సిరిసిల్ల పురపాలకసంఘం
సిరిసిల్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] సిరిసిల్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
సిరిసిల్ల పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
సిరిసిల్ల పురపాలకసంఘ భవనం | |
అక్షాంశరేఖాంశాలు: 18°27′30″N 78°44′11″E / 18.4584546°N 78.7362845°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండలం | సిరిసిల్ల |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | జిందం కళ |
- వైస్ చైర్‌పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 55.47 km² (21.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 92,091 |
- పురుషుల సంఖ్య | 45,578 |
- స్త్రీల సంఖ్య | 46,513 |
- గృహాల సంఖ్య | 33,608 |
పిన్ కోడ్ - 505301 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08723 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న సిరిసిల్ల 1987లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
మార్చుసిరిసిల్ల 55.47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°23′20″N 78°48′04″E / 18.389°N 78.801°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 92091 మంది కాగా, అందులో 45578 మంది పురుషులు, 46513 మంది మహిళలు ఉన్నారు. 33608 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 12 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 39 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం జిందం కళ చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]
వార్డు కౌన్సిలర్లు
మార్చు- పోచవేని సత్య
- రాపెల్లి ధిగంబర్
- జిందం కళ (చైర్‌పర్సన్)
- వెల్దండి దేవదాస్
- దర్ణం అరుణ
- గుండ్లపెల్లి రామానుజం
- బుక్యా రెడ్డి నాయక్
- చెన్నమనేని కీర్తి
- లింగంపల్లి సత్యనారాయణ
- బోల్గం నాగరాజు
- ఒగ్గు ఉమ
- పాతురి రాజిరెడ్డి
- జాగిరు శైలు
- అడ్డగట్ల మాధవి
- ఆకునూరి విజయనిర్మల
- గుడ్ల శ్రీనివాస్
- గుండ్లపెల్లి నీరజ
- గడ్డం చందన
- అన్నారపు శ్రీనివాస్
- ఆడేపు సౌజన్య
- వేముల రవి
- కల్లూరి లత
- రాపెల్లి అరుణ
- కొమిరే మల్లవ బుర్రలక్ష్మి
- కుడికాల రవికుమార్
- వోటారికారి లక్ష్మిరాజమ్
- చొప్పదండి లలిత
- పత్తిపాక పద్మ
- శ్రీనివాస్ జెంటియాల
- మంచె శ్రీనివాస్
- తుమ్మ రాధ
- సీమా బేగం
- గడ్డం లాత
- దర్లా కీర్తన
- దుసా వినయ్
- కల్లూరి రాజు
- దిడ్డి మాధవి
- గూడూరి భాస్కర్
- అకుల కృష్ణ
మూలాలు
మార్చు- ↑ "Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 5 May 2021.
- ↑ "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Archived from the original on 4 మార్చి 2021. Retrieved 5 May 2021.
- ↑ "Sircilla Municipality Council". sircillamunicipality.telangana.gov.in. Archived from the original on 4 మార్చి 2021. Retrieved 5 May 2021.
వెలుపలి లంకెలు
మార్చు- సిరిసిల్ల పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-05-05 at the Wayback Machine