సుధీర్ గుప్తా
సుధీర్ గుప్తా (జననం 19 మే 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మందసౌర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
సుధీర్ గుప్తా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 నవంబర్ 2014 | |||
ముందు | మీనాక్షి నటరాజన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మందసౌర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మంద్సౌర్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1959 మే 19||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | రామచంద్ర గుప్తా, దుర్గాబాయి గుప్తా | ||
జీవిత భాగస్వామి | భాగస్వామి సాధన గుప్తా | ||
సంతానం | 1 | ||
నివాసం | 2/2, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నై ఆబాది, మంద్సౌర్, మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుసుధీర్ గుప్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 27 జూన్ 2008 నుండి 31 డిసెంబర్ 2013 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మందసౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 1 సెప్టెంబర్ 2014 నుండి 31 ఆగస్టు 2017 వరకు వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 3 డిసెంబర్ 2014 నుండి 30 ఏప్రిల్ 2017 వరకు అంచనాల కమిటీ సభ్యుడిగా, కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, సబ్ కమిటీ-II అంచనాల కమిటీ సభ్యుడిగా, పంచాయతీ రాజ్` అంశంపై అంచనాల కమిటీ సబ్ కమిటీ సభ్యుడిగా,19 అక్టోబర్ 2016 నుండి 25 మే 2019 వరకు నీటి వనరులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 1 సెప్టెంబర్ 2017 నుండి 25 మే 2019 వరకు రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
సుధీర్ గుప్తా 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మందసౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై,[3] హౌస్ కమిటీ సభ్యుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
సుధీర్ గుప్తా 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మందసౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై,[1] 4 జూలై నుండి హౌస్ కమిటీ సభ్యుడిగా, 14 ఆగస్టు 2024 నుండి అంచనాల కమిటీ సభ్యుడిగా, 26 సెప్టెంబర్ నుండి పరిశ్రమపై కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mandsaur". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
- ↑ TimelineDaily (8 March 2024). "BJP MP Sudhir Gupta Who Made Controversial Remark On Aamir Khan Gets Third Nomination From Mandsaur" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.