సహాయం:దస్త్రాలు

(సహాయం:Files నుండి దారిమార్పు చెందింది)

దస్త్రం పేరుబరి అనేది వికీపీడియా లోని మీడియా కంటెంట్ మొత్తం ఉండే నిర్వహణ పేజీలతో కూడుకుని ఉండే పేరుబరి. వికీపీడియాలో, మీడియా ఫైళ్ళ పేర్లన్నీ, బొమ్మలకు సంబంధించిన డేటా ఫైళ్ళు, వీడియో క్లిప్‌లు, ఆడియో క్లిప్‌లు, డాక్యుమెంట్ లెంగ్త్ క్లిప్‌లతో సహా, లేదా MIDI దస్త్రాలు (కంప్యూటర్లో మ్యూజిక్ సూచనల చిన్న దస్త్రం) దస్త్రం: అనే ఆదిపదంతో మొదలౌతాయి.

దస్త్రాల కోసం వెతకండి లేదా మీ స్వంత దస్త్రాన్ని ఎక్కించండి. (కింద ఉన్నదస్త్రాలను ఎక్కించడం చూడండి. ) వెతికినపుడు, వెతుకులాట పదాలు ఉన్న ప్రతి దస్త్రం పేజీని చూపిస్తుంది. వెతుకు పెట్టెలో దస్త్రం: వివరణాత్మక పదాలు నమోదు చేయండి. ఉదాహరణకు, వెతుకులాట పదాల్లో బొమ్మ, వీడియో, మిడి వంటి పదాలను కూడా చేర్చండి. అప్పుడు, పేజీ పేరును కనుగొనడం ద్వారా, సంబంధిత పేజీలో ఆ మీడియాను చొప్పించవచ్చు. వ్యాసాలను గణనీయంగా మెరుగుపరచడానికి ఇది సులభమైన మార్గం. (క్రింద ఉన్న దస్త్రాలను ఉపయోగించడం చూడండి.) ఉదాహరణకు, File: swim video కోసం వెతికినపుడు, ఫలితాల్లో "దస్త్రం:CI 2011 swim 04 jeh.theora.ogv" అనే పేజీ కనిపిస్తుంది.

మామూలు వికీలింకు సింటాక్స్‌తో పోలిస్తే దస్త్రాన్ని వాడేందుకు వాడే సింటాక్సులో అర్థం పరంగా మూడు తేడాలు ఉన్నాయి:

 • ఏదైనా పేజీలో దస్త్రం: PAGENAME అని రాస్తే, అది సదరు దస్త్రాన్ని ఆ పేజీలో ఫైల్ లింకులో ట్రాన్స్‌క్లూడు చేస్తుంది. ఫైల్ లింక్ అనేది దస్త్రం పేరుబరి నుండి, పూర్తి ట్రాన్స్‌క్లూజన్ పారామితులతో చేసే ట్రాన్స్‌క్లూజన్.
 • 'దస్త్రం:''' ''PAGENAME, ముందు కోలన్ ఉంటుంది. ఇది బొమ్మ, వీడియో, లేదా ఆడియో ల ఫైలు పేజీకి లింకు ఇస్తుంది;
 • [[మీడియా: PAGENAME]] నేరుగా బొమ్మను గానీ, ఆడియో, వీడియో ను గానీ నేరుగా చూపించే లింకును చూపిస్తుంది (ఇది ఫైలు పేజీ కంటే భిన్నం). ఆ లింకును నొక్కినపుడు సంబంధిత ఫైలు కనిపిస్తుంది -దస్త్రం వివరణ, లైసెన్సు వగైరా వివరాలేమీ లేకుండా.

గతంలో వాడుకలో ఉన్న పేరుబరి, చిత్రం: (ఇప్పుడు నిలిపేసారు) ను వాడిన పాత పేజీలతో అనుకూలత కోసం, అది ఇప్పటికీ పనిచేస్తుంది. అయితే "ఇమేజ్" అనేది ఇప్పుడు చిత్రాల తో పాటు మరిన్ని రకాల డేటా ఫైల్‌లను కూడా సూచిస్తుంది.

దస్త్రాలను ఎక్కించడం

మార్చు

బొమ్మలు తదితర మీడియా దస్త్రాలను ఉపయోగించడంలో మొదటి దశ అప్‌లోడ్ సర్వర్‌ని ఎంచుకోవడం . కొన్ని ఫైళ్ల కోసం తప్పనిసరిగా వికీపీడియా అప్‌లోడ్ సర్వర్‌ని ఉపయోగించాలి. చాలా దస్త్రాలను వికీమీడియా కామన్స్‌ లోని వికీమీడియా కామన్స్ అప్‌లోడ్ సర్వరు లోకి ఎక్కించవచ్చు. (కామన్స్ సముచిత ఉపయోగాన్ని అనుమతించదు. ఉచితం లభించని ఏదైనా బొమ్మ, నాన్-ఫ్రీ కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, దానిని తప్పనిసరిగా వికీపీడియా లోకే ఎక్కించాలి.) వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించిన దస్త్రాలన్నీ వికీపీడియాలో కనిపిస్తాయి. వాటిని ఎక్కడినుండైనా వెతకవచ్చు. ( ప్రత్యేక:దస్త్రాల జాబితా చూడండి. )

ఇష్టపడే ఫార్మాట్‌లు

 • బొమ్మలు: SVG, PNG, JPEG, XCF. GIF, TIFF ఆకృతులను కూడా గుర్తిస్తుంది. ఇతర ఆకృతులను కూడా గుర్తిస్తుంది.
 • ఆడియో: MIDI, FLAC, Speex, లేదా Vorbis కోడెక్‌లతో Ogg .
 • వీడియో: WebM, థియోరా వీడియో కోడెక్‌తో Ogg.

వికీపీడియా కోసం మీ దస్త్రం పేరును మార్చవలసి రావచ్చు: దస్త్రాలకు పేర్లు ఎలా పెట్టాలో కింద చూడండి. అలాగే, అనేక డిజిటల్ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, స్కానర్‌ల Exif ఫార్మాట్లలో వ్యక్తిగత మెటాడేటా ఇమిడ్చి ఉంటుందని, మీ మీడియా దస్త్రాలు తెలియని వ్యక్తుల చేతుల్లో పడితే, స్టెగానోగ్రఫీ ద్వారా చాటుమాటుగా వాటిలో సమాచారాన్ని పొందుపరచగలరని గమనించండి.

అధిక రిజల్యూషను కలిగిన బొమ్మలు, యానిమేటెడ్ .gif దస్త్రాలు పనితీరులో సమస్యను కలిగిస్తాయి. అయితే చిత్రం డౌన్‌లోడ్ సైజు పరిశీలనలో బ్యాండ్‌విడ్త్, పాఠకుల కంప్యూటింగ్ పవర్ పరంగా సమస్య వివరణను చూడవచ్చు. JPEG ఫోటోగ్రాఫ్‌ల కోసం, అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత, అత్యధిక రిజల్యూషన్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేయండి; అవసరాన్ని బట్టి ఇవి ఆటోమాటిగ్గా తక్కువ-రిజల్యూషన్ థంబ్‌నెయిల్‌లకు తగ్గించబడతాయి.

దస్త్రాన్ని ఎక్కించిన తర్వాత, దాని ఫైల్ పేజీలో చిత్ర నాణ్యతను, అక్కడున్న వివరణనూ చూడండి. వెతుకులాట ఫలితంలో సరైన ఇండెక్సింగ్ కోసం దాని వివరణలో కీలక పదాలు ఎలా సహాయపడతున్నాయో పరిశీలించి ధృవీకరించుకోండి. వికీపీడియా, కామన్స్ రెండింటిలోనూ ఒకే పేరుతో దస్త్రాలు ఉంటే, వికీపీడియా దస్త్రాన్నే చూపిస్తుంది.

వినియోగంపై ఏవైనా పరిమితులకు లోబడి ఉన్న దస్త్రాలను (యాట్రిబ్యూషన్ లేదా కాపీలెఫ్ట్ మినహా), "వికీపీడియాలో ఉపయోగం కోసం మాత్రమే" లేదా "వాణిజ్యేతర ఉపయోగం కోసం మాత్రమే" వంటి దస్త్రాలను, తగినంత ఉచితం కాని దస్త్రాలనూ వికీమీడియా కామన్స్ లోకి గాని, వికీపీడియా లోకి గానీ ఎక్కించడానికి వీలు లేదు. ఒకవేళ చిత్రం ఉచితం కాని కంటెంట్ అయితే, తక్కువ రిజల్యూషన్ ఉన్న ఫైల్‌లను ఉపయోగించండి, తద్వారా వినియోగం సాధ్యమైనంత తక్కువగా ఉంటుంది.

దస్త్రాలను ఉపయోగించడం

మార్చు

ఇప్పటికే ఉన్న అనేక బొమ్మల దస్త్రాలలో ఒకదాని కోసం వెతకండి. లేదా మీరే ఒక బొమ్మను ఎక్కించండి. ఆ దస్త్రపు పేజీ పేరు తెలుసుకొని, ఆ పేజీని సవరించవచ్చు, ఆ పేరును వికీటెక్స్ట్‌లోకి చొప్పించవచ్చు. మీరు దిద్దుబాటు చేస్తున్న పేజీలో బొమ్మ పేజీ పేరుకు వికీలింకు ఇస్తారు. దాంతో ఆ దస్త్రం పేజీ లోకి చేరుతుంది. ఉదాహరణకు దస్త్రం:Wikipedesketch.png తీసుకోండి. కిందివాటిని ఒకే వరుసలో ఉపయోగించండి (లైన్ బ్రేక్‌లు లేకుండా). అప్పుడు ఫలితాలు కుడివైపున ఉన్న చిత్రంలో చూపిన విధంగా ఉంటాయి:

thumb|alt= సెంటీపీడ్ కార్టూను... విస్తృతమైన వివరణ.|''[[మైరియాపోడా]]'' లో దిద్దుబాటు చేస్తున్న వికీపీడ్.
 
మైరియాపోడాలో దిద్దుబాటు చేస్తున్న వికీపీడ్

పైలింకులో కింది "ఫీల్డ్‌లు" ఉన్నాయి:

 1. పేజీ పేరు, "దస్త్రం:Wikipedesketch.png "
 2. "thumb", చిత్రాలను పాఠకుల డిఫాల్ట్ పరిమాణం (మీ స్వంత సూక్ష్మచిత్ర పరిమాణాలను పేర్కొనడానికి సహాయం:అభిరుచులు చూడండి. )
 3. "ఏడు చేతులున్న ఒక కార్టూన్ బహుపాది, ఒక పుస్తకాన్ని చదువుతోంది, మరొకదాన్ని పైకెత్తింది, ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తోంది, సీసాను పట్టుకుంది" అనే ఆల్ట్ టెక్స్ట్ ఉండొచ్చు. ఈ ఆల్ట్ టెక్స్ట్ దృష్టి లోపం ఉన్న పాఠకులకు లేదా చిత్రాలను ప్రదర్శించని బ్రౌజర్‌లు లేదా కంప్యూటర్లు ఉన్న వారి కోసం ఉద్దేశించబడింది. ఇది ఆ చిత్రం యొక్క సారాంశాన్ని వివరంగా వివరించాలి
 4. వ్యాఖ్య, " మైరియాపోడాలో దిద్దుబాటు చేస్తున్న వికీపీడ్ ." ఇది బొమ్మను చూస్తున్న వారి కోసం ఉద్దేశించబడింది. చిత్రంలో కనిపించే అంశాలకు అర్థాన్ని వివరిస్తుంది.

పాఠ్యం, వ్యాఖ్యల్లో చిన్న వచనం ఉండాలి. వ్యాసాన్ని చదివేవారు సంబంధిత దస్త్రం పేజీకి వెళ్లడానికి క్రింద ఉన్న థంబ్‌నెయిల్‌పై గాని లేదా చిన్న డబుల్ దీర్ఘచతురస్ర చిహ్నంపై   గానీ నొక్కవచ్చు

డిఫాల్ట్‌గా, పేజీ లేఅవుట్ బొమ్మలను పేజీలోని వికీటెక్స్ట్ కు కుడి వైపున, లింకును ఉంచిన చోటుకు ఒక పంక్తి దిగువన ఉంచుతుంది. విస్తరించిన చిత్ర సింటాక్స్, బొమ్మను ఎలా ప్రదర్శించాలో నియంత్రించే ఎంపికలను చూపిస్తుంది. బొమ్మను ఎడమ వైపున "ఫ్లోట్" చేయవచ్చు లేదా మధ్యలో ఉంచవచ్చు లేదా దాని చుట్టూ పాఠ్యం ప్రవహించకుండా చేయవచ్చు. దాని పరిమాణాన్ని మార్చవచ్చు (వాడుకరి సెట్ చేసుకున్న డిఫాల్ట్‌కు భిన్నంగా ఉండేలా), లేదా పనోరామాలో రీడర్ చుట్టూ తిప్పుకుంటూ చూడడానికి వీలు కలిగించవచ్చు. పేజీలో బొమ్మలు ఒకేచోట పేరుకుపోకుండా అనేక విధాలుగా నివారించవచ్చు. ఉదాహరణకు, ఒకదాన్ని ఎడమ వైపున, తరువాతి దాన్ని కుడి వైపునా ఉండేలా మార్చవచ్చు. బలవంతంగా బ్రేక్‌ను చొప్పించవచ్చు. పట్టిక సింటాక్సును ఉపయోగించి, బొమ్మలను ఒకచోట కుదురుగా పెట్టవచ్చు. లేదా గ్యాలరీ ట్యాగ్‌ని వాడి ( {{Gallery}} చూడండి) ఒక వరుసలో పేర్చిన చిత్రాల గ్యాలరీని సృష్టించవచ్చు. (గ్యాలరీ ట్యాగ్‌లు ఆల్ట్ టెక్స్ట్‌కు మద్దతు ఇవ్వవు, కాబట్టి అవి చిత్రాలను చూడలేని పాఠకులకు అందుబాటులో ఉండవు) అలాగే, వ్యాఖ్యలు లేని సాధారణ చిత్రాలను సృష్టించవచ్చు. పాఠ్యం తోటి, ఇతర చిత్రాల తోటీ కలపవచ్చు; సరిహద్దులు, టెక్స్ట్‌తో నిలువుగా అమర్చడం, లింకులపై నియంత్రణతో సహా మరింత సూక్ష్మమైన సాంకేతికతలను ఉపయోగించవచ్చు. చిత్రాన్ని ప్రదర్శించకుండా దానికి లింకు మాత్రమే ఇవ్వవచ్చు.

ఈ పద్ధతులన్నింటి ఉదాహరణల కోసం, బొమ్మ పాఠాన్ని చూడండి.

దస్త్రాలకు పేరు పెట్టడం

మార్చు

దస్త్రాల పేర్లు చాలా పొడవుగా ఉండకుండా స్పష్టంగా, వివరణాత్మకంగా ఉండాలి. చిత్రం పేరుతో పాఠకులకు పెద్దగా పట్టింపు లేనప్పటికీ (వారు బొమ్మ వివరణ పేజీని చూడాలంటే చిత్రంపై నొక్కితే సరిపోతుంది.), దిద్దుబాటు చేసే వాడుకరులకు ఇది చాలా ముఖ్యమైనది. బొమ్మలకు వివరణాత్మకమైన లేదా కనీసం చదవగలిగే పేర్లు ఉన్నట్లయితే ఇది తోటి వాడుకరులకు, విజ్ఞానసర్వస్వ నిర్వహణకూ సహాయపడుతుంది. ఉదాహరణకు, దస్త్రం:Skyline Frankfurt am Main.jpg అనే పేరు దస్త్రం:14004096 200703230833355477800.jpg కంటే మెరుగైనది, తేలిగ్గా నిర్వహించగలిగినదీను.

బొమ్మలను, ఇతర మాధ్యమాలనూ అనుకోకుండా ఓవర్‌రైటింగు చెయ్యకుండా నివారించడానికి, అప్‌లోడ్ చేస్తున్నప్పుడు సాధారణ దస్త్రం పేర్లను ఉపయోగించకూడదు. ఉదాహరణకు, ఆల్బమ్ కవర్ చిత్రానికి దస్త్రం:Cover.jpg అనే పేరు ఇవ్వకూడదు. అదే పేరును వాడి మరొకరు మరో బొమ్మను ఎక్కించే అవకాశం చాలా ఎక్కువ. అది పాత చిత్రాన్ని ఓవర్‌రైట్ చేయవచ్చు. ఇక ఆ తరువాత ఆ పాత బొమ్మను వాడిన ప్రతీచోటా ఈ కొత్త బొమ్మే కనిపిస్తుంది - వ్యాసాల్లో తప్పుడు ఆల్బమ్ కవర్‌ని చూపుతుంది. దస్త్రం:Sabaton The Last Stand cover.jpg అని వివరమైన పేరు పెడితే మెరుగ్గా ఉంటుంది.

దస్త్రాల పేరు మార్చడం

మార్చు

దస్త్రం పేజీ పేరు మార్చడం అనేది ఇతర రకాల పేజీల పేరు మార్చడం కంటే భిన్నంగా ఉంటుంది. దస్త్రం పేజీ యొక్క పేజీ పేరును ఫైల్ మూవర్ ద్వారానే మార్చవచ్చు. ఫైల్ మూవర్ అనేది వినియోగదారుకు ఇచ్చే ప్రత్యేక హక్కు. మీకు ఫైల్ మూవర్ హక్కులు లేని పక్షంలో, పేజీ పేరు మార్చాలంటే ఆ అనుమతి కోసం అభ్యర్థన చేయాలి.

పేజీలో ఎక్కడైనా వికీటెక్స్ట్ ఫైల్ పేజీలో క్రింది టెంప్లేట్‌ను చేర్చి, పేజీ పేరు మార్చడానికి అభ్యర్థించవచ్చు:

{{Rename media|new filename|reason for name change}}

ఇది ఫైల్ పేజీని వర్గం:పేరు మార్చాల్సిన వికీపీడియా దస్త్రాలు వర్గంలో చేరతాయి. ఆ విధంగా ఫైల్ మూవర్లు దానిని గమనించవచ్చు.

దస్త్రం పేరు మార్చడానికి అత్యంత సాధారణ, ఆమోదించబడిన కారణాలు:

 • ఎక్కించినవారి అభ్యర్థన
 • అర్థం లేని శీర్షిక నుండి వివరణాత్మక శీర్షికకు మార్చడం
 • తప్పుదారి పట్టించే పేరు నుండి కచ్చితమైన పేరుకి మార్చడం
 • అక్షరదోషాలు లేదా తప్పుడు చారిత్రక తేదీని సూచించడం వంటి ముఖ్యమైన లోపాలను సరిదిద్దడం
 • సంబంధిత పేర్లతో దస్త్రాల పేర్లను సమన్వయం చేయడం
 • చాలా సారూప్యమైన పేర్లున్న దస్త్రాలతో ఏర్పడే అయోమయాన్ని నివృత్తి చెయ్యడం
 • అవమానించే, హానికరమైన, ముతక భాషను తొలగించడం

పేరు మార్చడానికి గల కారణానికి బొద్దుగా చూపించిన పదాలు చాలు.

దస్త్రాలను వెతకడం

మార్చు

దస్త్రాలను వెతకడానికి దిగువన ఉన్న ప్రత్యేక:అన్వేషణ పెట్టెను ఉపయోగించవచ్చు. మరింత సమాచారం కోసం సహాయం:వెతుకుట చూడండి.

ఇవి కూడా చూడండి

మార్చు