సీతారామాలయం, సైదాపురం
సీతారామాలయం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, సైదాపురం గ్రామ శివార్లోవున్న మల్లన్నబోడులు గుట్టపై వున్న ఆలయం. 16వ శతాబ్దంలో వెలసిన ఈ ఆలయం భద్రాచలం కన్నా పురాతనమైనది.[1]
సీతారామాలయం, సైదాపురం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°34′41″N 78°55′13″E / 17.57806°N 78.92028°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | యాదాద్రి భువనగిరి జిల్లా |
ప్రదేశం: | సైదాపురం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీరాముడు |
ప్రధాన దేవత: | సీత |
స్థల చరిత్ర - ప్రాచుర్యంలోకి
మార్చుయాదాద్రి-భువనగిరి జిల్లా సైదాపురంగ్రామం శివార్లో మల్లన్నబోడులు అని పిలువబడే చిన్నగుట్టలున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలు ఉండేవి. ఆ గుట్టల్లో మధ్య ఇప్పటికీ అక్కడక్కడ కైరన్ సమాధులు అగుపిస్తున్నాయి. ఆ బోడులలో ఒక బోడు మీద రామాలయం బయటపడ్డది. మల్లన్నబోడులు పక్కనే వ్యవసాయం చేస్తున్న పల్లెపాటి మల్లేశ్ పశువులు తప్పిపోగా, వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్లిన ఆయనకు ఈ ఆలయం కనిపించింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు దట్టమైన కంపచెట్లను తొలగించి చూస్తే రాతిగుండ్ల కప్పుకింద రాతిగుండుకు చెక్కివున్న సీతారాములు అర్ధశిల్పం (Bas-Relief) కనిపించింది.[1]
తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన చరిత్రపరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సహాయకుడు చంటి, సాక్షి విలేకరి సంపత్కుమార్ తదితరులతో కలిసి ఈ దేవాలయాన్ని అక్కడి శాసనాలను, విగ్రహాలను పరిశీలించి అది రామాలయం అని, ఆ శిల్పాలు సీతారాములవని తేల్చిచెప్పారు. శాసనపాఠాలను వివరించారు.[2]
సీతారాముల విగ్రహం
మార్చు5అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుంది. ఇది దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవులలాగా రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు ఉన్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో ఉంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న విల్లును పట్టుకున్నట్టుగా చెక్కివుంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ధరించబడ్డాయి. ప్రలంబాసనంలో కూర్చున్న రాముని ఎడమతొడపై సీతాదేవి కూర్చునివుంది.
భద్రాచలం కన్నా పురాతనమైనది
మార్చుఐదు అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కి ఉండడంతో, పూర్తిగా విగ్రహంగా చెక్కబడి భద్రాచల రాముని శిల్పం కన్నా ఈ విగ్రహమే ముందుదని తెలుస్తున్నది. భద్రాచల రాముణ్ణి వైకుంఠరాముడంటారు. ఇక్కడి రాముడు కూడా విష్ణువురూపంలో వుండడం వల్ల ‘వైష్ణవరాముడు’ అనవచ్చు. ప్రతిమాలక్షణాన్ని బట్టి ఈ శిల్పం 16వ శతాబ్దంనాటిదని చెప్పవచ్చు. భద్రాచలరాముని శిల్పం 17వ శతాబ్దం నాటిది. అక్కడి రామునికి లక్ష్మణుని శిల్పం అదనంగా చేర్చబడ్డది.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర అర్చక బృందం ఆలయాన్ని సందర్శించారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 నమస్తే తెలంగాణ (8 March 2018). "రాములోరి ఆలయం..!". Retrieved 10 March 2018.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "రాములోరి ఆలయం..!" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ సాక్షి, మినీ ఫోకస్ (23 February 2018). "సైదాపురంలో అపురూప శిల్పాలు".