సుప్రియ దేవి

పశ్చిమ బెంగాల్ కు చెందిన సినిమా నటి.

సుప్రియ దేవి (సుప్రియ చౌదరి; 1933 జనవరి 8 - 2018 జనవరి 26) పశ్చిమ బెంగాల్ కు చెందిన సినిమా నటి. 50 సంవత్సరాలకు పైగా బెంగాలీ సినిమాలలో నటించింది.[1] రిత్విక్ ఘటక్ తీసిన మేఘా ఢాక తార (1960) అనే బెంగాలీ సినిమాలో నీతా పాత్ర పోషించినందుకు ప్రసిద్ది చెందింది.[2][3][4] సుప్రియ ఫిల్మ్‌ఫేర్ అవార్డు, బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు రెండుసార్లు గెలుపొందింది. 2011లో పశ్చిమ బెంగాల్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన బంగా-విభూషణ్‌ను కూడా అందుకుంది.[5] భారత ప్రభుత్వం 2014లో భారతదేశం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారంను అందజేసింది.[6]

సుప్రియ దేవి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న సుప్రియ
జననం
కృష్ణ బెనర్జీ

(1933-01-08)1933 జనవరి 8
మైత్కినా, మయన్మార్
మరణం26 జనవరి 2018(2018-01-26) (aged 85)
బల్లిగంజ్ సర్క్యులర్ రోడ్, కలకత్తా
ఇతర పేర్లుసుప్రియ చౌదరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1952
1958–2018
గుర్తించదగిన సేవలు
ఆమ్రపాలి
మేఘే ధాకా తార
శునో బరనారీ
కోమల్ గంధర్
స్వరాలిపి
తీన్ అధ్యాయ్
సన్యాసి రాజా
సోదరి
జీవిత భాగస్వామిబిశ్వనాథ్ చౌదరి (1954-1958)
ఉత్తమ్ కుమార్ (1963-1980)
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
బంగా-విభూషణ్
ఫిలింఫేర్ అవార్డు
బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు

తొలి జీవితం

మార్చు

సుప్రియ 1933 జనవరి 8న బర్మాలోని మైత్కినాలో జన్మించింది.[7] తండ్రి గోపాల్ చంద్ర బెనర్జీ న్యాయవాది.[7] రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, కుటుంబంతో కలకత్తా నగరానికి వచ్చాడు.[7][8][9]

వ్యక్తిగత జీవితం

మార్చు

సుప్రియకు 1954లో బిశ్వనాథ్ చౌదరిని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె (సోమ) జన్మించింది.[10] ఈ జంట 1958లో విడాకులు తీసుకున్నారు. 1963లో మహానాయక్ ఉత్తమ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. [11][12][13]

సినిమారంగం

మార్చు

నిర్మల్ డే దర్శకత్వంలో ఉత్తమ్ కుమార్ నటించిన బసు పరిబార్ (1952)లో సినిమాతో సినిమారంగంలోకి అడగుపెట్టింది. ప్రణబ్ రే దర్శకత్వం వహించిన ప్రార్థన (1952)లో కూడా నటించింది.[2] తర్వాత కొంత విరామం తీసుకుని, సుశీల్ మజుందార్ దర్శకత్వంలో మర్మబాని (1958)లో నటించిది.[2] మంగళ్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఉత్తమ్ కుమార్ బ్లాక్ బస్టర్ సోనార్ హరీన్ (1959),[4] మేఘే ధాకా తార (1960), షునో బరానారి (1960), కోమల్ గంధార్ (1961), స్వరాలిపి (1961), అగ్నిసంస్కర్ (1961) వంటి సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. సదాశివరావు కవి దర్శకత్వంలో వచ్చిన బెగానా (1963) హిందీ సినిమాలో ధర్మేంద్ర సరసన నటించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[2]

సినిమాలు

మార్చు
  1. ది నేమ్‌సేక్ (2006) అషిమా అమ్మమ్మగా
  2. అర్జున్ అమర్ నామ్ (2003)
  3. ఏక్తి నాదిర్ నామ్ (2002)
  4. శేష్ తికాన (2000) శ్రీరాధ అమ్మమ్మగా
  5. ఆత్మీయ స్వజన్ (1998)
  6. హనీమూన్ (1992)
  7. కరి దియే కిన్లం
  8. ఇమాన్ కళ్యాణ్ (1982)
  9. కలాంకిణి కంకబాటి (1981)
  10. ఉత్తర మెలేని (1981)
  11. దుయి పృథిబి (1980)
  12. దేబ్దాస్ (1979) చంద్రముఖి
  13. బహ్నిశిఖ
  14. దుయ్ పురుష్ (1978) బిమలాగా
  15. సంధ్యా రాగ్ (1977)
  16. సబ్యసాచి (చిత్రం) (1977)
  17. సన్యాసి రాజా (1975)
  18. భోలా మోయిరా
  19. సిస్టర్
  20. జాడి జాంతేం (1974) సుజాతగా
  21. బాగ్ బోండి ఖేలా (1975)
  22. రక్తతిలక్ (1975) బినాటగా
  23. బోన్ పలాశిర్ పాదబలి (1973) పద్మగా
  24. అంధా అతిత్ (1972)
  25. చిన్నపాత్ర
  26. బిలంబితా లాయ్ (1970)
  27. దుతీ సోమ (1969)
  28. చిరాడినర్ (1969)
  29. మోన్ నియే (1969)
  30. సబర్మతి (1969) హిరేన్ నాగ్ ఛాయా దేబి
  31. జిబాన్ మృత్యువు
  32. చౌరింగ్‌హీ (1968) కరాబి గుహాగా
  33. తీన్ అధయాయ్ (1968)
  34. కల్ తుమీ అలేయా (1966) డా. లబణ్య సర్కార్‌గా
  35. శుదు ఏక్తి బచ్చర్ (1966)
  36. ఆప్ కి పర్చైయాన్ (1964) ఆశాగా
  37. దూర్ గగన్ కీ చావోం మే (1964) మీరాగా
  38. నిశితే
  39. లాల్ పత్తర్ (1964)
  40. బెగానా (1963)
  41. సూర్య శిఖ (1963)
  42. ఉత్తరాయణ్ (1963)
  43. స్వరలిపి
  44. కోమల్ గాంధర్ (1961) అనసూయగా
  45. మధ్య రేటర్ తారా (1961)
  46. మేఘే ధాకా తార (1960) నీతాగా
  47. నాతున్ ఫసల్ (1960)
  48. సునో బరానారి (1960)
  49. సోనార్ హరీన్ (1959)
  50. ఆమ్రపాలి
  51. బసు పరిబార్ (1952) సుఖేన్ సోదరిగా

అవార్డులు

మార్చు
  • ఫిలింఫేర్ అవార్డ్స్ - 1977లో సిస్టర్ సినిమాకి ఉత్తమ నటి అవార్డు
  • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈస్ట్ - లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • పద్మశ్రీ పురస్కారం (2014)- భారతీయ సినిమాకు చేసిన కృషికి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం
  • బంగా విభూషణ్ - 2011లో పశ్చిమ బెంగాల్‌లో అత్యున్నత పౌర పురస్కారం
  • బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు - 1969లో "టిన్ అధయ్" సినిమాకి ఉత్తమ నటి అవార్డు
  • బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు - 1973లో "చిన్నపాత్ర" కోసం ఉత్తమ సహాయ నటి అవార్డు
  • 2001లో కళాకర్ అవార్డ్స్- లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సుప్రియ తన 85 సంవత్సరాల వయస్సులో 2018, జనవరి 26న గుండెపోటుతో కోల్‌కతాలో మరణించింది.[14]

మూలాలు

మార్చు
  1. "Supriya Choudhury movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2 మే 2019. Retrieved 17 July 2019.
  2. 2.0 2.1 2.2 2.3 Chatterji, Shoma (1 August 2003). "50 years of Supriya Devi". Screen Weekly. Indian Express Newspapers (Mumbai) Ltd. Archived from the original on 27 September 2007. Retrieved 2022-03-19.
  3. Gupta, Ranjan Das (24 March 2017). "'I never expected too much'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 31 January 2018.
  4. 4.0 4.1 Correspondent, Special (2 February 2018). "Bengali actor Supriya Choudhury passes away". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-19.
  5. "State honours nine with Banga-Vibhushan", timesofindia.indiatimes.com; accessed 2 February 2018.
  6. "Vidya Balan, Paresh Rawal get Padma Shri". Daily News and Analysis. 25 January 2014. Retrieved 2022-03-19.
  7. 7.0 7.1 7.2 "আমি সেই মেয়ে : সুপ্রিয়া দেবী". Prothom Alo. 12 March 2015. Archived from the original on 9 డిసెంబరు 2017. Retrieved 18 మే 2022.
  8. "Biography for Supriya Choudhury". Supriya Choudhury. Internet Movie Database Inc. Retrieved 2022-03-19.
  9. "Padma Shri awardee Supriya Devi passes away at 83". The Economic Times. 2018. Archived from the original on 2018-01-27. Retrieved 2022-03-19.
  10. "দাদা আমি বাঁচতে চাই". Anandabazar Patrika. Retrieved 2022-03-19.
  11. "Selling Uttam?". The Times of India. Retrieved 2022-03-19.
  12. "Details". www.epaper.eisamay.com. Archived from the original on 2018-02-05. Retrieved 2022-03-19.
  13. "Actor Supriya Devi's legacy was more than just being Uttam Kumar's heroine". dailyo.in. 26 January 2018.
  14. Bengali Actor Supriya Devi Dies, Mamata Banerjee Offer Condolences, NDTV; accessed 2022-03-19.

బయటి లింకులు

మార్చు