సత్యవాడ సోదరీమణులు

సత్యవాడ సోదరీమణులుగా ప్రసిద్ధి చెందిన సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి బహుముఖ ప్రజ్ఞావంతులు. జమీందారీ కుటుంబంలో పుట్టిన వీరు పుట్టుకతో అంధులు. ఈ జంట అనేక కథలను వ్రాసింది. కవితలను గేయాలను రచించి కవులుగా, పాటలు పాడి గాయనీమణులుగా ప్రసిద్ధి చెందారు ఈ సోదరీమణులు[1][2].

విశేషాలుసవరించు

స్కూలు చదువులు ఏమీ చదవక పోయినా, బ్రెయిలీ నేర్చుకునే అవకాశం రాకపోయినా, బయటి ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు లేకపోయినా ఈ సోదరీమణులు రేడియో వినడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకున్నారు. సంగీత సాహిత్యాలలో తమదైన ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిలో చిన్నవారైన సూర్యకుమారి వీణావాదనలో కూడా నిష్ణాతురాలు. వీరు సత్య సాహితి అనే సాహిత్యసంస్థను స్థాపించారు. శివరామ సంగీత శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

రచనలుసవరించు

వీరు 100కు పైగా కథలు వ్రాశారు. 5 కథాసంపుటాలను వెలువరించారు. వీరి తొలి కథ 1975 జూలై 16న ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యింది. వీరు అనేక సంగీత రూపకాలు, రేడియో నాటకాలు కూడా వ్రాశారు. అంధులైన ఈ జంట సొంతంగా రాయలేరు కనుక వీరు కథ చెబుతుంటే ఇతరులు సహకరించేవారు.

వీరు ప్రకటించిన పుస్తకాలు:

 1. ముత్యాలు నీళ్ళోసుకుంది (కథాసంపుటి)
 2. మాయనిపున్నమి (కథాసంపుటి)
 3. హరిప్రియ (కథాసంపుటి)
 4. మొక్కుబడి (కథాసంపుటి)
 5. సరస్వతీనమస్తుభ్యమ్‌ (కథాసంపుటి)
 6. రసమయి (గేయసంపుటి)

కథల జాబితాసవరించు

ఈ సోదరీమణుల కథలు యోజన, పుస్తకం, తెలుగుపలుకు, ఆంధ్రపభ, వనితాజ్యోతి, వనిత, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, కలువబాల, నవ్య, విశ్వరచన, మందాకిని, ఆంధ్రభూమి, ఉదయం, ప్రియదత్త, విపుల, విజయ, చతుర, తెలుగుజ్యోతి, ఆశ, సుజనరంజని తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

వీరు వ్రాసిన కథల పాక్షిక జాబితా[3]:

 1. అక్షింతలు
 2. అత్తలేని కోడలు
 3. అనుబంధం
 4. అన్నప్రాశన
 5. అపరంజి
 6. అమ్ములు పరికిణి
 7. అలసిపోయిన ఆశయం
 8. అవధాని ఆశయం
 9. ఆ కళ్లే వర్షిస్తే
 10. ఆకలి
 11. ఆదర్శం కోసం
 12. ఆనందాశ్రవులు
 13. ఉగ్గుగిన్నె
 14. ఉదయ
 15. ఏదీ స్త్రీ హృదయం
 16. ఓ యశోద కథ
 17. కాగితం పడవ
 18. కుంకుమ భరిణె
 19. కుట్టుమిషన్
 20. కోడలొచ్చింది
 21. గతుకుల బాట
 22. గోరంత గోరంతే
 23. జీవన
 24. జీవిత వీణ
 25. జీవిత సాఫల్యం
 26. జ్ఞానదాత
 27. డబ్బుచేదే
 28. తప్పుచేసిన దేవుడు
 29. తలకుమించిన బరువా
 30. దాంపత్య ప్రసూనం
 31. దీని మహిమ...
 32. దీపాల పండగ
 33. నా పేలేంతి
 34. నీలమ్మ
 35. పగడాలబేరు
 36. పటిక బెల్లం
 37. పతిదేవుడు
 38. పలకా-బలపం
 39. పాతచీర
 40. పాపాయి కావాలి
 41. పెంపుడుకుక్క
 42. పెళ్లంటే
 43. పొద్దుపొడుపు
 44. ప్రక్షాళన
 45. ప్రసాదుకి పెళ్ళికుదిరింది
 46. ప్రేమకానుక
 47. ప్రేమచిట్కా
 48. బంగారువీణ
 49. బదిలి
 50. బాల గోకులం
 51. భలేబామ్మ
 52. మంత్రాక్షతలు
 53. మనసు శిలకాదు
 54. మనసు-మమత
 55. మమతల పందిరి
 56. మల్లి నవ్వింది
 57. మాయనిపున్నమి
 58. ముగ్గురన్నల...
 59. ముచ్చటగా మూడేపువ్వులు
 60. ముత్యాలు నీళ్లోసుకుంది
 61. మూగరాగాలు
 62. మొక్కుబడి
 63. లంచ్ బాక్స్
 64. వీడని తోడు
 65. శాంతికోసం
 66. శృతి చేసినవీణ
 67. సరస్వతీ నమస్తుభ్యం
 68. సుకన్య
 69. సుమిత్ర
 70. సౌభాగ్యానికి సోపానాలు
 71. హనీమూన్
 72. హరప్రియ
 73. హరిప్రియ

నాటికలుసవరించు

 • చిగురు తొడగని వసంతం
 • అగ్గిపుల్ల
 • ప్రేమించు
 • ప్రేమకై
 • గుర్తింపు
 • పొగరుపచ్చ
 • వేపపూలు

గీతాలుసవరించు

గీతం సంగీతం గానం ఇతర వివరాలు
అనురాగపు వెన్నెలలు కురిపించే జాబిల్లి మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్ ఈ మాసపు పాట
కళకళలాడే వధూవరులకు కన్నుల హారతులియ్యండి సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
పసిడి రోకళ్ళు పట్టి పడతులందరూ పూని పసుపు దంచిరమ్మా సువ్వి పాటలు పాడి సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
వేదమాత దీవెనలంది చిరంజీవులై వర్ధిల్లాలి సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
శ్రీగౌరీదేవికి పూజించవే బాలా సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
సీతమ్మ పెళ్ళంటే కోటికోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు. సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
మా యింట పెళ్ళికి మీరంతా రండి మరపురాని వేడుకలు తిలకించండి సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
రారమ్మ రారమ్మ రమణీమణులారా సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్
ఎన్ని కళ్ళల్లో ఆనందాశ్రువుల ఝరి సత్యవాడ వేణుగోపాల్ ప్రతిమా శశిధర్

సత్కారాలుసవరించు

 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో వీరికి ఉగాది పురస్కారాన్ని అందజేసింది[4].
 • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని 2014 సంవత్సరానికి గాను "కథ" విభాగంలో కీర్తిపురస్కారాన్ని ప్రకటించింది[5].

మూలాలుసవరించు

 1. కథాకిరణాలు - పైడిమర్రి రామకృష్ణ - పుట119
 2. "JOURNEY AS METAPHOR: VOYAGING THE POETRY OF SELECTED INDIAN DISABLED POETS". మూలం నుండి 2015-04-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-04-04. Cite web requires |website= (help)
 3. కథానిలయంలో లభ్యమయ్యే సత్యవాడ సోదరీమణుల కథలు
 4. 41మందికి ఉగాది పురస్కారాలు
 5. 36 మందికి కీర్తి పురస్కారాలు