పడమటి కనుమలు

(పశ్చిమ కనుమలు నుండి దారిమార్పు చెందింది)

పడమటి కనుమలు భారతదేశపు పశ్చిమ తీరానికి సమాంతరంగా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి.[1] వీటినే సహ్యాద్రి పర్వతశ్రేణులు అని కూడా పిలుస్తారు. 1,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పర్వత శ్రేణి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. జీవ వైవిధ్యానికి సంబంధించి, ప్రపంచంలోని ఎనిమిది ప్రధానకేంద్రాల్లో ఇది ఒకటి.[2][3] దీనిని కొన్నిసార్లు గ్రేట్ ఎస్కార్ప్మెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.[4] దేశంలోని వృక్షజాలం, జంతుజాలాల్లో చాలా భాగం ఇక్కడ ఉంది. వీటిలో చాలా జాతులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి.[5] యునెస్కో ప్రకారం, పడమటి కనుమలు హిమాలయాల కంటే పాతవి. వేసవి చివరలో నైరుతి దిశలో వచ్చే వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాలను అడ్డగించడం ద్వారా ఇవి భారతీయ రుతుపవన వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి.[1] ఈ శ్రేణి దక్కన్ పీఠభూమి పశ్చిమ అంచున ఉత్తరం నుండి దక్షిణానికి వెళుతుంది. అరేబియా సముద్ర తీరం వెంట సమాంతరంగా వ్యాపించి, సన్నటి తీర మైదానాన్ని, దక్కను పీఠభూమినీ వేరు చేస్తాయి. ఈ తీరమైదాన ప్రాంతాన్ని కొంకణ్ అని అంటారు. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ అడవులతో సహా పడమటి కనుమలలో మొత్తం ముప్పై తొమ్మిది ప్రాంతాలను 2012 లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. ఈ ప్రదేశాలు కేరళలో ఇరవై, కర్ణాటకలో పది, తమిళనాడులో ఐదు, మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి.[1][6]

పడమటి కనుమలు
కేరళ లో అనముడి కొండ, హిమాలయాల తర్వాత అత్యంత ఎత్తుగలది
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంAnamudi, Eravikulam National Park
ఎత్తు2,695 m (8,842 ft)
నిర్దేశాంకాలు10°10′N 77°04′E / 10.167°N 77.067°E / 10.167; 77.067
కొలతలు
పొడవు1,600 km (990 mi) N–S
వెడల్పు100 km (62 mi) E–W
విస్తీర్ణం160,000 km2 (62,000 sq mi)
భౌగోళికం
The Western Ghats lie roughly parallel to the west coast of India.
దేశంభారతదేశం
StatesGujarat, Maharashtra, Goa, Karnataka, Kerala and Tamil Nadu
RegionWestern and Southern India
Settlements
BiomeTropical rainforests and Marshes
Geology
Age of rockCenozoic
Type of rockBasalt, Laterite and Limestone
UNESCO World Heritage Site
CriteriaNatural: ix, x
సూచనలు1342
శాసనం2012 (36th సెషన్ )
ప్రాంతం795,315 ha
పడమటి కనుమలు, భారత భౌగోళికం.

వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగా, పీఠభూమి వైపు ఎక్కువ వాలుతో ఉంటాయి. ఈ కనుమల ద్వారానే దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానాలకు రోడ్డు, రైలు మార్గాలను వేశారు.

ఈ శ్రేణి తపతీ నదికి దక్షిణంగా గుజరాత్ లోని సోంగాధ్ పట్టణం సమీపంలో ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా సుమారు 1,600 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. భారతదేశం యొక్క దక్షిణ కొసన, తమిళనాడులో స్వామితోప్ వద్ద మరుంతువజ్‌మలై వద్ద ముగుస్తాయి. ఈ కొండలు 1,60,000 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 40% పరీవాహకప్రాంతాన్ని కవర్ చేసే నదులు పడమటి కనుమల్లోనే పుడుతున్నాయి. పడమటి కనుమలు నైరుతి రుతుపవనాల గాలులను దక్కన్ పీఠభూమికి రాకుండా నిరోధిస్తాయి. వీటి సగటు ఎత్తు 1,200 మీటర్లు.[1]

ఈ ప్రాంతం ప్రపంచంలోని పది "హాటెస్ట్ బయోడైవర్శిటీ హాట్‌స్పాట్లలో " ఒకటి. పడమటి కనుమల్లో 7,402 జాతుల పుష్పించే మొక్కలు, 1,814 జాతుల పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 290 మంచినీటి చేప జాతులూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొనని అనేక జాతులు పడమటి కనుమలలో ఉండవచ్చని భావిస్తున్నారు. పడమటి కనుమలలో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.[7][8][9]

జియాలజీ మార్చు

15 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా సూపర్ ఖండం విడిపోయిన సమయంలో అవి ఏర్పడ్డాయని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.10 నుండి 8 కోట్ల సంవత్సరాల క్రితాల ప్రాంతంలో, మడగాస్కర్ నుండి విడిపోయిన తరువాత, భారతదేశపు పశ్చిమ తీరం ఉనికిలోకి వచ్చిందని భూభౌతిక ఆధారాలు సూచిస్తున్నాయి. విడిపోయిన తరువాత, భారతదేశపు పశ్చిమ తీరం 1,000 మీటర్ల ఎత్తైన కొండగా కనిపిస్తుంది.[10] కొండలలో కనిపించే ప్రధాన శిల బసాల్ట్. ఇది 3 కిలోమీటర్ల మందాన ఉంటుంది. ఇతర రాతి రకాలు: చార్నోకైట్స్, గ్రానైట్ నీస్, ఖోండలైట్స్, లెప్టీనైట్స్, మెటామార్ఫిక్ నీస్‌లు, సున్నపురాయి, ఇనుప ఖనిజం, డోలరైట్స్, ఆంత్రసైట్స్. దక్షిణ కొండలలో అవశేష లాటరైట్, బాక్సైట్ ఖనిజాలు కూడా కనిపిస్తాయి.

భౌగోళికం మార్చు

 
స్థలాకృతి: పడమటి కనుమలు (దక్షిణ భాగం)

పడమటి కనుమలు ఉత్తరాన సాత్పురా శ్రేణి వద్ద మొదలై, గుజరాత్ నుండి తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక,కేరళ రాష్ట్రాల గుండా విస్తరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక విభాగాల మధ్య గోవా గ్యాప్, నీలగిరి కొండలు, అణ్ణామలై కొండల మధ్య తమిళనాడు కేరళ సరిహద్దులోని పాల్ఘాట్ గ్యాప్ ఈ శ్రేణిలో ప్రధాన అంతరాలు. పడమటి కనుమలు వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాల గాలులను అడ్డుకుంటాయి. తత్ఫలితంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా కనుమలకు పశ్చిమాన, అధిక వర్షపాతం ఉంటుంది. దట్టమైన అడవులు కూడా అధిక వర్షపాతానికి దోహదం చేస్తున్నాయి.

పడమటి కనుమలు, అరేబియా సముద్రాల మధ్య సన్నని తీర మైదానం ఉంది. దీని ఉత్తర భాగాన్ని కొంకణ్ అని పిలుస్తారు. మధ్య భాగాన్ని కానరా అని, దక్షిణ భాగాన్ని మలబార్ అనీ పిలుస్తారు. మహారాష్ట్రలో ఘాట్స్‌కు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాన్ని దేశ్ అని పిలుస్తారు, మధ్య కర్ణాటకలో కనుమలకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలను మలేనాడు అని పిలుస్తారు.[1] ఈ శ్రేణిని మహారాష్ట్ర, కర్ణాటకల్లో సహ్యాద్రి అని పిలుస్తారు. తమిళనాడులోని నీలగిరి పర్వతాల వద్ద పడమటి కనుమలు తూర్పు కనుమలు కలుస్తాయి. నీలగిరి కొండలు ఆగ్నేయ కర్ణాటకలోని బిలిగిరిరంగ కొండలను షెవరోయ్‌లతో, తిరుమల కొండలతో కలుపుతాయి. పాల్ఘాట్ గ్యాప్‌కు దక్షిణాన పశ్చిమ తమిళనాడు, కేరళల్లో అణ్ణామలై కొండలున్నాయి. మరింత దక్షిణానికి చిన్న శ్రేణులతో ఉన్న, ఏలకుల కొండలు (కార్డమమ్ హిల్స్), ఆ తరువాత కన్యాకుమారి సమీపంలో ఆర్యన్‌కావు కనుమ దారి, అరల్వైమోజి కనుమదారి ఉన్నాయి. ఈ శ్రేణిని కేరళలో సహ్యాన్ లేదా సాహియాన్ అని పిలుస్తారు.

శిఖరాలు మార్చు

శ్రేణి యొక్క దక్షిణ భాగంలో ఉన్న అనైముడి (2,695 మీ ఎత్తు) పడమటి కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం.

జలాశయాలు మార్చు

 
అనేక జలపాతాలను చూపించే వరంధ పాస్ మహాద్ నుండి చూడండి

పడమటి కనుమలు భారతదేశంలోని నాలుగు వాటర్‌షెడ్‌లలో ఒకటి. ఇది భారతదేశంలోని శాశ్వత నదులకు ఆహారం ఇస్తుంది. పడమటి కనుమలలో ఉద్భవించిన ప్రధాన నదీ వ్యవస్థలు గోదావరి, కావేరి, కృష్ణ, తమీరపారాణి, తుంగభద్ర నదులు. పడమటి కనుమలలో ప్రవహించే ప్రవాహాలలో ఎక్కువ భాగం ఈ నదులలో కలుస్తాయి. వర్షాకాలంలో పెద్ద మొత్తంలో నీటిని తీసుకువెళతాయి. ఈ నదులు భూమి వాలు కారణంగా తూర్పుకు ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. ప్రధాన ఉపనదులలో భద్ర, భవానీ, భీమా, మలప్రభ, ఘటప్రభ, హేమవతి, కబిని నదులు ఉన్నాయి. పెరియార్, భరతపుళ, పంబా, నేత్రావతి, శరావతి, కాళి, మాండవి, జువారి నదులు పడమటి కనుమల నుండి పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. వాలు ఎక్కువగా ఉన్నందువలన ఇవి చాలా వేగంగా ప్రవహిస్తాయి.

 
భారతదేశంలోని అత్యంత అద్భుతమైన జలపాతాలలో ఒకటైన కర్ణాటకలోని జోగ్ ఫాల్స్

జలవిద్యుత్, నీటిపారుదల అవసరాల కోసం నదులపై ఆనకట్టలు కట్టారు. ఆ విధంగా వివిధ రాష్ట్రాలలో జలాశయాలు ఏర్పడ్డాయి. రెయిన్బో ట్రౌట్, మహాసీర్, కామన్ కార్ప్ వంటి క్రీడా మత్స్యకారులకు ఈ జలాశయాలు నెలవు.[1] పడమటి కనుమల పొడవునా సుమారు 50 ప్రధాన ఆనకట్టలు ఉన్నాయి.[1] ఈ ప్రాజెక్టులలో ప్రముఖమైనవి మహారాష్ట్ర లోని కొయినా, కర్నాటక లోని లింగన్‌మక్కి, శివనసముద్రం, తమిళనాడులోని మెట్టూరు, కేరళలో పైకారా, పరంబికుళం, మలంపుజా, ఇడుక్కి.[1][11][12]

 
బాణాసుర సాగర్ ఆనకట్ట

వర్షాకాలంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రవాహాలు పర్వతాలపై నుండి ప్రవహిస్తూ అనేక జలపాతాలకు దారితీస్తాయి. దూద్ సాగర్, ఉంచలి, సతోడి, మగోడ్, హోగెనక్కల్, జోగ్, కుంచికల్, శివనసముద్రం, మీన్ముట్టి జలపాతాలు, అతిరాపల్లి జలపాతంలో ప్రధానమైన జలపాతాలు. తలకావేరి, కావేరి నది జన్మస్థానం. కుద్రేముఖ్ తుంగభద్రకు మూలం. పడమటి కనుమల్లో అనేక మానవ నిర్మిత సరస్సులు, జలాశయాలూ ఉన్నాయి. ఊటీలో నీలగిరి (84 ఎకరాలు), కొడైకెనాల్ (64 ఎకరాలు), పళని హిల్స్ లో బెరిజాం, కేరళలోని వైనాడ్‌లో పూకోడే సరస్సు, కర్లాద్ సరస్సులు, ఇడుక్కిలో వాగమోన్ సరస్సు, దేవికులం (15 ఎకరాలు), లేచ్మి (4.9 ఎకరాలు) వీటిలో ప్రధనమైనవి.

 
పూకోడ్ సరస్సు నుండి చెంబ్రా శిఖరం

శీతోష్ణస్థితి మార్చు

 
పడమటి కనుమ ప్రాంతంలో వార్షిక వర్షపాతం

కర్ణాటక లోని ఆగుంబె, హుళికళ్, అమగావ్ లు, మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్, తంహినిలు ఉన్న ప్రాంతాన్ని "నైరుతి భారతదేశపు చిరపుంజి " అనీ, "నైరుతి భారతదేశపు వర్ష రాజధాని" అనీ పేర్కొంటారు. ఉడిపి జిల్లాలోని కొల్లూరు, సిర్సి లోని కొక్కలి, నీల్కుండ్, ముదిగెరే లోని సంసే, ఎర్నాకులం జిల్లా లోని నెరియమంగళాలు పడమటి కనుమలలోని అత్యంత ఎక్కువ వర్షపాతం ఉండే ప్రదేశాలు. మధ్యలో ఖాళీలు లేకుండా నిరాఘాతంగా ఉన్న పర్వతాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ అవపాతం సంభవిస్తుంది. గాలి దిశ, వేగంలో మార్పులు సగటు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశాలు మారవచ్చు. అయితే, మహారాష్ట్ర లోని, కర్ణాటకలోని పడమటి కనుమల ఉత్తర భాగంలో సగటున కేరళ కంటే, కర్ణాటకలోని దక్షిణ భాగం కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది.

పడమటి కనుమలలో ఎత్తును బట్టి, భూమధ్యరేఖ నుండి దూరాన్ని బట్టీ శీతోష్ణస్థితి మారుతుంది. శీతోష్ణస్థితి తేమగా, పల్లపు ప్రాంతాలలో సముద్రపు సామీప్యత కారణంగా ఉష్ణమండలం లాగా ఉంటుంది. ఉత్తరాన 1,500 మీ. కంటే ఎత్తున, దక్షిణాన 2,000 మీ. కంటే ఎత్తునా సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. సగటు వార్షిక ఉష్ణోగ్రత 15 °C (59 °F) ఉంటుంది. కొన్ని భాగాలలో మంచు కురవడం మామూలు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థానానికి చేరుతాయి. సగటు ఉష్ణోగ్రతలు, దక్షిణాన 20 °C (68 °F) నుండి ఉత్తరాన 24 °C (75 °F) వరకు ఉంటాయి. నైరుతి కనుమలలోని అతి శీతల కాలాలు అత్యధ్క వర్షపాత సమయాలూ ఒక్కసారే ఏర్పడతాయని గమనించారు.[13]

జూన్, సెప్టెంబరు మధ్య వర్షాకాలంలో, నిరాఘతంగా కొనసాగే పడమటి కనుమలు తేమతో నిండిన మేఘాలకు అవరోధంగా పనిచేస్తాయి. వర్షాన్ని మోసుకుని తూర్పు వైపు కదిలే బరువైన మేఘాలు ఈకనుమల వలన పైకి లేవవలసి వస్తుంది. ఈ ప్రక్రియలో అవి వర్షాన్ని గాలి దిశగా కురుస్తాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం సగటున 300 సెం.మీ. నుండి 400 సెం.మీ.. ఉంటుంది. అక్కడక్కడా 900 సెం.మీ. వరకు వర్షపాతం ఉంటుంది. పడమటి కనుమలకు తూర్పున ఉన్న ప్రాంతాలు, వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది (సుమారు 100 సెం.మీ). దీంతో ఫలితంగా అన్ని ప్రాంతాలకూ కలిపి సగటు వర్షపాతం 250 సెం.మీ. ఉంటుంది. ఉత్తర మహారాష్ట్రలోని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత దీర్ఘమైన పొడి కాలాలు ఉంటాయి, భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ వార్షిక వర్షపాతం ఉంటుంది. కానీ సంవత్సరంలో చాలా నెలలు వర్షం పడుతుంది.[13]

వర్షపాతం మార్చు

కర్ణాటక ప్రాంతంలో సగటున కేరళ, మహారాష్ట్ర, గోవా కంటే భారీ వర్షాలు కురుస్తాయి. కర్ణాటకలోని ఘాట్లలో తక్కువ దారులు, ఖాళీలూ ఉన్నాయి. అందువల్ల కర్ణాటక యొక్క పశ్చిమ వాలులలో పడమటి కనుమల యొక్క ఇతర భాగాల కంటే 400 సెం.మీ.ఎక్కువ వర్షాలు కురుస్తాయి.

పడమటి కనుమలలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలు:

స్థానం ప్రాంతం సగటు వార్షిక వర్షపాతం [14]
ఆగుంబె తీర్థహళ్ళి, కర్ణాటక 7,624 మి.మీ. (300.2 అం)
అంబోలి సింధుదుర్గ్ జిల్లా, మహారాష్ట్ర 3,859 మి.మీ. (151.9 అం)
హుళికళ్ హొసనగర, కర్ణాటక 5,316 మి.మీ. (209.3 అం)
అమగావ్ ఖానాపూర్, కర్ణాటక 4,089 మి.మీ. (161.0 అం)
కక్కాళి సిర్సి, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక 4,921 మి.మీ. (193.7 అం)
నీలకుండ్ సిర్సి, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక 4,369 మి.మీ. (172.0 అం)
మహాబలేశ్వర్ సతారా జిల్లా, మహారాష్ట్ర 5,761 మి.మీ. (226.8 అం)
దేవిమనే సిర్సి, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక 3,981 మి.మీ. (156.7 అం)
సుర్లి హొసనగర, కర్ణాటక 4,335 మి.మీ. (170.7 అం)
లోనావ్లా పుణె జిల్లా, మహారాష్ట్ర 4,073 మి.మీ. (160.4 అం)
చర్మడి ముడిగెరె, కర్ణాటక 4,131 మి.మీ. (162.6 అం)
సంసే ముడిగెరె, కర్ణాటక 3,914 మి.మీ. (154.1 అం)
కొల్లూర్ Udupi జిల్లా, కర్ణాటక 4,992 మి.మీ. (196.5 అం)
ముక్కియాడ్ వేనాడ్ జిల్లా, కేరళ 3,714 మి.మీ. (146.2 అం)
కుద్రేముఖ్ Chikmagalur జిల్లా, కర్ణాటక 4,158 మి.మీ. (163.7 అం)
రాజమలై ఇడుక్కి, కేరళ 4,785 మి.మీ. (188.4 అం)
న్యామకాడ్ ఇడుక్కి, కేరళ 3,007 మి.మీ. (118.4 అం)
శోలయర్ కోయింబత్తూరు, తమిళనాడు 3,024 మి.మీ. (119.1 అం)
వైత్రి వేనాడ్ జిల్లా, కేరళ 4,000 మి.మీ. (160 అం)
పూకోడే వేనాడ్ జిల్లా, కేరళ 3,957 మి.మీ. (155.8 అం)
ధమనోహోల్ ముల్షీ తాలూకా, మహారాష్ట్ర 6,255 మి.మీ. (246.3 అం)
ముల్షీ పుణే జిల్లా, మహారాష్ట్ర 5,100 మి.మీ. (200 అం)
తమ్హిని ఘాట్ ముల్షీ తాలూకా, మహారాష్ట్ర 5,255 మి.మీ. (206.9 అం)
చిన్నకల్లూరు కోయింబత్తూరు, తమిళనాడు 2,947 మి.మీ. (116.0 అం)
కాజిల్ రాక్ ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక 5,132 మి.మీ. (202.0 అం)

జీవవైవిధ్య పరిరక్షణ మార్చు

 
దట్టమైన వర్షారణ్యాలు పడమటి కనుమలను కప్పాయి.
 
పడమటి కనుమలు యునెస్కో వారసత్వ ప్రదేశం.

చారిత్రికంగా పడమటి కనుమలు దట్టమైన అడవులతో కప్పబడి ఉన్నాయి. ఇవి స్థానిక గిరిజన ప్రజలకు ఆహారాన్ని, సహజ ఆవాసాలను కల్పించాయి. దీని దుర్గమత్వం వల్ల మైదాన ప్రాంతాల ప్రజలకు ఈ కొండల్లో పంటలు పండించడం, స్థావరాలు నిర్మించడం కష్టమైంది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు వచ్చిన తరువాత, వ్యవసాయ తోటలు, కలప కోసం పెద్ద భూభాగాలను క్లియర్ చేసారు. మానవ కార్యకలాపాల కారణంగా పడమటి కనుమలలోని అడవి తీవ్రంగా విచ్ఛిన్నమైంది -ముఖ్యంగా 1860 నుండి 1950 వరకు టీ, కాఫీ, టేకు తోటల కోసం.[1] చెట్లు కొట్టేయడం వలన. అరుదైన, ఎండెమిక్ జీవులు (స్థానీయ -ఇక్కడ మాత్రమే ఉండే, ప్రపంచంలో మరెక్కడా ఉండని జీవులు) మిగతా జీవుల కంటే ఎక్కువగా ప్రతికూలంగా ప్రభావితమవుతాయి, వాటికంటే వేగంగా అంతరించిపోతాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు ఇతర ఆవాసాల కంటే చాలా ఎక్కువ ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.[15]

ఈ ప్రాంతం అభివృద్ధికి పర్యావరణపరంగా సున్నితమైనది. పర్యావరణ శాస్త్రవేత్త నార్మన్ మైయర్స్ ప్రయత్నాల వలన 1988 లో దీన్ని పర్యావరణ హాట్‌స్పాట్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతం భారతదేశం లోని ఐదు శాతం భూమిని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని జాతుల మొక్కలలోనూ 27% (15,000 జాతులలో 4,000) ఇక్కడ ఉన్నాయి. వీటిలో 1,800 ఈ ప్రాంతానికిమాత్రమే చెందినవి. ఈ శ్రేణిలో కనీసం 84 ఉభయచర జాతులు, 16 పక్షి జాతులు, ఏడు క్షీరదాలు, 1,600 పుష్పించే మొక్కలూ ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. రక్షిత ప్రాంతాలు 2 సహా బయోస్ఫియరు రిజర్వులు, 13 జాతీయ పార్కులు, అనేక అభయారణ్యాలు కూడా కవర్ నిర్దిష్ట అంతరించిపోతున్న జాతులు, అనేక రిజర్వ్ అడవులు వంటి ఎన్నో పరిరక్షణ ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేసింది. వీటన్నిటినీ సంబంధిత రాష్ట్ర అటవీ శాఖలు నిర్వహిస్తాయి. 5,500 చ.కి.మీ. విస్తీర్ణమున్న నీలగిరి బయోస్పియర్ రిజర్వు పడమటి కనుమలలో కెల్లా అతిపెద్ద రక్షిత ప్రాంతం. నాగరాహోల్ లోని సతత హరిత అడవులు, కర్ణాటకలోని బండిపూర్ ఆకురాల్చే అడవులు, వయనాడ్ - కేరళలోని ముకుర్తి, తమిళనాడులోని ముదుమలై నేషనల్ పార్క్ - సత్యమంగళాలు ఈ రిజర్వులో భాగం.[1] కేరళలోని సైలెంట్ వ్యాలీ భారతదేశంలోని ఉష్ణమండల సతత హరిత అడవి యొక్క చివరి భూభాగాలలో ఒకటి.[16][17]

2011 ఆగస్టు లో, పడమటి కనుమల పర్యావరణ శాస్త్ర నిపుణుల ప్యానెల్ (WGEEP) మొత్తం పడమటి కనుమలను పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా (ESA) గుర్తించింది. దాని వివిధ ప్రాంతాలకు మూడు స్థాయిల పర్యావరణ సున్నితత్వాన్ని కేటాయించింది.[18] పడమటి కనుమల జీవవైవిధ్యం, పర్యావరణ సమస్యలను అంచనా వేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించింది.[19] గాడ్గిల్ కమిటీ, దాని వారసుడు కస్తూరిరంగన్ కమిటీలు పడమటి కనుమలను రక్షించడానికి సిఫారసులు సూచించాయి. గాడ్గిల్ నివేదిక మరీ పర్యావరణ-అనుకులంగా ఉందని విమర్శించారు. కస్తూరిరంగన్ నివేదిక పర్యావరణ వ్యతిరేకమని ముద్రవేసారు.[20][21][22]

పడమటి కనుమలను రక్షిత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితా చేయమని 2006 లో, యునెస్కో వారి మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం (మాబ్) కు భారతదేశం దరఖాస్తు చేసింది.[1] 2012 లో, ఈ క్రింది ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు:[1][23]

 • కాళి టైగర్ రిజర్వ్, దండేలి, కర్ణాటక
 • ఇందిరా గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం and జాతీయ వనం, తమిళనాడు
 • ముండిగెకెరే పక్షి సంరక్షణ కేంద్రం, సిర్సి, కర్ణాటక
 • కాలక్కాడ్ ముండాంతురై టైగర్ రిజర్వ్, తమిళనాడు
 • తట్టెక్కాడ్ పక్షి సంరక్షణ కేంద్రం, కేరళ
 • షెండుర్నే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • నెయ్యార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • పెప్పార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • పెరియార్ టైగర్ రిజర్వ్, కేరళ
 • శ్రీవిల్లిపుత్తూరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
 • ఎరవికుళం జాతీయ వనం, కేరళ
 • గ్రాస్ హిల్స్ జాతీయ వనం, తమిళనాడు and కేరళ
 • కరియన్ షోలా జాతీయ వనం, కర్ణాటక
 • సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
 • Chinnar వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • సైలెంట్ వ్యాలీ జాతీయ వనం, కేరళ
 • ముకుర్తి జాతీయ వనం, తమిళనాడు
 • పుష్పగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కర్ణాటక
 • బ్రహ్మగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కర్ణాటక
 • మూకాంబిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
 • తలకావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కర్ణాటక
 • అరాళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • కుద్రేముఖ్ జాతీయ వనం, కర్ణాటక
 • సోమేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కర్ణాటక
 • కాస్ ప్లాటూ, మహారాష్ట్ర
 • భీమశంకర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మహారాష్ట్ర
 • కోయినా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మహారాష్ట్ర
 • చందోలి జాతీయ వనం, మహారాష్ట్ర
 • రాధనగిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మహారాష్ట్ర
 • పరాంబికుళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • పంబడుం షోలా జాతీయ వనం, కేరళ
 • అనముడి షోలా జాతీయ వనం, కేరళ
 • చిన్మోయ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
 • పీచి-వజాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • వేనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కేరళ
 • మత్తికెట్టన్ షోలా జాతీయ వనం, కేరళ
 • కురింజిమల సంరక్షణ కేంద్రం, కేరళ
 • కరింపుజా జాతీయ వనం, కేరళ
 • ఇడుక్కి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
 • రాణిపురం జాతీయ వనం
 • మేగమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
 • పళని హిల్స్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, జాతీయ వనం, తమిళనాడు
 • కన్యాకుమారి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
 • బందీపూర్ జాతీయ వనం మేగమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం|, కర్ణాటక
 • నాగరహోల్ జాతీయ వనం, కర్ణాటక
 • నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, తమిళనాడు

జంతుజాలం మార్చు

పడమటి కనుమలు కనీసం 325 అంతరించిపోతున్న జాతులతో సహా వేల జంతు జాతులకు ఆవాసంగా ఉన్నాయి.[24]

క్షీరదాలు మార్చు

పడమటి కనుమల్లో కనీసం 139 క్షీరద జాతులు ఉన్నాయి. 16 స్థానిక క్షీరదాలలో, 13 ఆపదలో ఉన్నాయి. మొత్తం 32 ఆపదలో ఉన్న జాతులలో, తీవ్ర ప్రమాదంలో ఉన్న మలబార్ పెద్ద మచ్చల సివెట్, అంతరించిపోతున్న సింహం తోక గల మకాక్, నీలగిరి తహర్, బెంగాల్ పులి, భారతీయ ఏనుగులు, భారతీయ చిరుతపులి, నీలగిరి లంగూర్, గౌర్‌లు ఉన్నాయి.[1][25][26]

ఈ కొండ శ్రేణులు ముఖ్యమైన వన్యప్రాణుల కారిడార్లు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులలో ముఖ్యమైన భాగం. సుందర్బన్స్ వెలుపల పులుల జనాభా అత్యధికంగా పడమటి కనుమలలోనే ఉంది. ఇక్కడ, 21,435 చ.కి.మీ. లలో విస్తరించిన ఏడు జనాభా ప్రాంతాల్లో 336 నుండి 487 పులులున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.[27] పడమటి కనుమ పర్యావరణ ప్రాంతంలో అతిపెద్ద భారతీయ ఏనుగు జనాభా ఉంది. మొత్తం ఎనిమిది విభిన్న జనాభా సమూహాల్లో 11,000 ఏనుగు లున్నాయి.[1][1] అంతరించిపోతున్న అంచున ఉన్న నీలగిరి తహర్ కోలుకొని 3,122 జంతువులు అడవిలో ఉన్నట్లు అంచనా.[28] తీవ్రంగా అంతరించిపోతున్న స్థానిక మలబార్ పెద్ద-మచ్చల సివెట్‌లు 250 కంటే తక్కువ వయోజన జీవులున్నాయని అంచనా వేసారు. వయోజనేతర జనాభా 50 కంటే ఎక్కువ ఉండదు.[29] పడమటి కనుమలలో అనేక ప్రాంతాలలో సుమారు 3500 సింహం తోక గల మకాక్లు అక్కడక్కడా ఉన్నాయి.[30]

సరీసృపాలు మార్చు

ఉరోపెల్టిడే అనే పాము కుటుంబం యొక్క ప్రధాన జనాభా ఈ ప్రాంతానికి పరిమితమైంది.[31] పలు విలక్షణ సరీసృపాల ప్రజాతులు ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో కేన్‌ తాబేలు, వైజయచెలిస్ సిల్వాటికా, సాలియాఅ, రిస్టెల్లా, కేస్ట్లియా వంటి బల్లులు, మెలానోఫిడియం, ప్లెక్టురస్, టెరెట్రూరస్, ప్లాటిప్లెక్టూరస్, జైలోఫిస్, రాబ్‌డ్రాప్స్ వంటి పాములు మొదలైనవి ఉన్నాయి. జాతుల-స్థాయి స్థానికత (ఎండెమిజం) ఇక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్న దాదాపు అన్ని ప్రజాతుల లోనూ ఇది సాధారణమే. ఎక్కువగా దాగి ఉండే స్థానిక సరీసృపాలలో చారల పగడపు పాము, మలబార్ పిట్ వైపర్, పెద్ద-స్కేల్ పిట్వైపర్, గుర్రపుడెక్క పిట్వైపర్ వంటి విషపూరిత పాములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మగ్గర్ మొసళ్ళు గణనీయంగా ఉన్నాయి.[5]

ఉభయచరాలు మార్చు

పడమటి కనుమల లోని ఉభయచరాలు వైవిధ్యమైనవి, ప్రత్యేకమైనవి, 179 ఉభయచర జాతులలో 80% కంటే ఎక్కువ పర్వతాల వర్షారణ్యాలకు చెందినవి.[5] అంతరించిపోతున్న ఊదా కప్పను 2003 లో కనుగొన్నారు.[32] అనేక కుటుంబాల కప్పలు - మైక్రిక్సాలస్, ఇండిరానా, నైక్టిబాట్రాకస్ ప్రజాతులకు చెందినవి - ఇక్కడి స్థానీయత ఉన్నాయి. స్థానీయ ప్రజాతుల్లో పెడోస్టైబ్స్, ఘాటీఫ్రైన్, జాంత్రోఫ్రైన్ ఉన్నాయి.,ఘటిక్సలస్, మెర్కురానా, బెడ్డోమిక్సలస్ వంటి ఆర్బోరియల్ కప్పలు; మెలనోబాట్రాచస్ వంటి మైక్రోహైలిడ్లు కూడా ఇక్కడ స్థానియత ఉన్న ప్రజాతులే. 2005 లో పడమటి కనుమలకు చెందిన కొత్త కప్ప జాతులు వివరించబడ్డాయి. ఇటీవల ఒక కొత్త జాతి, మిస్టిసెల్లస్ ప్రజాతి లోది, మోనోటైప్ కనుగొనబడింది.[33][34] ఈ ప్రాంతం అనేక సేసీలియన్ జాతులకు నిలయంగా ఉంది.

చేపలు మార్చు

2004 నాటికి, పడమటి కనుమల్లో 288 మంచినీటి చేపలను గుర్తించారు. వీటిలో 35 ఉప్పునీటిలో కూడా పెరిగేవి.[9] అప్పటి నుండి అనేక కొత్త జాతులను వివరించారు..[35][36] పడమటి కనుమలకు మాత్రమే స్థానీయమైన జాతులు 118, ప్రజాతులు 13 ఉన్నాయి..[37]

పడమటి కనుమల దక్షిణ భాగంలో ఉత్తరాన కంటే ఎక్కువ చేపల సమృద్ధి ఉంది,[37] అత్యధికంగా చలాకుడి నదిలో ఉన్నాయి. ఇక్కడొక్కచోటనే 98 జాతుల చేపలున్నాయి.[38] అధిక జాతుల సంఖ్య కలిగిన ఇతర నదులలో పెరియార్, భరతాపుజా, పంబా, చలియార్, అలాగే కావేరి, పంబార్, భవానీ, కృష్ణ నదుల అప్‌స్ట్రీమ్ ఉపనదులు ఉన్నాయి.[37] అత్యధిక జాతులు ఉన్న కుటుంబాలు - సిప్రినిడ్స్ (72 జాతులు), హిల్ స్ట్రీమ్ లోచెస్ (34 జాతులు; రాతి లోచ్లతో సహా, ఇప్పుడు ఒక ప్రత్యేక కుటుంబంగా పరిగణించబడుతున్నాయి), బాగ్రిడ్ క్యాట్ ఫిష్ (19 జాతులు), సిసోరిడ్ క్యాట్ ఫిష్ (12 జాతులు).[9][37][38] ఈ ప్రాంతం డెనిసన్ (లేదా రెడ్ లైన్ టార్పెడో) బార్బ్,[39] పుచ్చకాయ బార్బ్, అనేక జాతుల డాకిన్సియా బార్బ్స్, జీబ్రా లోచ్, హోరాబాగ్రస్ క్యాట్ ఫిష్, మరగుజ్జు పఫర్ ఫిష్, మరగుజ్జు మలబార్ పఫర్ ఫిష్ వంటి అనేక రంగురంగుల అలంకార చేపలకు నిలయం .[1] ఈ నదులు ఓస్టియోబ్రామా బకేరీకి, మలబార్ స్నేక్ హెడ్, మలబార్ మహాసీర్ వంటి పెద్ద జాతులకూ ఆవాస స్థావరం.[40][41] కొన్ని భూగర్భ జీవితానికి అనుగుణంగా ఉంటాయి, వీటిలో, కొన్ని మోనోప్టెరస్ స్వాంపీల్స్,[42], క్యాట్ ఫిష్ హోరాగ్లానిస్, క్రిప్టోగ్లానిస్ ఉన్నాయి .[43]

ఐయుసిఎన్ ప్రకారం, పడమటి కనుమల నుండి 97 మంచినీటి చేప జాతులు 2011 లో ఆపదలో ఉన్నట్లు పరిగణించబడ్డాయి. వీటిలో 12 ప్రమాదకరమైన, 54 అంతరించిపోతున్న, 31 వల్నరబుల్ గా ఉన్నాయి.[37] వీటిలో ఒకటి ( టోర్ ఖుద్రీ ) మినహా మిగిలినవి పడమటి కనుమలకు స్థానీయమైనవి. ఈ ప్రాంతం నుండి అదనంగా 26 జాతులను డేటా కొరతగా పరిగణిస్తున్నారు (ప్రస్తుతం వాటి స్థితి అస్పష్టంగా ఉంది). నివాస ప్రాంతాన్ని కోల్పోవడం, కానీ అతిగా పట్టడం, కొత్త జాతులను ప్రవేశపెట్టడం ప్రాథమికమైన ఆపదలు.[37]

పక్షులు మార్చు

పడమటి కనుమల్లో కనీసం 508 పక్షి జాతులు ఉన్నాయి. కర్ణాటకలోని ఐదువందల జాతుల పక్షుల్లో చాలావరకు పడమటి కనుమల ప్రాంతానికి చెందినవే.[1][1] పడమటి కనుమలల్లో కనీసం 16 జాతుల స్థానీయ పక్షులు ఉన్నాయి, వీటిలో అంతరించిపోతున్న రూఫస్-బ్రెస్ట్ లాఫింగ్‌ట్రష్, వల్నరబుల్‌గా ఉన్న నీలగిరి వుడ్-పావురం, తెల్లటి బొడ్డు షార్ట్‌వింగ్, విస్తృత తోక గల గడ్డి పక్షులు, ప్రమాదానికి దగ్గరలో ఉన్న బూడిద-రొమ్ముల నవ్వులత్రష్, నలుపు రూఫస్ ఫ్లైక్యాచర్, నీలగిరి ఫ్లైక్యాచర్, నీలగిరి పిపిట్, అతి తక్కువ ఆందోళన కలిగిస్తున్న మలబార్ (నీలిరంగు) పారాకీట్, మలబార్ గ్రే హార్న్బిల్, వైట్-బెల్లీడ్ ట్రీపీ, గ్రే-హెడ్ బల్బుల్, రూఫస్ బాబ్లర్, వయనాడ్ లాఫింగ్ థ్రష్, వైట్-బెల్లీ బ్లూ-ఫ్లైక్యాచర్ క్రిమ్సన్-బ్యాక్డ్ సన్‌బర్డ్ లు ఉన్నాయి [1]

వృక్షజాలం మార్చు

పడమటి కనుమలలో లభించే 7,402 జాతుల పుష్పించే మొక్కలలో, 5,588 జాతులు స్థానీయ లేదా స్వదేశీవి, 376 ఎక్సోటిక్; 1,438 జాతులను సాగు చేసేవి లేదా అలంకరణ కోసం పండించేవి. దేశీయ జాతులలో, 2,253 జాతులు భారతదేశానికి చెందినవి. వాటిలో 1,273 జాతులు ప్రత్యేకంగా పడమటి కనుమలకే పరిమితమైనవి. 593 ధ్రువీకరించబడిన ఉపజాతులు, రకాలు కాకుండా; 66 జాతులు, 5 ఉపజాతులు, 14 రకాల సందేహాస్పదమైనవి కూడా ఉన్నాయి. పుష్పించే మొక్కలకు చెందిన మొత్తం 8,080 టాక్సాలున్నాయి .[44]

మూలాలు మార్చు

 1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 1.18 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; all-about-india.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. Myers, Norman; Mittermeier, Russell A.; Mittermeier, Cristina G.; Da Fonseca, Gustavo A. B.; Kent, Jennifer (2000). "Biodiversity hotspots for conservation priorities". Nature. 403 (6772): 853–858. doi:10.1038/35002501. PMID 10706275.
 3. "UN designates Western Ghats as world heritage site". Times of India. 2 July 2012. Archived from the original on 31 జనవరి 2013. Retrieved 2 July 2012.
 4. Migon, Piotr (12 May 2010). Geomorphological Landscapes of the World. Springer. p. 257. ISBN 978-90-481-3054-2.
 5. 5.0 5.1 5.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Citation అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 6. Lewis, Clara (3 July 2012). "39 sites in Western Ghats get world heritage status". Times of India. Archived from the original on 7 జూలై 2012. Retrieved 21 February 2013.
 7. Nayar, T.S.; Rasiya Beegam, A; Sibi, M. (2014). Flowering Plants of the Western Ghats, India (2 Volumes). Thiruvananthapuram, India: Jawaharlal Nehru Tropical Botanic Garden and Research Institute. p.1700.
 8. Myers, N.; Mittermeier, R.A.; Mittermeier, C.G.; Fonseca, G.A.B.Da; Kent, J. (2000). "Biodiversity Hotspots for Conservation Priorities". Nature. 403 (6772): 853–858. doi:10.1038/35002501. PMID 10706275.
 9. 9.0 9.1 9.2 Dahanukar, N.; Raut, R.; Bhat, A. (2004). "Distribution, endemism and threat status of freshwater fishes in the Western Ghats of India". Journal of Biogeography. 31 (1): 123–136. doi:10.1046/j.0305-0270.2003.01016.x.
 10. Barron, E.J.; Harrison, C.G.A.; Sloan, J.L. II; Hay, W.W. (1981). "Paleogeography, 180 million years ago to the present". Eclogae Geologicae Helvetiae. 74 (2): 443–470.
 11. Menon, Rajesh (3 October 2005). "Tremors may rock Koyna for another two-decade". Indian Express. Archived from the original on 17 November 2007. Retrieved 19 March 2007.
 12. Samani, R.L.; Ayhad, A.P. (2002). "Siltation of Reservoirs-Koyna Hydroelectric Project-A Case Study". In S. P. Kaushish; B. S. K. Naidu (eds.). Silting Problems in Hydropower Plants. Bangkok: Central Board of Irrigation and Power. ISBN 978-90-5809-238-0.
 13. 13.0 13.1 Ranjit Daniels, R.J. "Biodiversity of the Western Ghats – An Overview". Wildlife Institute of India. Archived from the original on 2008-09-19. Retrieved 2020-04-23.
 14. https://en.climate-data.org
 15. Kumar, Ajith. "Impact of rainforest fragmentation on small mammals and herpetofauna in the Western Ghats, South India" (PDF). Salim Centre for Ornithology and Natural History, Coimbatore. Archived from the original (PDF) on 19 December 2008. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 16. Ramesh (21 November 2009). "No clearance for mining, hydel projects that destroy Western Ghat". The Hindu. Palakkad: Kasturi & Sons Ltd. Retrieved 29 December 2009.
 17. staff (4 August 2009). "Gundia project has not got Centre's nod". The Hindu. Chennai, India: Kasturi & Sons Ltd. Archived from the original on 8 ఆగస్టు 2009. Retrieved 29 December 2009.
 18. Madhav Gadgil (2012-08-31). "Report of the Western Ghats Ecology Expert Panel" (PDF). Part 1. Ministry of Environment and Forests, Government of India: summary XIX. Archived from the original (PDF) on 20 సెప్టెంబరు 2015. Retrieved 4 May 2012. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 19. "Vested interests in Western Ghats". Deccan Herald. Retrieved 5 May 2016.
 20. "Report is anti environmental". The Hindu. Retrieved 14 May 2016.
 21. "Disaster for Western Ghats".
 22. "Paradise lost". Hindustan Times. Archived from the original on 23 జూలై 2015. Retrieved 14 May 2016.
 23. "UN designates Western Ghats as world heritage site". Times of India. 2 July 2012. Retrieved 28 July 2013.
 24. Nameer, P.O.; Molur, Sanjay; Walker, Sally (November 2001). "Mammals of the Western Ghats: A Simplistic Overview". Zoos' Print Journal. 16 (11): 629–639. doi:10.11609/jott.zpj.16.11.629-39.
 25. Participants of CBSG CAMP workshop: Status of South Asian Primates (March 2002) (2004). "Macaca silenus". IUCN Red List of Threatened Species. 2004. Retrieved 9 May 2006.{{cite journal}}: CS1 maint: numeric names: authors list (link) Database entry includes justification for why this species is endangered
 26. Mewa, Singh; Werner, Kaumanns (2005). "Behavioural studies: A necessity for wildlife management" (PDF). Current Science. 89 (7): 1233. Archived from the original (PDF) on 13 January 2007.
 27. Jhala, Y. V.; Gopal, R.; Qureshi, Q (2008). "Status of the Tigers, co-predators, and Prey in India" (PDF). TR 08/001. National Tiger Conservation Authority, Govt. of India, New Delhi; Wildlife Institute of India, Dehradun. Archived from the original (PDF) on 2 June 2013. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 28. "Nilgiri tahr population over 3,000: WWF-India". The Hindu. 3 October 2015. Retrieved 1 May 2016.
 29. Jennings, A.; Veron, G.; Helgen, K. (2008). "Viverra civettina". IUCN Red List of Threatened Species. 2008.
 30. Molur S; D Brandon-Jones; W Dittus; A. Eudey; A. Kumar; M. Singh; M.M. Feeroz; M. Chalise; P. Priya (2003). "Status of South Asian Primates: Conservation Assessment and Management Plan (C.A.M.P.) Workshop Report, 2003". Zoo Outreach Organization/CBSG-South Asia, Coimbatore. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 31. Greene, H. W.; R. W. Mcdiarmid (2005). Wallace and Savage: heroes, theories and venomous snake mimicry, Ecology and Evolution in the Tropics, a Herpetological Perspective. Chicago University of Chicago Press. pp. 190–208.
 32. Radhakrishnan, C; K.C. Gopi; K.P. Dinesh (2007). "Zoogeography of Nasikabatrachus sahyadrensis Biju and Bossuyt (Amphibia: Anura; Nasikabatrachidae) in the Western Ghats, India". Records of the Zoological Survey of India. 107: 115–121.
 33. "An evaluation of the endemism of the amphibian assemblages from the Western Ghats using molecular techniques" (PDF). WII. Archived from the original (PDF) on 19 December 2008. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 34. "New 'mysterious' frog species discovered in India's Western Ghats". BBC News. 13 February 2019.
 35. Britz; Ali; Philip (2012). "Dariourops, a new species of badid fish from the Western Ghats, southern India". Zootaxa. 3348: 63–68. doi:10.11646/zootaxa.3348.1.5.
 36. Sreekantha; Gururaja; Remadevi; Indra; Ramachandra (2006). "Two new species of the genus Schistura McClell and (Cypriniformes: Balitoridae) from western Ghats, India". Zoos' Print Journal. 21 (4): 2211–2216. doi:10.11609/jott.zpj.1386.2211-6.
 37. 37.0 37.1 37.2 37.3 37.4 37.5 Molur, M.; Smith, K.G.; Daniel, B.A.; Darwall, W.R.T. (2011). The status and distribution of freshwater biodiversity in the Western Ghats, India (PDF). IUCN Red List of Threatened Species – Regional Assessment. ISBN 978-2-8317-1381-6.
 38. 38.0 38.1 Raghavan; Prasad; Ali; Pereira (2008). "Fish fauna of Chalakudy River, part of Western Ghats biodiversity hotspot, Kerala, India: patterns of distribution, threats and conservation needs". Biodiversity and Conservation. 17 (13): 3119–3131. doi:10.1007/s10531-007-9293-0.
 39. Raghavan, R., Philip, S., Ali, A. & Dahanukar, N. (2013): Sahyadria, a new genus of barbs (Teleostei: Cyprinidae) from Western Ghats of India. Journal of Threatened Taxa, 5 (15): 4932-4938.
 40. Benziger; Philip; Raghavan; Ali; Sukumaran; Tharian; Dahanukar; Baby; Peter (2011). "Unraveling a 146 Years Old Taxonomic Puzzle: Validation of Malabar Snakehead, Species-Status and Its Relevance for Channid Systematics and Evolution". PLOS One. 6 (6): e21272. doi:10.1371/journal.pone.0021272. PMC 3123301. PMID 21731689.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
 41. Silas; et al. (2005). "Indian Journal of Fisheries". 52 (2): 125–140. {{cite journal}}: Cite journal requires |journal= (help)
 42. Gobi, K.C. (2002). "A new synbranchid fish, Monopterus digressus from Kersla, Peninsular India". Rec. Zool. Surv. India. 100 (1–2): 137–143.
 43. Vincent, Moncey; Thomas, John (April 2011). "Kryptoglanis shajii, an enigmatic subterranean-spring catfish (Siluriformes, Incertae sedis) from Kerala, India". Ichthyological Research. 58 (2): 161–165. doi:10.1007/s10228-011-0206-6.
 44. Nayar, T.S., Rasiya Beegam A., and M. Sibi. (2014). Flowering Plants of the Western Ghats, India (2 Volumes), Jawaharlal Nehru Tropical Botanic Garden and Research Institute, Palode, Thiruvananthapuram, Kerala, India. p.1700