సుప్రియ శ్రీనతే
సుప్రియ శ్రీనతే (ఆంగ్లం: Supriya Shrinate) ఒక భారతీయ రాజకీయవేత్త. మాజీ పాత్రికేయురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసారు.[6][7] ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[8][9][10][11] 2022లో ఆమె కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతి.
సుప్రియ శ్రీనతే | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | మహారాజ్‌గంజ్, ఉత్తర ప్రదేశ్ |
జాతీయత | ఇండియన్ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్[1][2] |
నైపుణ్యం | రాజకీయ నాయకురాలు, జర్నలిస్ట్[3][4][5] |
18 ఏళ్ల పాటు సుప్రియ శ్రీనతే జర్నలిస్టుగా పనిచేసింది. ఆమె ఇండియా టుడేతో తన వృత్తిని ప్రారంభించింది, తర్వాత ఆమె ఇన్డీటీవిలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరింది. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు టైమ్స్ గ్రూప్ వారి ఈటీ నౌలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నది.[12][13][14][15]
జీవితం తొలి దశలో
మార్చుసుప్రియ శ్రీనతే మాజీ ఎంపీ హర్షవర్ధన్ కుమార్తె.[16] ఆమె లక్నోలోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో చదువుకుంది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రురాలైంది.[17]
జర్నలిజం
మార్చుప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా సుప్రియ శ్రీనతే పనిచేసింది. 2001లో ఇండియా టుడే టీవీ ఛానల్ ప్రత్యేక కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. 2004లో ఎన్డీటీవీలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరింది. 2008లో ఈటి నౌలో చీఫ్ ఎడిటర్ - న్యూస్‌గా వ్యవహరించింది. ఆమె అదే సంవత్సరం ఈటి నౌకి పాలసీ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఎంపికైంది.[18]
రాజకీయం
మార్చు2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రియ శ్రీనతే ఈటి నౌలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా తన పదవికి రాజీనామా చేసింది.[19][20][21] ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర ప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గం మహరాజ్‌గంజ్ నుంచి పోటీ చేసి 72,516 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.[22] 2019లో ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యింది.[23] కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆమె టీవీ చర్చల్లో పాల్గొన్నది.[24][25][26] ఆమె భారత జాతీయ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కూడా పాల్గొంది.[27] అదే సంవత్సరం సుప్రియ శ్రీనతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఛైర్మన్‌గా నియమితులయ్యింది.[28]
మూలాలు
మార్చు- ↑ "कांग्रेस ने Supriya Shrinate को All India Congress Committee का प्रवक्ता नियुक्त किया, जानिए कौन हैं सुप्रिया". News Nation (in హిందీ). Retrieved 2019-09-21.
- ↑ "Supriya Shrinate appointed as spokesperson of All India Congress Committee". Wion (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Congress Appoints TV Journalist Supriya Shrinate as AICC Spokesperson". News 18 (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Cong Chooses Journo Over Jailed Ex-Minister's Daughter for UP Seat". Quint (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
- ↑ "Supriya Shrinate appointed AICC spokesperson; ex-journalist contested 2019 Lok Sabha polls from UP's Maharajganj". First Post (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Congress names former-TV journalist Supriya Shrinate as spokesperson". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Supriya Shrinate appointed spokesperson of All India Congress Committee". India Tv (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Congress fields journalist Supriya Shrinate from UP's Maharajganj". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
- ↑ "Cong fields journo Supriya Shrinate from Maharajganj". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
- ↑ "Supriya Shrinate(Indian National Congress(INC)):Constituency-MAHARAJGANJ (UTTAR PRADESH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-07-27.
- ↑ "Modi government adding salt to injury by keeping commodity prices high: Congress". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
- ↑ "Journalist turned politician, Supriya Shrinate is the newest Congress spokesperson". HW News (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "Cong appoints former journalist Supriya Shrinate as spokesperson". UNI (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
- ↑ "सरकार एक लोन मेला और लगवा दे ताकि लोग लोन लेकर पेट्रोल-डीजल और रसोई गैस खरीद सकें: कांग्रेस". India Tv (in హిందీ). Retrieved 2021-07-01.
- ↑ "न्यूज़ ऐंकर सुप्रिया को कांग्रेस का टिकट मिलने की पूरी कहानी". Lallantop (in హిందీ). Archived from the original on 2020-09-25. Retrieved 2019-03-29.
- ↑ "कांग्रेस ने पूर्व पत्रकार सुप्रिया श्रीनाते को राष्ट्रीय प्रवक्ता बनाया, पिता भी दो बार सांसद रहे". Bhaskar (in హిందీ). Retrieved 2021-07-27.
- ↑ "Supriya Shrinate: Age, Biography, Education, Husband, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
- ↑ "Supriya Shrinate steps down as Executive Editor, ETNow; joins Congress - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
- ↑ Rampal, Nikhil (30 March 2019). "Can journalist-turned-politician Supriya Shrinate anchor UP's Maharajganj Lok Sabha seat?". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
- ↑ "LS Polls: Congress fields journalist Supriya Shrinate from Maharajganj". Deccan Chronicle (in ఇంగ్లీష్). 29 March 2019. Retrieved 10 November 2021.
- ↑ "'If You Want to Curb Fake News, Control BJP's IT Cell': Supriya Shrinate on IT Rules". The Wire. Retrieved 10 November 2021.
- ↑ "Maharajganj Elections 2019: Uttar Pradesh Lok Sabha Constituency Poll Dates, Parliamentary Election, Candidates". Firstpost. Retrieved 5 December 2021.
- ↑ "Congress appoints Supriya Shrinate as spokesperson". The Indian Express (in ఇంగ్లీష్). 21 September 2019. Retrieved 10 November 2021.
- ↑ Sharma, Unnati (31 May 2021). "Congress' Supriya Shrinate calls BJP's Sambit Patra 'naali ka keeda', he trends #GaliWaliMadam". ThePrint. Retrieved 10 November 2021.
- ↑ "बीच में मत बोलिये- न्यूज एंकर से बोलीं सुप्रिया श्रीनेत, मिला जवाब- कांग्रेस की रैली नहीं चल रही". Jansatta (in హిందీ). Retrieved 10 November 2021.
- ↑ "Punjab: No space for anger in politics, Supriya Shrinate tells Captain Amarinder; ex-CM hits back". PTC News (in ఇంగ్లీష్). 23 September 2021. Retrieved 10 November 2021.
- ↑ "Sonia Gandhi, Manmohan Singh among Congress star campaigners for phase-1 UP polls". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-24. Retrieved 2022-04-14.
- ↑ "Congress appoints Supriya Shrinate as new social media head". India TV (in ఇంగ్లీష్). 2022-06-20. Retrieved 2022-06-20.