సింధు మేనన్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సింధు మేనన్ ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది.
సింధు మేనన్ | |
---|---|
జననం | సింధు మేనన్ |
వృత్తి | నటి, టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1994–2012 |
జీవిత భాగస్వామి | ప్రభు |
పిల్లలు | 1 |
బాల్యం
మార్చుసింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది.[1] ఆమెకు కార్తీక్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అతను మొదట్లో కన్నడ మ్యూజిక్ చానల్లో వీజేగా పనిచేసి తరువాత నటుడు అయ్యాడు.[2] సింధు తన మాతృభాషయైన మలయాళమే కాక, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు.[3][4]
నట జీవితం
మార్చుసింధు చిన్నతనంలోనే భరత నాట్యం లో శిక్షణ తీసుకున్నది. ఒకానొక భరత నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే ఆమెను కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేశాడు. అలా ఆమె 1994లో రష్మి అనే కన్నడ సినిమాలో నటించింది.[1] తరువాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. 1999లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది. తెలుగులో చందమామ చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించిన సింధు మేనన్ వైశాలి, సిద్ధం, త్రినేత్రం, రెయిన్‌బో అలాగే మరిన్ని చిత్రాల్లో నటించింది.
తరువాత 15 సంవత్సరాల వయసులో తెలుగు లో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం, పులిజన్మమ్ అనే సినిమాల్లో నటించింది.
వివాహం
మార్చుసింధు యూకే లో స్థిరపడ్డ తెలుగు క్రైస్తవ కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ నిపుణుడిని ఏప్రిల్ 2010న వివాహం చేసుకున్నది.[5] వారికి ఓ కూతురు. పేరు స్వెత్లానా.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Interview with Sindhu Menon". idlebrain.com. Retrieved 2009-06-07.
- ↑ "Kangana foraying into Kannada!". Oneindia. Archived from the original on 2012-07-08. Retrieved 2009-06-07.
- ↑ "Sindhu Menon's focus is on Telugu and Tamil". telugudreams.com. Archived from the original on 2008-11-22. Retrieved 2009-06-07.
- ↑ "Sindhu Menon's asset". andhrastudio.com. Archived from the original on 2009-07-05. Retrieved 2009-06-07.
- ↑ "Sindhu Menon got married secretly!". Oneindia.in. Archived from the original on 2012-10-21. Retrieved 2010-11-16.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సింధు మేనన్ పేజీ