం, సిక్కు మతం, బౌద్ధమతం, జైన మతం జనాభాలో 1% కన్నా తక్కువ.[13][14]

సంస్కృతి మార్చు

సంతాలు సమూహంలో ప్రధాన పండుగ సోహ్రాయి. అంతేకాకుండా బహా, కరం, దన్సాయి, సక్రాతు, మహమోరు, రుండో, మాగ్సిం మొదలైన ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. సంతాలు సాంప్రదాయకంగా ఈ పండుగలలో వారి రెండు డ్రంలతో రెండు నృత్యాలు ఉన్నాయి: తమకు ‘ తుమ్డాకూ.[15]

 
సంతాలు నృత్యం

చందరు బాదరు, తోలుబొమ్మల రూపం, దీనిని సంతాలు తోలుబొమ్మ అని కూడా పిలుస్తారు. ఇది ఒక చిన్న బోనులో ఉంచిన చెక్క వేదికగా చేసే తోలుబొమ్మలతో కూడిన జానపద ప్రదర్శన.

వాస్తవానికి వేటగాళ్ళుగా ఉండే సంతాలు ప్రజలు వ్యవసాయ జీవనశైలికి పరివర్తన చెందారు. నిర్ణయం తీసుకునే విషయాలు మంజి అనే వ్యక్తి నేతృత్వంలోని గ్రామ మండలి ద్వారా జరుగుతాయి. స్థానిక వ్యవహారాలను నిర్వహించడానికి, పరిష్కరించడానికి మాంజికి ఇతర కౌన్సిలు సభ్యులు సహాయం చేస్తారు.[16]

సంతాలు కళలు దాని క్లిష్టమైన శిల్ప శైలికి గుర్తింపుపొందింది. సాంప్రదాయ సంతాలు గృహాల గోడలు జంతువుల నమూనాలతో చెక్కి ఉంటాయి, వేట దృశ్యాలు, నృత్య దృశ్యాలు, రేఖాగణిత నమూనాలు, మరిన్ని చిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. సంతాలు శైలి పల్లకీలు కూడా చక్కగా చెక్కబడి రూపకల్పన చేయబడ్డాయి.[16]

 
దోద్రో బాణం సగీతపరికరం

ప్రముఖులు మార్చు

  • బాహుబలి మరాండు :- మొదటి జార్ఖండు ముఖ్యమంత్రి.[17]
  • ద్రౌపది ముర్ము - రాజకీయవేత్త[18]
  • రఘునాథు ముర్ము - ఓల్-చికి లిపి ఆవిష్కర్త
  • సిద్ధూ, కన్హు ముర్ము - స్వాతంత్ర్య సమరయోధుడు.[19]
  • షిబు సోరెను - జార్ఖండు మాజీ ముఖ్యమంత్రి[20]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 18 నవంబరు 2017.
  2. "C-16 Population By Mother Tongue". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 3 నవంబరు 2019.
  3. Cavallaro, Francesco; Rahman, Tania. "The Santals of Bangladesh" (PDF). ntu.edu.sg. Nayang Technical University. Archived from the original (PDF) on 9 నవంబరు 2016. Retrieved 17 నవంబరు 2017.
  4. "Santali: Also spoken in Nepal". Archived from the original on 27 నవంబరు 2018. Retrieved 1 ఏప్రిల్ 2011.
  5. Bisoee, Animesh (28 మే 2019). "Brave show of support for arrested Santhal". The Telegraph (in ఇంగ్లీష్). Retrieved 31 మే 2019.
  6. Sidwell, Paul. 2018. Austroasiatic Studies: state of the art in 2018 Archived 2019-05-03 at the Wayback Machine. Presentation at the Graduate Institute of Linguistics, National Tsing Hua University, Taiwan, 22 May 2018.
  7. Schliesinger, Joachim (2016). Origin of the Tai People 3: Genetic and Archaeological Approaches (in ఇంగ్లీష్). Booksmango. p. 71. ISBN 9781633239623. Retrieved 30 సెప్టెంబరు 2019.
  8. 8.0 8.1 Jha, Amar Nath (2009). "Locating the Ancient History of Santal Parganas". Proceedings of the Indian History Congress. 70: 185–196. ISSN 2249-1937. JSTOR 44147668.
  9. This is Our Homeland: A Collection of Essays on the Betrayal of Adivasi. 2007. Retrieved 26 ఆగస్టు 2019.
  10. Malik, Dr Malti (1943). History of India. ISBN 9788173354984. Retrieved 26 ఆగస్టు 2019.
  11. "Jaher Worshiping Place of Santals". Retrieved 27 సెప్టెంబరు 2014.
  12. 12.0 12.1 12.2 "The Green Revolution in India". U.S. Library of Congress Country Studies (released in public domain). Retrieved 6 అక్టోబరు 2007.
  13. "ST-14 Scheduled Tribe Population By Religious Community". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 17 అక్టోబరు 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Religion Data - Jharkhand". census.gov.in. Retrieved 3 నవంబరు 2019.
  15. "Chadar Badar". Telegraph. 2015. Retrieved 22 మార్చి 2015.
  16. 16.0 16.1 Winston, Robert, ed. (2004). Human: The Definitive Visual Guide. New York: Dorling Kindersley. p. 440. ISBN 0-7566-0520-2.
  17. "जिस BJP को दिलाई थी करिश्माई जीत, बाबूलाल मरांडी का उसी से हुआ मोहभंग". aajtak.intoday. 1 ఏప్రిల్ 2019.
  18. "Draupadi Murmu may soon be the President of India: Know all about her". indiatoday.
  19. Sailendra Nath Sen (2010). An Advanced History of Modern India. Macmillan. p. 120. ISBN 9780230328853.
  20. "Shibu Soren". britannica.

గ్రంధసూచిక మార్చు

  • Archer, W. G. The Hill of Flutes: Life, Love, and Poetry in Tribal India: A Portrait of the Santals. Pittsburgh: University of Pittsburgh Press, 1974.
  • Bodding, P. O. Santal Folk Tales. Cambridge, Massachusetts: H. Aschehoug; Harvard University Press, 1925.
  • Bodding, P. O. Santal Riddles and Witchcraft among the Santals. Oslo: A. W. Brøggers, 1940.
  • Bodding, P. O. A Santal Dictionary (5 volumes), 1933–36 Oslo: J. Dybwad, 1929.
  • Bodding, P. O. Materials for a Santali Grammar I, Dumka 1922
  • Bodding, P. O. Studies in Santal Medicine and Connected Folklore (3 volumes), 1925–40
  • Bompas, Cecil Henry, and Bodding, P. O. Folklore of the Santal Parganas. London: D. Nutt, 1909. Full text at Project Gutenberg.
  • Chakrabarti, Dr. Byomkes, A Comparative Study of Santali and Bengali, KP Bagchi, Calcutta, 1994
  • Culshaw, W. J. Tribal Heritage; a Study of the Santals. London: Lutterworth Press, 1949.
  • Edward Duyker Tribal Guerrillas: The Santals of West Bengal and the Naxalite Movement, Oxford University Press, New Delhi, 1987, pp. 201, SBN 19 561938 2.
  • Hembrom. T, The Santals: Anthropological-Theological Reflections on Santali & Biblical Creation Traditions. 1st ed. Calcutta: Punthi Pustak, 1996.
  • Orans, Martin. "The Santal; a Tribe in Search of a Great Tradition." Based on thesis, University of Chicago., Wayne State University Press, 1965.
  • Prasad, Onkar. Santal Music: A Study in Pattern and Process of Cultural Persistence, Tribal Studies of India Series; T 115. New Delhi: Inter-India Publications, 1985.
  • Roy Chaudhury, Indu. Folk Tales of the Santals. 1st ed. Folk Tales of India Series, 13. New Delhi: Sterling Publishers, 1973.
  • Troisi, J. The Santals: A Classified and Annotated Bibliography. New Delhi: Manohar Book Service, 1976.
  • ———. Tribal Religion: Religious Beliefs and Practices among the Santals. New Delhi: Manohar, 2000.

వెలుపలి లింకులు మార్చు

మూస:NIE Poster

మూస:Ethnic groups in Bangladesh మూస:Ethnic groups in Nepal మూస:Scheduled tribes of India మూస:Hill tribes of Northeast India మూస:Tribes of Jharkhand మూస:Scheduled tribes in Orissa మూస:Scheduled tribes of West Bengal