సింధుదుర్గ్ (మరాఠి:सिंधुदूर्ग ) మహారాష్ట్ర రాష్ట్రములోని జిల్లా యొక్క ముఖ్యపట్టణం. సింధుదుర్గ్ జిల్లాను రత్నగిరి జిల్లానుండి ఏర్పరచారు. సింధుదుర్గ్ మహారాష్ట్రలో అత్యంత దక్షిణాదిన ఉన్న జిల్లా. ఈ జిల్లా యొక్క ముఖ్యపట్టణం ఓరోస్. ఈ జిల్లా యొక్క విస్తీర్ణము 5207 చదరపు కిలోమీటర్లు, జనాభా 8,68,825. జనాభాలోని 9.47% శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (2001 జనాభా లెక్కలు) [1] జిల్లాలో అక్షరాస్యత 80%.

  ?సింధుదుర్గ్
మహారాష్ట్ర • భారతదేశం
మహారాష్ట్ర పటంలో సింధుదుర్గ్ స్థానం
మహారాష్ట్ర పటంలో సింధుదుర్గ్ స్థానం
మహారాష్ట్ర పటంలో సింధుదుర్గ్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°07′12″N 73°42′23″E / 16.11993°N 73.706286°E / 16.11993; 73.706286
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 5,207 కి.మీ² (2,010 sq mi)
జనాభా
జనసాంద్రత
8,68,825[1] (2001 నాటికి)
• 167/కి.మీ² (433/చ.మై)
అధికార భాష మరాఠి, హిందీ

జిల్లాలోని మాల్వన్ పట్టణానికి సమీపాన, సముద్రములో ఒక రాతిమయమైన తిప్పపై ఉన్న సింధుదుర్గ్ కోట పేరుమీదుగా జిల్లాకు ఆ పేరు వచ్చింది. సింధుదుర్గ్ జిల్లాకు ఉత్తరాన రత్నగిరి జిల్లా, దక్షిణాన గోవా రాష్ట్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి శ్రేణులకు ఆవల కొల్హాపూర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. సింధుదుర్గ్ పశ్చిమ మహారాష్ట్రలో పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యన ఒక సన్నని పట్టీలా ఉండే కొంకణ్ ప్రాంతంలోని భాగం

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు