సిబిఎమ్ కాంపౌండ్

విశాఖపట్నం నగరం మధ్య భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం

సిబిఎమ్ కాంపౌండ్ (కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ కాంపౌండ్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరం మధ్య భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలోని ఈ ప్రాంతం, నగరంలోని ముఖ్య వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోంది.[2]

సిబిఎమ్ కాంపౌండ్
సమీపప్రాంతం
సిబిఎమ్ కాంపౌండ్ లోని రాధిక థియేటర్ రోడ్డు
సిబిఎమ్ కాంపౌండ్ లోని రాధిక థియేటర్ రోడ్డు
సిబిఎమ్ కాంపౌండ్ is located in Visakhapatnam
సిబిఎమ్ కాంపౌండ్
సిబిఎమ్ కాంపౌండ్
విశాఖట్నం నగర పటంలో సిబిఎమ్ కాంపౌండ్ స్థానం
Coordinates: 17°43′36″N 83°18′47″E / 17.726647°N 83.312948°E / 17.726647; 83.312948
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationఏపి-31

భౌగోళికం

మార్చు

ఇది 17°43′36″N 83°18′47″E / 17.726647°N 83.312948°E / 17.726647; 83.312948 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[3]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సిబిఎమ్ కాంపౌండ్ మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, కుర్మనపాలెం, తగరపువలస, దేవరపల్లె, హెచ్‌బి కాలనీ, ఓహ్పో, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, రైల్వే స్టేషన్, సేవానగర్, గురజాడనగర్, దెందేరు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ఇతర వివరాలు

మార్చు

ఇది అసిల్‌మెట్ట, ద్వారకా నగర్ మధ్యన ఉంది. ఈ ప్రాంతానికి విశాఖపట్నం బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సేవలు అందిస్తోంది.[5] ఇక్కడ అనేక షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, 1931లో స్థాపించబడిన టింపానీ స్కూల్ వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇది ఖరీదైన ప్రాంతం.[6]

మూలాలు

మార్చు
  1. "Cbm Compound, Dwaraka Nagar Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  2. "location". the hindu. 28 March 2013. Retrieved 18 May 2021.
  3. "Cbm Compound Road, Cbm Compound, Asilmetta Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.
  5. "about". deccan chronicle. 27 November 2014. Retrieved 18 May 2021.
  6. "business". times of india. 15 March 2015. Retrieved 18 May 2021.