వికీపీడియా:దారిమార్పు

(సహాయం:దారిమార్పు నుండి దారిమార్పు చెందింది)

వికీపీడియాలో దారిమార్పు యొక్క ఆవశ్యకతను, అది ఎలా చెయ్యాలో ఈ వ్యాసం తెలియజేస్తుంది. ఈ వ్యాసం సహాయం పేజీలలో భాగం. దారిమార్పు అంటే కింద చూపిన పాఠ్యం తప్ప మరేమీ లేని ఓ పేజీ:

#దారిమార్పు [[పేజీపేరు]]

లేదా

#REDIRECT [[పేజీపేరు]]

ఏ పేజీకైతే వెళ్ళాలో ఆ పేజీయే, పేజీపేరు. ఉదాహరణకు "అల్లూరి సీతారామ రాజు" పేజీలో కింది పాఠ్యం తప్ప మరేమీ లేదు:

#దారిమార్పు [[అల్లూరి సీతారామరాజు]]

అల్లూరి సీతారామ రాజు పేజీకి వెళ్ళి చూస్తే పేజీ పేరుకు దిగువన ఓ చిన్న వాక్యం కనిపిస్తుంది -"(అల్లూరి సీతారామ రాజు నుండి దారిమార్పు చెందింది)" అని.

వికీపీడియాలో పేజీల పేర్లు వ్యాస విషయానికి అతి దగ్గరగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఒక విషయానికే మరిన్ని పేర్లు వాడుకలో ఉండవచ్చు. ఆ సందర్భాల్లో ఇతర పేర్లతో దారిమార్పు పేజీలు తయారు చేసి, అసలు పేజీకి గురి పెట్టాలి. వికీస్వరూపంలో విషయాల వర్గాలు నిర్వహించడానికి దారి మార్పు వర్గాలకు చేయకూడదు.

దారిమార్పు ఎలా చెయ్యాలి

మార్చు
 
దారిమార్పు పేజీ ఉదాహరణ

పేజీ (1) ని పేజీ (2) కు దారిమార్చాలంటే పేజీ 1 లో అన్నిటి కంటే పైన ఇలా రాయాలి:

#దారిమార్పు [[పేజీ2]]

ఉదాహరణకు, తెలంగాణా ను తెలంగాణ కు దారిమార్చడానికి తెలంగాణా దిద్దుబాటు పేజీకి వెళ్ళి అక్కడ ఇలా రాయాలి:

#దారిమార్పు [[తెలంగాణా]] 

దారిమార్పు, వ్యాసానికి మాత్రమే కాక వ్యాసంలోని విభాగాలకు కూడా చెయ్యవచ్చు. ఉదాహరణకు:

#దారిమార్పు [[తెలంగాణ#చరిత్ర]] 

అని ఇస్తే అది నేరుగా తెలంగాణ వ్యాసంలోని చరిత్ర విభాగానికి దారి తీస్తుంది.

దారిమార్పు లైను తరువాత ఏమైనా పాఠ్యాన్ని రాసినా, పేజీని భద్రపరిచాక అదంతా తీసివేయబడుతుంది. అదే లైనులో ఇంకా ఏదన్నా పాఠ్యం ఉంటే, అది తొలగించబడదు గానీ, మార్చు పేజీలో మాత్రమే అది కనిపిస్తుంది. దారిమార్పు ఎందుకు చేసామో అదే లైనులో రాస్తే, ఇతర వికీపీడియన్లకు తెలుస్తుంది.

దారిమార్పు ఎందుకు?

మార్చు
  • ఒకే వ్యాస విషయానికి వివిధ పేర్లు ఉన్నప్పుడు (ఉదా: ఎన్.టి.రామారావు, ఎన్టీ రాఅమారావు, ఎన్టీయార్)
  • ఒకే మాటను రెండు రకాలుగా పలుకుతున్నపుడు (ఉదా: కళ్ళు / కళ్లు, తాళ్ళరేవు, తాళ్లరేవు )
  • సాధారణంగా జరుగుతూ ఉండే తప్పులు (ఉదా: అల్లూరి సీతారామ రాజు, అల్లూరి సీతారామరాజు)
  • ఏదైనా పేజీని తరలించినపుడు బయటి సైట్ల నుండి ఆ పేజీకి వచ్చే లింకులు తెగిపోకుండా సదరు పేజీని చేరుకునేందుకు

దారిమార్పులు జరిగే వివిధ సందర్భాల పట్టిక ఇది:

కారణం ఉపయోగం వివరణ, కనపడే టెక్స్టు
పొడి పదాలు
రాయడంలో తప్పులు బాగా విస్తృతంగా తప్పు జరిగే సందర్భాల్లో మాత్రమే దారిమార్పు పేజీలు చెయ్యాలి.
వేరే పదాలు, వ్యాకరణ చిహ్నాలు
ఇతర పేర్లు, పెట్టుడుపేర్లు, ముద్దుపేర్లు, నానార్ధాలు
ఇతర భాషలు వికీపీడియా:Community Portal వికీపీడియా:సముదాయ పందిరి కి దారి తీస్తుంది.
యాసలు *Kurt Goedel and Kurt Godel redirect to Kurt Gödel
బహువచనాలు, కాలాలు, మొద..
సంబంధిత పదాలు
అయోమయాన్ని తొలగించేవి *America (disambiguation) redirects to America
* తెగిపోయిన లింకులను నివారించడం కింద చూడండి

పేరు మార్పులు, విలీనాలు

మార్చు

తెగిపోయిన లింకులు ఉండరాదు, చూసేవారికి చిరాకు తెప్పిస్తాయి. అంచేత, పేజీని తరలించినపుడో, రెండు వ్యాసాలను విలీనం చేసినపుడో పాతవ్యాసపు స్థానంలో కొత్తపేజీని సూచిస్తూ ఓ దారిమార్పు లింకును ఉంచుతాం. గతంలో సందర్శకులు, సెర్చి ఇంజన్లు ఆ పేజీలను ఆ పాత url లోనే చూస్తూ ఉండేవి. దారిమార్పు పేజీ లేకపోతే, ఇప్పుడు వారికి అక్కడ ఆ పేజీకి సంబంధించిన ఖాళీ దిద్దుబాటు పేజీ కనిపిస్తుంది.


దారిమార్పు పేజీ తొలగింపు

మార్చు

మామూలు పేజీల్లాగానే దారిమార్పు పేజీలను కూడా నిర్వాహకులు తొలగిస్తారు.

దారిమార్పుల గమ్యస్థాన పేజీల్లో ఏం చెయ్యాలి?

మార్చు

గమ్యస్థాన పేజీ, దారిమార్పు పేజీల పేర్లలో సంబంధం లేనంత తేడా ఉంటే చదువరి ఆశ్చర్యపోవచ్చు, తప్పు పేజీకి వచ్చినట్లు భావించవచ్చు. దీన్ని నివారించేందుకు, ఆ వ్యాసపు మొదటి పేరాలోనే దారిమార్పు పేజీకి ఈ పేజీకి ఉన్న సంబంధం గురించి వివరించాలి. గమ్యస్థాన పేజీలో పేరుకు దిగువన ఫలానా పేజీ నుండి దారి మార్పు చెంది వచ్చింది అని ఉంటుంది. అయినప్పటికీ పై సూచన పాటించితే సందిగ్ధతను నివారించవచ్చు.

స్వీయ లింకులు, డూప్లికేటు లింకులు

మార్చు

స్వీయలింకులను, దారిమార్పు స్వీయ లింకులను నివారించండి. అలాగే ఒకేచోటికి వెళ్ళేందుకు రెండు లింకులను వాడకండి. ఇందువలన పాఠకులు తికమక పడి, అనవసరంగా ఒకే పేజీని రెండుసార్లు లోడు చేసే అవకాశం ఉంది.

సంబంధిత విషయాలు

మార్చు