సంసారం (1988 సినిమా)

సంసారం 1988 లో విడుదలైన సినిమా. దీనిని ఎస్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో శాఖమూరి రామచంద్రరావు నిర్మించాడు.[1] ఇందులో శోభన్ బాబు, జయప్రద, శారద, రాజేంద్ర ప్రసాద్, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[2] ఈ చిత్రం తమిళ చిత్రం తైకు ఓరు తలాట్టు (1986) కు రీమేక్. అది మళ్ళీ మలయాళ చిత్రం ఓరు పెయిన్కిలికాథ (1984) కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమోదైంది.[3]

సంసారం
(1988 తెలుగు సినిమా)
Samsaram (1988 film).jpg
దర్శకత్వం రేలంగి నరసింహారావు
కథ బాలచంద్ర మీనన్
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం శోభన్ బాబు,
శారద,
జయప్రద
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం శరత్
కూర్పు డి. వెంకటరత్నం
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.ఫిల్మ్స్
భాష తెలుగు

కథసవరించు

రాజశేఖరం (శోభన్ బాబు) క్రమశిక్షణకు ప్రాణమిచ్చే వ్యక్తి. భార్య లక్ష్మి (శారద), ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూంటాడు. అతని పెద్ద కుమారుడు హరి (హరి ప్రసాద్), కుమార్తె రాధ (వరలక్ష్మి) అతని మార్గంలో నడుస్తారు. రెండవ కొడుకు రవి (రాజేంద్ర ప్రసాద్) మాత్రం తన తండ్రి కర్మాగారంలో కార్మికుడుగా పనిచేస్తూంటాడు. అతను అనాథ అమ్మాయి గౌరి (రజని) ని ప్రేమిస్తాడు. వారి శ్రేయోభిలాషి గోపాలం (గొల్లపూడి మారుతీరావు) సహాయంతో, రవి ఆమెను సేవకురాలిగా నిలబెట్టడతాడు. రాజశేఖరం రాధకు కుమార్ (సుధాకర్) అనే బాగా చదువుకున్న వ్యక్తితో పెళ్ళి చేస్తాడు. ఆ సమయంలో, రాజశేఖరం రవి ప్రేమ వ్యవహారాన్ని గ్రహించి, అతన్ని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. కొన్నాళ్ళకు, రాజశేఖరం కర్మాగారంలో కార్మిక వివాదాలు తలెత్తుతాయి. యూనియన్ నాయకుడు శేషగిరి / శేషు (ప్రసాద్ బాబు) రవిని మధ్యలో లాగి తండ్రీ కొడుకుల మధ్య వైరం సృష్టిస్తాడు. సంస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పద్మావతి (జయప్రద) అనే ప్రత్యేక కార్మిక అధికారిని నియమిస్తుంది. రాజశేఖరం, తన మాజీ ప్రేయసి పద్మావతిని అక్కడ చూసి షాక్ అవుతాడు. తరువాత, అతను గతాన్ని లక్ష్మికి తెలియజేస్తాడు. తన కళాశాల రోజుల్లో రాజశేఖరం పద్మావతి ప్రేమించుకుంటారు. అయితే ఒక దుస్థితిలో అతడు లక్ష్మిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. వెంటనే, లక్ష్మి పద్మావతిని కలుస్తుంది. తన భర్త గురించి ఆందోళన చెంది, చనిపోతుంది. ఆ తరువాత, రాజశేఖరం ఒంటరిగా ఉంటాడు. పద్మావతి కూడా బయటికి పోతుంది.

ప్రస్తుతం, రాజశేఖరం తన పెద్ద కొడుకు హరి వద్దకు వెళ్తాడు. కాని అతను పట్టించుకోనందున, రాజశేఖరం తిరిగి వచ్చేస్తాడు. ఆ సమయానికి, కుమార్ అతని ఇంటిని ఆక్రమించి, అతనిని బయటికి తోసేస్తాడు. ఆ సమయంలో, రవి అతడికి రక్షణగా వస్తాడు. రాజశేఖరం అతడి గుణాన్ని అర్థం చేసుకుంటాడు. చివరగా, రాజశేఖరం రవి గౌరీలతో సంతోషంగా ఉండగా ఈ చిత్రం ముగుస్తుంది.

నటవర్గంసవరించు

పాటలుసవరించు

రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. LEO ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.[4]

ఎస్. పాట పేరు సాహిత్యం సింగర్స్ పొడవు
1 "కొమ్మలో కోయిలా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:56
2 "నీవాళ్ళు వ్యారం" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలూ, చిత్ర 4:45
3 "రాలుగాయి రంభ లాటి" జోన్నావితుల రామలింగేశ్వరరావు ఎస్పీ బాలూ, చిత్ర 4:29
4 "ఓ తప్ప తాగిన" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ, జి. ఆనంద్ 5:04
5 "ఎవరమ్మా నీకు" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు 4:53

మూలాలుసవరించు

  1. Samsaram (Production). Spicy Onion.
  2. Samsaram (Cast & Crew). gomolo.com.
  3. Samsaram (Review). know Your Films.
  4. Samsaram (Songs). Cineradham.