ఛలో ప్రేమిద్దాం

ఛలో ప్రేమిద్దాం 2021లో విడుదలైన తెలుగు సినిమా. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ బ్యానర్ పై ఉద‌య్ కిర‌ణ్‌ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ శేఖ‌ర్ రేపల్లే దర్శకత్వం వహించాడు.[1] సాయి రోన‌క్‌, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 19 నవంబర్‌ 2021న విడుదలైంది.[2]

ఛలో ప్రేమిద్దాం
Chalo Premiddam.jpg
దర్శకత్వంసురేష్ శేఖ‌ర్ రేపల్లే
నిర్మాతఉద‌య్ కిర‌ణ్‌
నటవర్గంసాయి రోన‌క్‌
నేహా సోలంకీ
పొసాని కృష్ణమురళి
హేమ
ఛాయాగ్రహణంఅజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి
కూర్పుఉపేంద్ర జ‌క్క‌
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్
విడుదల తేదీలు
19 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

ఆత్మారావు (సాయి రోనక్) ఇంట్లో తండ్రి (పోసాని కృష్ణమురళి) నస భరించలేక ఉన్నత విద్య కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి అదే కాలేజ్ లో చదివే మధుమతి (నేహా సోలంకి)తో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. చిత్తూరులో మధు అక్క పెళ్ళికి ఉన్న కారణంగా అక్కడికి వెళ్లిన ఆమె తన మామయ్య పెద్దప్ప (నాగినీడు), సోదరుడు శివుడు ( శశాంక్ )లకు తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటుంది. ఈ పెళ్ళికి మధు ఆత్మారావు (సాయి రోనక్) తో పాటు తన స్నేహితులను ఆహ్వానిస్తుంది. ఈ పెళ్లి జరిగాకా మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. దాంతో అనుమానంతో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్‌ చేసిందేవరు? ఈ కేసులో ఆత్మరావును ఎందుకు అరెస్ట్‌ చేశారు? చివరికి ఆత్మారావు మధుమతి ప్రేమలో ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్
 • నిర్మాత: ఉద‌య్ కిర‌ణ్‌ [5]
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ శేఖ‌ర్ రేపల్లే
 • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
 • సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి
 • ఎడిటింగ్: ఉపేంద్ర జ‌క్క‌
 • పాట‌లు: సురేష్ గంగుల‌, దేవ్‌,
 • ఆర్ట్ డైర‌క్ట‌ర్: రామాంజ‌నేయులు
 • ఫైట్స్: న‌భా, సుబ్బు
 • కొరియోగ్ర‌ఫీ: వెంక‌ట్ దీప్‌

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (24 October 2021). "ఛలో ప్రేమిద్దాం." Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
 2. Prajasakti (17 November 2021). "క్యూట్ ల‌వ్ స్టోరీతో ఛ‌లో ప్రేమిద్దాం". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
 3. Sakshi (19 November 2021). "'ఛలో ప్రేమిద్దాం' మూవీ రివ్యూ". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
 4. 10TV (19 November 2021). "ఛలో ప్రేమిద్దాం రివ్యూ" (in telugu). Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 5. Eenadu (14 November 2021). "మంచి ప్రేమకథ". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.