సునీల్ కుమార్ సింగ్

సునీల్ కుమార్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చత్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

సునీల్ కుమార్ సింగ్
సునీల్ కుమార్ సింగ్


పదవీ కాలం
16 మే 2014 – 4 జూన్ 2024
ముందు ఇందర్ సింగ్ నామ్‌ధారి
తరువాత కాళీచరణ్ సింగ్
నియోజకవర్గం చత్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1962-01-10) 1962 జనవరి 10 (వయసు 62)
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కేదార్ నాథ్ సింగ్
జీవిత భాగస్వామి ప్రతిమా సింగ్
సంతానం 2
నివాసం 133/C-1, రోడ్ నెం.4, స్కూల్ రోడ్, అశోక్ నగర్, డోరండా, రాంచీ, జార్ఖండ్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

సునీల్ కుమార్ సింగ్ 10 జనవరి 1962న బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించాడు. ఆయన మగద్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ (మార్కెటింగ్), ఎంఏ (సోషియాలజీ) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

సునీల్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చత్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ ప్రసాద్ సాహుపై 1,78,026 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 16వ పార్లమెంట్‌లో 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడిగా, 12 జూలై 2014 - మే 2019 వరకు లోక్‌సభలో బీజేపీ విప్‌‌గా, 11 ఆగస్టు 2016 నుండి మే 2019 వరకు పౌరసత్వ చట్టం, 1955 సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 2017 నుండి 2019 వరకు ఇండియా-రిపబ్లిక్ ఆఫ్ కొరియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ అధ్యక్షుడిగా పని చేశాడు.

సునీల్ కుమార్ సింగ్ 2019లో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా తిరిగి ఎన్నికై పార్లమెంట్‌లో 12 జూన్ 2019 నుండి లోక్‌సభలో బీజేపీ విప్‌‌గా, 20 జూన్ 2019 నుండి వ్యాపార సలహా కమిటీ సభ్యుడిగా, 13 సెప్టెంబర్ 2019 నుండి బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 9 అక్టోబర్ 2019 నుండి కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ చైర్‌పర్సన్‌గా, 21 నవంబర్ 2019 నుండి లోక్‌సభ సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడిగా, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయనకు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[2]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (19 May 2024). "For first time in seven decades, voters seek local representative" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  2. The New Indian Express (26 March 2024). "BJP drops five sitting MPs in Jharkhand, fields Soren kin" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.