సిరి లాబాల యువ కవయిత్రి. కవి సంగమం రచయితలలో ఒకరు.

సిరి లాబాల
Siri Labala 09.jpg
సిరి లాబాల
జననంసరిత
(1974-09-02) 1974 సెప్టెంబరు 2 (వయస్సు: 45  సంవత్సరాలు)
ఝాన్సీ, భారతదేశం
వృత్తివ్యాపారం
కవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తవెంకటరమణ
తండ్రిచిట్టిబాబు
తల్లిపుణ్యవతి

జననం - చదువుసవరించు

1974, సెప్టెంబరు 2న పుణ్యవతి, చిట్టిబాబు దంపతులకు ఝాన్సీలో జన్మించారు. వీరి తల్లి గృహిణి, తండ్రి గారు సైనికుడు. అనేక యుద్ధాలలో పాల్గొని “సంగ్రాం మెడల్”ని అందుకున్నారు. ఈవిడ హిందీలో ఎం.ఎ చేశారు. బి.ఎడ్ కూడా చదివారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి గ్రామంలో నివసిస్తున్నారు.

 
రవీంద్రభారతిలో జరిగిన “తెలుగు సాహితీ సంబరాలు”

వివాహంసవరించు

వీరికి వెంకటరమణతో వివాహం జరిగింది. వీరికిద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి చైనాలో వైద్య విద్య, చిన్న అమ్మాయి కాకినాడలో బి.టెక్ నాలుగో సంవత్సరం, బాబు కేశవరెడ్డి స్కూల్ లో పదో తరగతి చదువుచున్నాడు.

వృత్తి - ప్రవృత్తిసవరించు

వృత్తి - వ్యాపారం. ప్రవృత్తి- కవితలు, కథలు వ్రాయడం. కుట్లు, అల్లికలు, బట్టలు కుట్టడం, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం. త్వరలో రాబోయే సినిమాకు పాటలు, మాటలు రాశారు.

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

'నన్ను చంపకండి ప్లీజ్' అనే కవిత తెలుగు పోయెట్రీస్.కామ్ లో ప్రచురితం అయింది.”కంటి చెమ్మ” అనే కథ జాగృతి వార పత్రికలో ప్రచురితం అయింది.

కవితల జాబితాసవరించు

 • ఆడపిల్ల ఈడపిల్ల కాదేమో[1]
 • ఉగాదికి స్వాగతం[2]
 • గుప్పెడంత గుండె[3]

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

 1. 'సిరి' వెన్నెల స్వరం - (17.07.2016 న విశాఖపట్టణం లోని వైశాఖి జల ఉద్యానవనం ఆడిటోరియంలో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షులు “పొట్లూరి హరికృష్ణ, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది .
 
అంతర్వేది 'సాహితీ పండుగ' కవిసమ్మేళనం

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

 • 10వ తరగతిలో స్కూల్ లో జరిగిన 'సైన్స్ ఎగ్జిబిషన్' లో పాల్గొని డా. కిమిడి మృణాలిని గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు.
 • 2014, ఆగష్టు 30 న హైదరాబాదు లోని రవీంద్రభారతి లో జరిగిన “తెలుగు సాహితీ సంబరాలు”లో పాల్గొని ఓలేటి పార్వతీశం, సినీ హాస్యనటులు కొండవలస లక్ష్మణరావు వంటి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
 • అంతర్జాలంలో 'మన తెలుగు మన సంస్కృతి', 'సాహితి సేవ', 'కృష్ణా తరంగాలు', 'మా ఆసరా' వంటి ముఖ పుస్తక సమూహాలలో చిత్ర కవితల పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
 • 2014 నవంబరు 11న అంతర్వేదిలో జరిగిన 'సాహితీ పండుగ' లో కవిసమ్మేళనంలో పాల్గొని “డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు, పొట్టి రాంబాబు, వంగపండు వంటి ప్రముఖుల చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు.
 • 2015 ఏప్రిల్ 12న హైదరాబాదు సాహితిసేవ వారు ఏర్పాటుచేసిన 'కవితా వసంతం' కవిసమ్మేళనంలో పాల్గొని 'స్రవంతి ఐతరాజు, సామాన్య' గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.
 
'కవితా వసంతం'

'సిరి' వెన్నెల స్వరం ఆవిష్కరణ చిత్రమాలికసవరించు

ఇతర లంకెలుసవరించు

మూలాలుసవరించు

 1. అచ్చంగా తెలుగు. "ఆడపిల్ల ఈడపిల్ల కాదేమో". acchamgatelugu.com. Retrieved 17 September 2016.[permanent dead link]
 2. మాలిక, కవితలు. "ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ". http://magazine.maalika.org/. Archived from the original on 6 అక్టోబర్ 2016. Retrieved 17 September 2016. External link in |website= (help)
 3. తెలుగు వేదిక, తెలుగు కవిత్వం. "గుప్పెడంత గుండె". www.teluguvedika.net. Retrieved 17 September 2016.[permanent dead link]