సమ్మోహనం
సమ్మోహనం 2018 జూన్ 15 న విడుదలైన తెలుగు సినిమా.[1][2]ఈ చిత్రానికి కథ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ.[3] ఇందులో సుధీర్ బాబు, అదితి రావు హైదరి, ముఖ్య పాత్రలు పోషించారు.
కథసవరించు
విజయ్‌కుమార్ (పోసాని సుధీర్ బాబు) ఓ చిత్రకారుడు. బాల సాహిత్య కళాకారుడిగా తన ప్రతిభని నిరూపించుకొనే ప్రయత్నంలో ఉంటాడు. తన కళ పిల్లల ఊహాశక్తిని పెంచుతుందని నమ్ముతుంటాడు. సినిమాలంటే ఇష్టం ఉండదు. కానీ, ఆయన తండ్రి (విజయ నరేష్)కి మాత్రం సినిమాలంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికైనా తనని తాను తెరపై చూసుకోవాలని తపన పడుతుంటాడు. ఇంతలోనే వాళ్ల ఇంటిని కుమ్మేస్తా చిత్రబృందం చిత్రీకరణ కోసమని ఇస్తాడు. ఆ చిత్ర బృందం ఆయనకు ఓ పాత్ర ఆశ చూపిస్తారు. ఆ సినిమాలో కథానాయిక సమీరా రాథోడ్ (అదితి రావు హైదరి). ఉత్తరాది నుంచి వచ్చిన ఆమెతో విజయ్‌కి స్నేహం ఏర్పడుతుంది. సినిమాలోని తెలుగు సంభాషణల్ని విజయ్ ద్వారా నేర్చుకుంటుంది సమీర. ఈ క్రమంలోనే విజయ్, సమీర ప్రేమలో పడతాడు. మనాలి లో చిత్రీకరణలో ఉన్న సమీర దగ్గరికి వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెబుతాడు. కానీ ఆమె తన మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెబుతుంది. నిరాశతో ఇంటికి వచ్చేస్తాడు విజయ్. కుమ్మేస్తా చిత్రం విజయవంతం అవుతుంది. కానీ అందులో విజయ్ తండ్రి నటించిన సన్నివేశాలు ఉండవు.[4]
తారాగణంసవరించు
- విజయ్ గా పోసాని సుధీర్ బాబు
- సమీరా రాథోడ్ గా అదితి రావు హైదరి
- విజయ నరేష్
- తనికెళ్ళ భరణి
- కాదంబరి కిరణ్
- హరితేజ
- పవిత్ర లోకేష్
- రాహుల్ రామకృష్ణ
- కేదార్ శంకర్
- శిర్ శర్మ
సాంకేతికవర్గంసవరించు
- ఛాయాగ్రహణం: పి.జి. వింద
- సంగీతం: వివేక్ సాగర్
- కళ: యస్. రవీందర్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి , రామజోగయ్య శాస్త్రి
- నిర్మాత - శివలెంక కృష్ణప్రసాద్
- రచన - దర్శకత్వం - ఇంద్రగంటి మోహన కృష్ణ
- నిర్మాణ సంస్థ - శ్రీదేవి మూవీస్
మూలాలుసవరించు
- ↑ "Sammohanam loosely based of "Notting Hill"". Deccan Chronicles (in ఇంగ్లీష్). 4 May 2018.
- ↑ https://www.firstpost.com/entertainment/sammohanam-director-mohana-krishna-indraganti-on-being-influenced-by-notting-hill-and-working-with-aditi-rao-hydari-4538351.html
- ↑ "Sudheer Babu's upcoming film titled 'Sammohanam'". Times of India (in ఇంగ్లీష్). 23 February 2018.
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/sammohanam/movieshow/63203422.cms