సంధ్య (1980 సినిమా)
సంధ్య 1980, నవంబర్ 29వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో శ్రీధర్,సుజాత జంటగా నటించారు.[1] అనిల్ గంగూలీ దర్శకత్వంలో రాఖీ, పరీక్షిత్ సాహ్ని జంటగా 1976లో వెలువడిన హిందీ సినిమా తపస్యను తెలుగులో సంధ్యగా పునర్మించారు.
సంధ్య (1980 తెలుగు సినిమా) | |
సంధ్య సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
తారాగణం | శ్రీధర్, సుజాత, చంద్రమోహన్ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ సావరిన్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శ్రీధర్
- సుజాత
- చంద్రమోహన్
- గుమ్మడి
- అల్లు రామలింగయ్య
- కాంతారావు
- మిక్కిలినేని
- రామన్ కౌశిక్
- ఎస్.రాజేంద్రబాబు
- గీత
- పండరీబాయి
- జయవిజయ
- భావన
- నిషా
- జయవాణి
- బేబీ వరలక్ష్మి
- కె.కె.శర్మ
- జగ్గయ్య
- ప్రభాకర్‌రెడ్డి
- తులసి
సాంకేతికవర్గం
మార్చు- నిర్మాత: కంచర్ల పూర్ణచంద్రరావు
- దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- సంగీతం: చక్రవర్తి
- పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
- కళ: తోట యాదు
- నృత్యం: సురేఖ
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ, వేటూరి, సినారెలు రచించగా, కె.చక్రవర్తి స్వరకల్పనలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజలు గానం చేశారు.[2]
క్ర.సం. | పాట | పాడినవారు | రచన |
---|---|---|---|
1 | ఈ అనంతకాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఆత్రేయ |
2 | ఈ ప్రణయ సంధ్యలో ఆ మౌనమెందుకో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | వేటూరి సుందరరామమూర్తి |
3 | చిన్నారి వదిన అందాల భరిణి | పి. సుశీల,ఎస్.పి.శైలజ బృందం | సి.నారాయణరెడ్డి |
4 | చిలక పాప నెమలి బాబు కలిసి పాడితే కలకల రాగం | పి.సుశీల బృందం | సి.నారాయణరెడ్డి |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Sandhya". indiancine.ma. Retrieved 17 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "స౦ధ్య - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 November 2021.