సకల కళా వల్లభుడు

శివ గణేష్ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

సకల కళా వల్లభుడు 2020, ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సింహా ఫిల్మ్స్ పతాకంపై అనిల్ కుమార్ గుంట్రెడ్డి నిర్మాణ సారథ్యంలో శివ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనిష్క్ రెడ్డి, మేఘల, పృథ్వీరాజ్, సుమన్, జీవా తదితరులు నటించగా, అజయ్ పట్నాయిక్ సంగీతం అందించాడు. ఒక గ్రామ నేపథ్యంలో[3] కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్[4]గా తెరకెక్కిన ఈ చిత్రం 2017, డిసెంబరులో షూటింగ్ ప్రారంభించబడింది.[5][6]

సకల కళా వల్లభుడు
Sakala Kala Vallabhudu Movie Poster.jpg
సకల కళా వల్లభుడు సినిమా పోస్టర్
దర్శకత్వంశివ గణేష్
నిర్మాతఅనిల్ కుమార్ గుంట్రెడ్డి, త్రినాథ్ దడల, కిషోర్, శ్రీకాంత్ దీపాల
కథశివ గణేష్
నటులుతనిష్క్ రెడ్డి, మేఘల ముక్తా, పృథ్వీరాజ్, సుమన్, జీవా
సంగీతంఅజయ్ పట్నాయక్
ఛాయాగ్రహణంసాయి చరణ్
కూర్పుధర్మేంద్ర కాకరాల
నిర్మాణ సంస్థ
సింహ ఫిల్మ్స్
విడుదల
1 ఫిబ్రవరి 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

తనిష్క్ (తనిష్క్ రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా) తో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడతాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె పట్టించుకోదు. అదే సమయంలో చైత్ర కిడ్నాప్ కి గురౌతుంది. ఇంతకీ ఈ చైత్ర ఎవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేస్తారు, తనిష్క్ ఆమెను ఎలా కాపాడుతాడు అన్నది మిగతా కథ.[7]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కథ, దర్శకత్వం: శివ గణేష్
 • నిర్మాత: అనిల్ కుమార్ గుంట్రెడ్డి, త్రినాథ్ ధడాలా, కిషోర్, శ్రీకాంత్ దీపాల
 • సంగీతం: అజయ్ పట్నాయక్
 • సినిమాటోగ్రఫీ: సాయి చరణ్
 • కూర్పు: ధర్మేంద్ర కాకరల ఎడిట్ చేశారు
 • నిర్మాణసంస్థ: సింహా ఫిల్మ్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ (ఆర్. పి. పట్నాయక్ తమ్ముడు) సంగీతం అందించాడు. మ్యాంగో మ్యూజిక్ సంస్థ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[8] సుభాస్ నటయన్, గిరిధర్ నాయుడు పాటలు రాశారు.

క్రమసంఖ్య పాటపేరు గాయకులు రచయిత
1. తిక్కరేగిన గీతామాధురి గిరిధర్ నాయుడు
2. కుర్ర ఈడు శ్రీచరణ్ గిరిధర్ నాయుడు
3. ఎలా ఎలా ధనుంజయ్ భట్టాచార్య సుభాష్ నటయన్
4. ఆంధ్ర తెలంగాణ కెపిఎస్ఎస్ ఐశ్వర్య గిరిధర్ నాయుడు

విడుదలసవరించు

ఈ చిత్రం 2020, ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[9] ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.[10][11]

మూలాలుసవరించు

 1. "Sakalakala Vallabhudu completes shoot - Times of India". The Times of India. Retrieved 2020-12-05.
 2. "Sakala Kala Vallabhudu in Post Production Stagechitram_bhalare | chitram_bhalare". Chitram Bhalare. 2018-08-11. Archived from the original on 2018-09-09. Retrieved 2020-12-05.
 3. "గ్రామీణ నేపథ్యంలో..." Sakshi. 2017-12-27. Retrieved 2020-12-05.
 4. "Tanish Reddy set for a mass appeal | 123telugu.com". 123telugu.com. 2018-03-21. Retrieved 2020-12-05.
 5. "Sakalakala Vallabudu shooting start". www.cinemaguru123.com. Retrieved 2020-12-05.
 6. Cinemas, Telugu. "Sakala Kala Vallabhudu Shooting Started". www.telugucinemas.in. Retrieved 2020-12-05.
 7. BookMyShow. "Sakala Kala Vallabhudu Movie (2019)". BookMyShow. Retrieved 2020-12-06.
 8. "Tanishq Reddy is pretty confident about his 'Sakala Kala Vallabhudu'". www.raagalahari.com. Retrieved 2020-12-06.
 9. Manju (2019-01-29). "Sakalakala Vallabhudu Release Date February 1, 2019". actioncutok.com. Retrieved 2020-12-06.
 10. "Sakalakalavallabhudu Telugu Movie Review". 123telugu.com. 2019-02-01. Retrieved 2020-12-06.
 11. Codingest. "Review: Sakalakala Vallabhudu(Tanishq Reddy, Suman, Meghla)". NTV Telugu. Retrieved 2020-12-06.

ఇతర లంకెలుసవరించు