బొడిగె శోభ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మరియు మాజీ ఎమ్మెల్యే.

బొడిగె శోభ

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2018
ముందు సుద్దాల దేవయ్య
తరువాత సుంకే ర‌విశంక‌ర్

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం చొప్పదండి

వ్యక్తిగత వివరాలు

జననం 09 జూన్ 1974
దామెరగ్రామం, ఎల్కతుర్తి మండలం , కరీంనగర్ జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
తల్లిదండ్రులు సాతూరి రత్నం, భాగ్యలక్ష్మి
జీవిత భాగస్వామి బొడిగె గాలన్న
సంతానం దివ్య, వికాస్
నివాసం కోతిరాంపూర్ , కరీంనగర్

జననం, విద్యాభాస్యంసవరించు

బొడిగె శోభ 09 జూన్ 1974లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా , ఎల్కతుర్తి మండలం , దామెరగ్రామంలో సాతూరి రత్నం, భాగ్యలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె పదో తరగతి వరకు వరంగల్ లోని కంచరగుంట ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి, కొన్ని కారణాల వల్ల ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసింది. ఆమెకు 16 వయస్సులో బొడిగె గాలన్నతో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు పిల్లలు దివ్య, వికాస్ ఉన్నారు.

రాజకీయ జీవితంసవరించు

బొడిగె శోభ 1990 దశకంలో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పని చేసింది. ఆమె 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాజన ఫ్రంట్ (వీరన్న వర్గం) నుంచి కమలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదర్‌గూడ లోని 49వ నెంబర్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్రకార్యాలయం సమీపంలోని జలదృశ్యంలో జయశంకర్‌ మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్లింది. బొడిగె శోభ ఆ మీటింగ్‌కి వెళ్లిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.

బొడిగె శోభ కరీంనగర్ జిల్లా శంకరపట్నం జెడ్‌పీటీసీగా పోటీ చేసి గెలిచింది. ఆమెను 2009 నుండి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా టిఆర్ఎస్ పార్టీ నియమించింది. ఆమె 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుద్దాల దేవయ్య పై 54981 ఓట్ల మెజారిటీతో గెలిచి కరీంనగర్ జిల్లా నుంచి శాసనసభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించింది.[1]2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో ఆమె 15 నవంబర్ 2018న భారతీయ జనతా పార్టీ లో చేరింది.[2][3] ఆమె 2018లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[4]

మూలాలుసవరించు

  1. Result University (2014). "Choppadandi Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  2. The News Minute (15 November 2018). "Denied TRS ticket for Telangana polls, MLA Bodiga Shobha defects to BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  3. Sakshi (16 November 2018). "బీజేపీలోకి బొడిగె శోభ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  4. News18 (2018). "Choppadandi Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.